Homeఎంటర్టైన్మెంట్'బిగ్ బాస్ 4' ఫైనల్ కి చీఫ్ గెస్ట్ ఫిక్స్ !

‘బిగ్ బాస్ 4’ ఫైనల్ కి చీఫ్ గెస్ట్ ఫిక్స్ !

బిగ్‌ బాస్ ఫోర్త్‌ సీజన్‌ ఎండింగ్‌ కి వచ్చిన నేపథ్యంలో రోజురోజుకూ ఆట రసవత్తరంగా మారింది. ఇంతకీ ఫోర్త్ వెర్షన్ టైటిల్‌ విన్నర్ ఎవరవుతారు అనేదానిపై ఎంత ఆసక్తి ఉందో.. చీఫ్ గెస్ట్ ఎవరు రాబోతున్నారు అనేదానిపై ఇంకా ఆసక్తి ఉంది ప్రేక్షకులకు. ఇంతకీ ఏ స్టార్ రాబోతున్నాడు ? ఫినాలేకి సూపర్ స్టార్ మహేష్‌ బాబు రాబోతున్నాడని సోషల్ మీడియాలో ఓ న్యూస్ విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియదు […]

BIgg Boss 4 Telugu
బిగ్‌ బాస్ ఫోర్త్‌ సీజన్‌ ఎండింగ్‌ కి వచ్చిన నేపథ్యంలో రోజురోజుకూ ఆట రసవత్తరంగా మారింది. ఇంతకీ ఫోర్త్ వెర్షన్ టైటిల్‌ విన్నర్ ఎవరవుతారు అనేదానిపై ఎంత ఆసక్తి ఉందో.. చీఫ్ గెస్ట్ ఎవరు రాబోతున్నారు అనేదానిపై ఇంకా ఆసక్తి ఉంది ప్రేక్షకులకు. ఇంతకీ ఏ స్టార్ రాబోతున్నాడు ? ఫినాలేకి సూపర్ స్టార్ మహేష్‌ బాబు రాబోతున్నాడని సోషల్ మీడియాలో ఓ న్యూస్ విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియదు గాని.. బిగ్ బాస్ టీమ్ మాత్రం స్టార్ హీరో కోసం గత కొన్ని రోజులుగా విపరీతంగా ప్రయత్నిస్తున్న మాట వాస్తవం. ఈ క్రమంలోనే మహేష్ రావాలని, లేదు బన్నీ రావాలని.. కాదుకాదు తారక్ వస్తే అదుర్స్ అని ఇలా చాలాచాలా పుకార్లు పుట్టుకొస్తున్నాయి.

Also Read: సీత గురించి రాజమౌళితో ఆలియా ముచ్చట్లు !

అయితే ఈసారి ఫినాలేకి చీఫ్‌గెస్ట్‌గా వచ్చే ఛాన్సెస్‌ ఎన్టీఆర్ కే ఎక్కువని తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ ఒక్కడే షూట్ లేకుండా ఉన్నాడు. ఫైనల్ ఎపిసోడ్ రోజున ఎన్టీఆర్ కి షూట్ లేదట. అదే మహేష్, మిగిలిన హీరోలకు షూట్ ఉంది. పైగా బిగ్ బాస్ తో ఎన్టీఆర్ కి ప్రత్యేక అనుబంధం ఉంది. షోని గ్రాండ్‌గా కంక్లూడ్ చేసే ఆ ఫైనల్‌ ఎపిసోడ్‌కి గెస్ట్ గా ఎవరొచ్చినా రేటింగ్ అదిరిపోతుంది. మరి కింగ్ నాగార్జునకు తోడుగా ఆ డయాస్ మీద ఏ హీరో ఫ్లాష్ ఔతారో చూద్దాం. అయితే, బిగ్ బాస్ సీజన్ 3 ఫినాలేకు మెగాస్టార్ చిరంజీవి అతిధిగా వచ్చారు.

Also Read: కెవ్వు కార్తీక్ దాడి వెనుక కథ !

ఇక నాని హోస్ట్ గా నడిచిన సీజన్ 2 ఫైనల్ ఎపిసోడ్ కి గెస్ట్ గా విక్టరీ వెంకటేష్ రావడం జరిగింది. అందుకే ఈ సీజన్ కోసం క్రేజీ టాప్ స్టార్స్ పేర్లు పరిశీలిస్తున్నారు నిర్వాకులు. బిగ్ బాస్ సీజన్ వన్ కి హోస్ట్ గా వ్యవహరించి ఎన్టీఆర్ సూపర్ సక్సెస్ అయ్యాడు కాబట్టి.. ఎన్టీఆర్ నే గెస్ట్ గా తీసుకువస్తే భారీ ఆదరణ దక్కడం ఖాయం. ఇక బిగ్ బాస్ సీజన్ 4 చివరి దశకు చేరుకుంది. త్వరలో టైటిల్ విన్నర్ ఎవరో తేలిపోనుంది. ఇప్పటికే అఖిల్ ఫైనల్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకోగా, మిగిలిన సభ్యులు టాప్ ఫోర్ కి వెళ్లనున్నారు. విన్నర్ ఎవరో తేలిపోయే ఫైనల్ ఎపిసోడ్ ని మరింత ఆకర్షణీయంగా మార్చడానికి, ఆటను మరింత రసవత్తరంగా మార్చడానికి నిర్వాహకులు గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper