spot_img
Homeఎంటర్టైన్మెంట్Jr NTR and Koratala Siva: ఎన్టీఆర్ ఇంటి పక్కనే సెట్.. ఇంతకీ ఆ...

Jr NTR and Koratala Siva: ఎన్టీఆర్ ఇంటి పక్కనే సెట్.. ఇంతకీ ఆ హిందీ హీరో ఎవరు ?

Jr NTR and Koratala SivaJr NTR and Koratala Siva: కూల్ అండ్ క్లాసిక్ డైరెక్టర్ కొరటాల శివ (Koratala Siva) ఎన్టీఆర్ తో ఓ పాన్ ఇండియా సినిమా చేయబోతున్నాడు. నవంబర్ నుంచి ఈ సినిమా షూట్ స్టార్ట్ కానుంది. అందుకే ప్రస్తుతం ఈ సినిమా కోసం భారీ సెట్స్ వేస్తున్నారు. ఇందులో భాగంగా ఓ భారీ సెట్ ప్లాన్ చేస్తున్నారని, పైగా జూబ్లీహిల్స్ లోని ఎన్టీఆర్ ఇంటి పక్కనే ఆ సెట్ నిర్మిస్తున్నారని.. సినిమాలో ఎక్కువ భాగం ఈ సెట్ లోనే ఉంటుందని.. కాబట్టి ఎన్టీఆర్ కి చాలా టైం కలిసివస్తుందని కొరటాల శివనే స్వయంగా చెప్పుకొచ్చాడు.

కాగా సుధాకర్ మిక్కిలినేని, కళ్యాణ్ రామ్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ కి విలన్ గా తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటించబోతున్నాడని ఇప్పటికే రూమర్స్ వినిపించాయి. ఇప్పుడు ఆ పాత్రలో బాలీవుడ్ నటుడు అయితే.. హిందీలో సినిమాకి మంచి మార్కెట్ అవుతుందని కొరటాల ఫీల్ అవుతున్నాడు. మరి హిందీలో ఏ హీరో ఒప్పుకుంటాడో చూడాలి.

ఇక, ఈ సినిమాలో విలన్ కి రైట్ హ్యాండ్ లా తమిళ హీరో అథర్వ మురళీ ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు. అథర్వ పాత్ర వెరీ వైలెంట్ గా ఉంటుందని తెలుస్తోంది. తనదైన సినిమాలతో తమిళంలో హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న అథర్వ, మరి ఎన్టీఆర్ సినిమాతో తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంటాడేమో చూడాలి.

అథర్వ గతంలో హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన గద్దలకొండ గణేష్ సినిమాలో నటించాడు. కొంతకాలం తమిళంలో హీరోగా సెటిల్ అవ్వడానికి నానా పాట్లు పడుతున్నాడు. ఇక కొరటాల ఓ హాలీవుడ్ సినిమా ప్రేరణతో ఈ సినిమా కథ రాసుకుని, తెలుగు నేటివిటీకి తగ్గట్లు కొన్ని మార్పులు చేశారని టాక్. అన్నట్టు ఏప్రిల్‌ 22, 2022న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు రానుంది.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Bandla Ganesh

Bandla Ganesh: నిర్మాత బండ్ల గణేష్ కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు.. ఇక అయిపోయినట్టే..

Bandla Ganesh: ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ కి సుప్రీం కోర్టు నుండి చాలా పెద్ద ఎదురుదెబ్బ నే తగిలింది. తనకు ఉన్నటువంటి స్థిరాస్తిని యూనియన్ బ్యాంకు వేలం వేయడాన్ని సమర్థిస్తూ...
India vs Zimbabwe

India vs Zimbabwe: టీమ్ ఇండియా వర్సెస్ జింబాబ్వే: అయ్యర్ సేన మీదనే ఒత్తిడి.. ఎందుకంటే

India vs Zimbabwe:  తెగించిన వాడికి తెడ్డే లింగం అన్నట్టుగా.. ఇటీవల టీమిండియాతో జరిగిన రెండు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో ఐర్లాండ్ ఆడింది. ఏకంగా రెండు మ్యాచ్లు గెలిచి.. టీమిడియాకు...
Delhi Cockroach Protest

Delhi Cockroach Protest: ఢిల్లీలో కాక్రోచ్ లో నిరసన.. ముంబై, హైదరాబాద్ నుంచి ఆర్డర్లు.. ఏంటీ వింత పరిస్థితి..

Delhi Cockroach Protest: కొద్దిరోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో పాలుపంచుకున్న వారిని శిక్షించాలని.. కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలని...
PM Modi Tweet

PM Modi Tweet: ఆందోళనల వేళ ప్రధాని మోడీ ట్విట్.. ఢిల్లీలో జరగబోయేది ఇకపై అదే

PM Modi Tweet: కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళనలు జరుగుతున్నాయి. ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో పోలీసుల రంగంలోకి దిగారు. లాఠీలకు పని చెబుతున్నారు. ఆందోళనకారులు కూడా ఊరుకోవడం...
Jana Nayakudu Movie Review

Jana Nayakudu Movie Review: జన నాయకుడు మూవీ రివ్యూ : బలవంత కచేరీ!

Jana Nayakudu Movie Review: నటీనటులు: విజయ్, పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి తదితరులు సంగీత దర్శకుడు: అనిరుధ్ రవిచందర్ ఛాయాగ్రహణం: సత్యన్ సూరియన్ ఎడిటర్:...
Oktelugu Epaper