Bigg Boss Telugu 8: ఈ వారం టాస్కులు మొత్తం ఫైర్ మీద జరిగాయి. సీజన్ లో ఎలాంటి టాస్కులు ఉండాలని ప్రేక్షకులు కోరుకున్నారో, అలాంటి టాస్కులు ఈ వారం పెట్టాడు బిగ్ బాస్. ముఖ్యంగా నిఖిల్ , పృథ్వీ అయితే తమ క్లాన్ కోసం ప్రాణాలను పణంగా పెట్టి టాస్కులు ఆడారు. ఎక్కడ కాళ్ళు చేతులు విరిగిపోతాయేమో అని చూసే ఆడియన్స్ భయపడ్డారు. ఆ రేంజ్ లో ఆడారు. అయితే టాస్కులు మొత్తం పూర్తి అయ్యాక మెగా చీఫ్ కంటెండర్స్ గా విష్ణు ప్రియ, ప్రేరణ, నిఖిల్, పృథ్వీ, టేస్టీ తేజ నిలిచారు. కంటెండర్స్ అయ్యేందుకు ఈ రేంజ్ టాస్కులు పెట్టారంటే, ఇక కంటెండర్స్ కి ఏ రేంజ్ టాస్కులు పెడుతారో అని ఊహించిన కంటెస్టెంట్స్ అందరికీ బిగ్ బాస్ ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. ఈసారి మెగా చీఫ్ అయ్యేందుకు టాస్కులు పెట్టకుండా, హౌస్ మేట్స్ అభిప్రాయం ద్వారా ఎన్నుకునే పద్దతి ని ప్రవేశపెట్టాడు. ఇది ప్రతీ బిగ్ బాస్ సీజన్ లో ఉండేదే.
అయితే హౌస్ మేట్స్ మొత్తం విష్ణు ప్రియ ని మెగా చీఫ్ గా ఎన్నుకున్నట్టు తెలుస్తుంది. ఒక్క యష్మీ, నబీల్ తప్ప ఓజీ క్లాన్ లో దాదాపుగా అందరూ కంటెండర్స్ రేస్ లో ఉన్నారు. దీంతో రాయల్ క్లాన్ సభ్యులు ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళ ఓటింగ్ కీలకం అయ్యింది. నిఖిల్ ఎలాగో నాలుగు సార్లు చీఫ్ అయ్యాడు కాబట్టి ఆయన్ని ఎంచుకోరు. యష్మీ కి మొదటి నుండి ప్రేరణ మెగా చీఫ్ అవ్వాలని ఉంది కాబట్టి ఆమె ప్రేరణకి ఓటు వేస్తుంది, ఇక నబీల్ నిఖిల్ కి వేయొచ్చు, అదే సమయంలో ప్రేరణ కి కూడా ఓటు వేయొచ్చు. ఇక రాయల్ క్లాన్ ఓటింగ్ వద్దకు వస్తే వాళ్లకు ప్రేరణ అంటే అసలు ఇష్టం ఉండదు. ఒక్క అవినాష్ మెహబూబ్ మాత్రమే ప్రేరణకి సపోర్టు చేసి ఉండొచ్చు. పృథ్వీ ఇప్పటి వరకు మెగా చీఫ్ అవ్వలేదు, కష్టపడి ఆడాడు అని ఎవ్వరూ ఆయన మీద జాలి చూపించలేదు. ముఖ్యంగా హరి తేజ, రోహిణి, అవినాష్ వంటి వారికి పృథ్వీ అంటే పీకల దాకా కోపం ఉంటుంది.
వాళ్ళ ఓట్లు కచ్చితంగా విష్ణు ప్రియ కి పడుంటాయి. అలా ఓవరాల్ గా అత్యధిక ఓట్లు రావడంతో విష్ణు ప్రియ హౌస్ కి కొత్త మెగా చీఫ్ గా మారింది. ఒక్క టాస్క్ కూడా సరిగా ఆడకుండా మెగా చీఫ్ అవ్వడం బహుశా ఈ సీజన్ లో విష్ణు ప్రియకే జరిగింది అని అనుకోవచ్చు. విష్ణు ప్రియ కి ప్రేరణ కి మొదటి ఈమధ్య పడట్లేదు అనే విషయం తెలిసిందే. ఇప్పుడు మెగా చీఫ్ అయ్యాక ప్రేరణ రియాక్షన్ ఎలా ఉండి ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇది ఇలా ఉండగా విష్ణు ప్రియ మెగా చీఫ్ అయినా, పృథ్వీ అయినా ఒక్కటే. వచ్చే వారం పృథ్వీ నామినేషన్స్ లోకి వస్తే కచ్చితంగా విష్ణు ప్రియ సేఫ్ చేయొచ్చు.
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read MoreWeb Title: Bigg boss telugu 8 vishnu priya as the new mega chief of the house
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com