Bigg Boss 10 Telugu: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లోకి భారీ అంచనలతో ఎంట్రీ ఇచ్చిన చరణ్, మొదటి మూడు రోజుల్లోనే ఎలిమినేట్ అయ్యి, ఆ తర్వాత మళ్లీ హౌస్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే. రెండవసారి అవకాశం వచ్చినప్పటికీ ఆయన సరిగా ఉపయోగించుకోకపోవడం తో నిన్న ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. అయితే చరణ్ ఎలిమినేట్ అయిన రెండు సార్లు హౌస్ మేట్స్ ఓట్లతోనే ఎలిమినేట్ అయ్యాడు, ఆడియన్స్ ఓటింగ్ ద్వారా కాదు. బిగ్ బాస్ హిస్టరీ లో హౌస్ మేట్స్ ఓట్లతో ఒకసారి ఎలిమినేట్ అయిన వాళ్ళని చూసాము కానీ, రెండు సార్లు హౌస్ మేట్స్ ఓట్లతో ఎలిమినేట్ అవ్వడం మాత్రం మొట్టమొదటిసారి ఈ సీజన్ లోనే జరిగింది. ఇదంతా పక్కన పెడితే చరణ్ బయటకు వచ్చిన తర్వాత ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఎవరు టైటిల్ విన్నర్ అవుతారు అని అడిగిన ప్రశ్నకు ఆయన ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.
ఆయన మాట్లాడుతూ ‘కొంతమందికి త్రిగున్ చేసేవి నచ్చొచ్చు కాబట్టి , ఆయనకు ఓట్లు వేస్తుండొచ్చు, మరికొంత మందికి రోహిత్ గేమ్ ప్లాన్ నచ్చి ఉండొచ్చు. ప్రస్తుతానికి అంచనా వేయడం కష్టం..రోహిత్, త్రిగున్ మధ్యనే టైటిల్ రేస్ ఉంటుంది’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇదంతా పక్కన పెడితే చరణ్ ని ఇలా ఎలిమినేట్ చేయడం పై సోషల్ మీడియా లో నెటిజెన్స్ నుండి తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడుతోంది. హౌస్ లో అసలు ఏ టాస్కులు ఆడకుండా కూర్చున్న వాళ్ళు చాలా మంది ఉన్నారని , చరణ్ గత వారం కం బ్యాక్ ఇచ్చాడని , ఆయనికి మరొక అవకాశం ఇచ్చి ఉండుంటే చాలా బాగుండేదని , ఆడియన్స్ ఓట్లతో అయితే చరణ్ ఎలిమినేట్ అవ్వడు కాబట్టి , బిగ్ బాస్ టీం ప్లాన్ ప్రకారం హౌస్ మేట్స్ ఓట్లతో చరణ్ ని బయటకు పంపారని అంటున్నారు నెటిజెన్స్.
అంతే కాదు కొంతమంది నెటిజెన్స్ లో చరణ్ రీ ఎంట్రీ ఇస్తాడేమో అనే ఆశలు కూడా ఉన్నాయి. కానీ అది అసాధ్యమని అంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే చరణ్ కి ఇప్పటికే రెండు అవకాశాలు వచ్చాయని , మూడవ అవకాశం ఇచ్చేందుకు బిగ్ బాస్ టీం సుముఖంగా లేదని అంటున్నారు. పైగా ప్రస్తుతానికి హౌస్ లో 16 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఇంకా వైల్డ్ కార్డ్స్ రీ ఎంట్రీలను ఇచ్చుకుంటూ పోతే షో ఇప్పట్లో ముగియదని , అందుకే చరణ్ రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు లేవని అంటున్నారు. నాలుగు వారాలు ఆయన బిగ్ బాస్ హౌస్ లో ఉన్నందుకు దాదాపుగా 4 లక్షల రూపాయిల రెమ్యూనరేషన్ ఇచ్చారట.