Kalki 2 Movie: ప్రభాస్ ‘కల్కి 2’ షూటింగ్ ఈ వారంలోనే పునః ప్రారంభం కానుంది. ప్రభాస్ కూడా ఈ షెడ్యూల్ లో పాల్గొనబోతున్నాడు. ఇప్పటికే ప్రభాస్ లేకుండా కమల్ హాసన్ , అమితాబ్ బచ్చన్ లపై పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. ప్రభాస్ స్పిరిట్ ,ఫౌజీ మూవీ షూటింగ్స్ తో ఫుల్ బిజీ గా ఉండడం వల్ల, కల్కి 2 షూటింగ్ ని కొన్ని రోజులు హోల్డ్ లో పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు ఫౌజీ షూటింగ్ దాదాపుగా పూర్తి అవ్వడం తో , ఆయన ‘కల్కి 2’ కి డేట్స్ ఇచ్చినట్టు సమాచారం. వచ్చే ఏడాది చివరి లోపు ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి.
అయితే ఈ చిత్రం నుండి దీపికా పదుకొనే తప్పుకోవడం అప్పట్లో పెద్ద సెన్సేషనల్ టాపిక్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ తర్వాత సాయి పల్లవి ని హీరోయిన్ గా తీసుకున్నారనే వార్త కూడా బాగా వైరల్ అయ్యింది. అయితే సాయి పల్లవి ని తీసుకున్నాం అనే వార్తలో ఎలాంటి నిజం లేదని డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఒక ఇంటర్వ్యూ లో చెప్తాడు. అయితే రీసెంట్ యానిమల్ మూవీ సెకండ్ హీరోయిన్ త్రిప్తి దిమిరి ని ఫైనల్ చేసినట్టు సమాచారం. ప్రస్తుతం ఈమె ప్రభాస్ ‘స్పిరిట్’ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పుడు వరుసగా రెండవ సారి ప్రభాస్ తో కలిసి నటించబోతుంది. అయితే సాయి పల్లవి ని హీరోయిన్ గా తీసుకోకపోవడానికి గల కారణం ఆమె బిజీ షెడ్యూల్స్ వల్లనే అని టాక్. మరి త్రిపాఠి దిమిరి ని ‘కల్కి 2’ హీరోయిన్ గా ఈ సినిమాకు ఎంత వరకు న్యాయం చేయగలుగుతుందో చూడాలి.
అయితే ఇక్కడ ఒక కామన్ పాయింట్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ‘స్పిరిట్’ చిత్రం లో హీరోయిన్ పాత్ర కోసం ముందుగా దీపికా పదుకొనే ని అనుకున్నారు. కానీ ఆమె రెమ్యూనరేషన్ విషయం లో ఎక్కువ డిమాండ్ చేయడం తో ఆమెని పక్కన పెట్టి త్రిప్తి దిమిరి ని తీసుకున్నారు. ఇప్పుడు ‘కల్కి 2’ విషయం లో కూడా అదే రిపీట్ అయ్యింది. మొదటి భాగం లో హీరోయిన్ గా దీపికా పదుకొనే చేసింది. కానీ రెండవ భాగానికి ఆమె రెమ్యూనరేషన్ భారీగా డిమాండ్ చేయడం తో ఆమెని తప్పించి మరోసారి త్రిప్తి దిమిరి ని పెట్టుకున్నారు. ఈ రెండు సినిమాలు కమర్షియల్ గా పెద్ద హిట్ అయితే , భవిష్యత్తులో త్రిప్తి దిమిరి డామినేషన్ పాన్ ఇండియా లెవెల్ లో వేరే లెవెల్ లో ఉండే అవకాశాలు ఉన్నాయి. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.