Homeఎంటర్టైన్మెంట్Chiranjeevi And Balakrishna: చిరంజీవి,బాలయ్య, వెంకటేష్ , నాగార్జున లను కలిపి రాజమౌళి సినిమా చేయబోతున్నాడా..?

Chiranjeevi And Balakrishna: చిరంజీవి,బాలయ్య, వెంకటేష్ , నాగార్జున లను కలిపి రాజమౌళి సినిమా చేయబోతున్నాడా..?

Chiranjeevi And Balakrishna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ హీరోలకు చాలా మంచి రెస్పెక్ట్ అయితే ఉంది. వాళ్ళు చేసే సినిమాలను ప్రేక్షకులు ఇప్పటికీ ఆదరిస్తున్నారు. నిజానికి వాళ్లు ఒకప్పుడు తెలుగు సినిమా ఇస్త్రీ కి టార్చ్ బేరర్లు గా మారారు. అందుకే వాళ్ళ హవా కొనసాగుతుంది. ఇక అలాంటి సందర్భంలోనే చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున లాంటి హీరోలు ఈ మధ్యకాలంలో వరుస సినిమాలను చేస్తూ సక్సెస్ లను సాధిస్తున్నారు. ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ […]

Chiranjeevi And Balakrishna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ హీరోలకు చాలా మంచి రెస్పెక్ట్ అయితే ఉంది. వాళ్ళు చేసే సినిమాలను ప్రేక్షకులు ఇప్పటికీ ఆదరిస్తున్నారు. నిజానికి వాళ్లు ఒకప్పుడు తెలుగు సినిమా ఇస్త్రీ కి టార్చ్ బేరర్లు గా మారారు. అందుకే వాళ్ళ హవా కొనసాగుతుంది. ఇక అలాంటి సందర్భంలోనే చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున లాంటి హీరోలు ఈ మధ్యకాలంలో వరుస సినిమాలను చేస్తూ సక్సెస్ లను సాధిస్తున్నారు. ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ దశ దిశా మార్చిన హీరోలు కూడా వీళ్లే కావడం విశేషం…డిఫరెంట్ సినిమాలు చేసి ప్రేక్షకుల్లో ఒక కొత్త ఉత్తేజాన్ని నింపిన నటులు కూడా వీళ్లే కావడం విశేషం… ఇక ఇలాంటి క్రమంలోనే ఈ నలుగురు హీరోలు కలిసి ఒక్క సినిమాలో నటిస్తే చూడాలని ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. కానీ అప్పటినుంచి ఇప్పటివరకు ఇది సాధ్యం కాలేదు. రీసెంట్ గా చిరంజీవి, వెంకటేష్ ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమాలో కలిసి నటించారు. ఇక ఇప్పుడు వీళ్ళు నలుగురు కలిసి నటిస్తే చూడాలని ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఇప్పుడు రాజమౌళి వీళ్ళ నలుగురిని కలిపే సాహసం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో వారణాసి అనే సినిమా చేస్తున్నాడు. ఇక దాని తర్వాత ఆయన ‘మహాభారతం’ సినిమాని చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. ఒకవేళ మహాభారతం సినిమా కనక చేసినట్లయితే అందులో ఈ నలుగురు హీరోలు కీలకపాత్ర వహించబోతున్నారట.

ఇక దానికి తోడుగా వీళ్ళు నలుగురు కలిసి ఒకే స్క్రీన్ లో కనిపించేటట్టుగా కూడా ఆయన ఏర్పాట్లు చేయబోతున్నాడనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇక ఇందులో ఎవరెవరు ఏ క్యారెక్టర్ని పోషిస్తారు అనే విషయంలో సరైన క్లారిటి ఇవ్వలేదు.

కానీ మొత్తానికైతే వీళ్ళ నలుగురిని ఒక స్క్రీన్ మీద కనబడేలా చేసి తెలుగు ప్రేక్షకుల ఎమోషన్ ను క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశ్యంలో రాజమౌళి ఉన్నాడనే వార్తలు వస్తున్నాయి. మరి వీళ్ళతో ఆయన ఎలాంటి సాహసం చేయబోతున్నాడు. ఈ నలుగురిని స్క్రీన్ మీద ఎలా చూపిస్తాడు ప్రేక్షకుల్లో ఎలాంటి రెస్పాన్స్ ను రాబడతాడు అనేది తెలియాల్సి ఉంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper