spot_img
Homeఎంటర్టైన్మెంట్Bigg Boss Telugu 8: నిఖిల్ ని విసిరికొట్టి నభీల్ పై దూసుకెళ్లిన గౌతమ్..'నా అమ్మ...

Bigg Boss Telugu 8: నిఖిల్ ని విసిరికొట్టి నభీల్ పై దూసుకెళ్లిన గౌతమ్..’నా అమ్మ మీద ఒట్టు..బిగ్ బాస్ నుండి బయటకి పోతా’ అంటూ అరుపులు!

Bigg Boss Telugu 8: ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో టాస్కులు మరో లెవెల్ లో ఉండబోతుంది అని నిన్నటి ఎపిసోడ్ లో మీ అందరికీ అర్థం అయ్యే ఉంటుంది. నిన్న చూసింది కేవలం టీజర్ మాత్రమే, నేడు అసలు సిసలు టాస్క్ మొదలు అవ్వబోతుంది. నిన్న హౌస్ లో ఎంటర్టైన్మెంట్ టాస్క్ తో బిగ్ బాస్ ని అవినాష్, రోహిణి అలరించడంతో బిగ్ బాస్ కిచెన్ సమయాన్ని రెండు గంటలు పొడిగిస్తాడు. ఆ తర్వాత ఓవర్ స్మార్ట్ ఫోన్స్ మరియు ఓవర్ స్మార్ట్ ఛార్జర్స్ టాస్క్ ఇస్తాడు బిగ్ బాస్. ఓజీ క్లాన్ ఓవర్ స్మార్ట్ ఛార్జర్స్ అవ్వగా, రాయల్ క్లాన్ ఓవర్ స్మార్ట్ ఫోన్స్ గా బిగ్ బాస్ ప్రకటిస్తాడు. ఓజీ క్లాన్ మొత్తం గార్డెన్ ప్రాంతం లో ఉండాలి, అలాగే రాయల్ క్లాన్ మొత్తం హౌస్ లోపల మాత్రమే ఉండాలి. ఈ టాస్క్ నిన్నట్టి ఎపిసోడ్ లో చివరి 15 నిమిషాలు మాత్రమే జరిగింది. కంటెస్టెంట్స్ ఒకరిపై ఒకరు దారుణంగా ఫిజికల్ అయ్యారు.

అవినాష్ చాలా తెలివిగా నభీల్ వెనుక దొంగ చాటుగా వచ్చి ఛార్జింగ్ పెట్టుకొని పోతాడు. ఇక నయనీ పావని అయితే యష్మీ ని కిందకి తోసి, ఆమె పైకి ఎక్కి ఛార్జింగ్ పెట్టుకుంది. ఇలా వీళ్ళు ఫిజికల్ గా ఆదుకునే విధానం చూస్తే ఎవరికో ఒకరికి కచ్చితంగా దెబ్బలు తగిలేలా అనిపిస్తుంది. ఇదంతా పక్కన నేటి ఎపిసోడ్ లో మణికంఠ వాష్ రూమ్ కి వెళ్లడంతో అసలు గొడవ మొదలు అవుతుంది. ఆ తర్వాత ఓజీ క్లాన్ మొత్తం వాష్ రూమ్ వైపు దూసుకొని పోగా , రాయల్ క్లాన్ సభ్యులు అడ్డుకుంటారు. ముఖ్యంగా గౌతమ్ నిఖిల్, నభీల్ ని అడ్డుకుంటాడు. నభీల్ గౌతమ్ తో మాట్లాడుతూ ‘నువ్వు నీ మోచేతితో గట్టిగా ముఖం మీద గుద్దావు’ అని అంటాడు. నేను గుద్దలేదు అని గౌతమ్ గట్టిగా అరిచి చెప్తాడు. ఆ కోపం లో గౌతమ్ తాను గట్టిగా పట్టుకున్న నిఖిల్ ని పక్కకి విసిరి కొడుతాడు.

నిఖిల్ కి పాపం బాగా దెబ్బలు తగుల్తాయి. ఆ తర్వాత గౌతమ్ ని కొట్టేందుకు నిఖిల్ దూసుకొని పోగా, ప్రేరణ అతన్ని ఆపుతుంది. నభీల్ నువ్వు కావాలని ఫిజికల్ అయ్యావు అంటూ గౌతమ్ పై అరుస్తూ ఉంటాడు. అప్పుడు గౌతమ్ ‘నేను కొట్టినట్టు ఉంటే, నా అమ్మ మీద ఒట్టు, బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి పోతా’ అని అంటాడు. అప్పుడు నిఖిల్ ‘పోపో’ అని అరుస్తాడు. అలా ఈ టాస్క్ మొత్తం ఫుల్ ఫైర్ మీద జరిగింది. అందరికీ దెబ్బలు చాలా గట్టిగా తగిలాయి. కానీ గౌతమ్ తో నిఖిల్, నభీల్ పడిన గొడవలో ఎవరిది తప్పు, ఎవరిదీ ఒప్పు అనేది నేటి ఎపిసోడ్ పూర్తిగా చూస్తే తెలుస్తుంది. ఇవంతా చూస్తుంటే వీకెండ్ నాగార్జున నుండి హౌస్ మేట్స్ కి ఫుల్ కోటింగ్ పడే అవకాశాలు ఉన్నాయి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Narendra Modi Strategy: ఢిల్లీ కాక్రోచ్‌లపై మోదీ హిట్‌ వ్యూహం.. దెబ్బకు దిగొచ్చిన ఆందోళనకారులు!

Narendra Modi Strategy: నీట్‌ పేపర్‌ లీకేజీకి వ్యతిరేకంగా ఢిల్లీలో మొదలైన ఉద్యమం క్రమంగా దేశంలోని పలు ప్రాంతాలకు విస్తరించింది. ఢిల్లీలో సీజేపీ నాయకత్వంలో సాగుతున్న ఈ ఆందోళనకు ఇతర రాష్ట్రాల్లో రాజకీయ...
SS Rajamouli

SS Rajamouli: వారణాసి బడ్జెట్ పెరగడం మీద స్పందించిన రాజమౌళి…

SS Rajamouli: మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'వారణాసి' సినిమా మీద ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలైతే ఉన్నాయి. మొదట 1000 కోట్ల బడ్జెట్ తో తీసేద్దాం అనుకోని ఈ సినిమాని...
Three Sisters Marry One Man

Three Sisters Marry One Man: ఒక యువకుడితో ముగ్గురు పెళ్లి చేసుకుందే కాక.. దారుణం.. ఇది ఊహించని...

Three Sisters Marry One Man: దేశవ్యాప్తంగా కొద్దిరోజులుగా నీట్ గురించి రచ్చ రచ్చ జరుగుతుంటే.. ముగ్గురు అక్కా చెల్లెళ్లు మాత్రం మీడియం మొత్తం తన వైపు తిప్పుకున్నారు. తమ గురించి మాట్లాడుకునే...
Balakrishna

Balakrishna: బాలయ్య ఈ ఇద్దరు లేకుండా సినిమా చేయడం లేదుగా…

Balakrishna: నందమూరి నటసింహం బాలయ్య బాబు చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. రీసెంట్ గా ఆయన చేసిన 'అఖండ 2' సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోయిన...
YSR Congress Party

YSR Congress: గోదావరి జిల్లాలో వైసీపీకి షాక్!

YSR Congress: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి సీనియర్ నేత ఒకరు గుడ్ బై చెప్పారు. పదేళ్లుగా పార్టీని బలోపేతం చేస్తున్న అతనిని కాదని వేరే వ్యక్తికి ప్రాధాన్యం...
Oktelugu Epaper