Bigg Boss Telugu 8: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో మాస్కులు వేసుకొని తిరుగుతున్న కంటెస్టెంట్స్ 50 రోజుల్లోపే మాస్కులు తొలగించేసుకుంటున్నారు. ముఖ్యంగా నభీల్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఈ సీజన్ ప్రారంభం లో హౌస్ లో ఉన్న నిజాయితీ గల కంటెస్టెంట్స్ లో ఒకరిగా నభీల్ ని జనాలు అనుకున్నారు. ప్రతీ విషయంలో న్యాయంగా ఆలోచిస్తాడని, టాస్కులు కూడా అద్భుతంగా ఆడుతాడని అందరికి నభీల్ పై మంచి అభిప్రాయం ఏర్పడింది. అందుకే ఆయనకు నామినేషన్స్ లోకి వచ్చినప్పుడల్లా టాప్ 2 రేంజ్ లో ఓటింగ్స్ పడుతున్నాయి. అయితే గత వారం నుండి నభీల్ మెల్లగా తన ముసుగు ని బయట పెడుతూ, ఒరిజినల్ క్యారక్టర్ ని చూపిస్తున్నాడు. గత వారం ప్రేరణ విషయంలో అసూయతో రగిలిపోతూ హౌస్ మేట్స్ అందరి దగ్గర ఆమె గురించి చెడుగా మాట్లాడగా, ఈ వారం తన సొంత కమ్యూనిటీ ఓట్ల గురించి మెహబూబ్ తో మాట్లాడుతూ ఎంత ప్లానింగ్ తో వచ్చాడో అందరికీ అర్థం అయ్యేలా చేసాడు. అంతే కాదు గత వారం మెహబూబ్ ని ఐటమ్స్ బ్యాలన్స్ టాస్క్ లో ఉద్దేశపూర్వకంగానే గెలిపించినట్టు నిన్న తెలిసిపోయింది.
నభీల్ మెహబూబ్ తో మాట్లాడుతూ మొన్నటి టాస్క్ లో నేను నీకు సహాయం చేశాను, గుర్తు పెట్టుకో, ఈసారి నువ్వు నాకు సహాయం చేయాలి అని అంటాడు. మెహబూబ్ కూడా అందుకు తల ఊపుతాడు. ఇవన్నీ నిన్నటి ఎపిసోడ్ లో చూపించలేదు కానీ, హాట్ స్టార్ లోని లైవ్ స్ట్రీమింగ్ లో అందరూ చూసారు , సోషల్ మీడియా లో కూడా ఆ వీడియో వైరల్ అయ్యింది. అంతే కాదు ఇతను బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టే ముందు చాలా ప్రీ ప్లాన్ తో వచ్చాడని అందరికీ అర్థం అయిపోయింది. నామినేషన్స్ లోకి వచ్చినప్పుడు తనని సేవ్ చేయాల్సిందిగా వీడియోస్ ప్రీ ప్లాన్ గా చేసుకొని వచ్చాడు. అలా చేసుకోవడం లో తప్పు లేదు, కానీ ఆ నామినేషన్స్ ని తెలుగు లో కాకుండా హిందీ లో అడుగుతాడు. ఒక తెలుగు రియాలిటీ షోలోకి అడుగు పెట్టి, తెలుగు లో కాకుండా హిందీ లో ఓట్లు అడిగిన మొట్టమొదటి కంటెస్టెంట్ గా నభీల్ నిల్చిపోయాడు. అంటే ఇక్కడ స్పష్టంగా అర్థం అయ్యేది ఏమిటంటే, ఇతను తన కమ్యూనిటీ ఓట్లను నమ్ముకున్నాడు, వాళ్లనే టార్గెట్ చేస్తున్నాడు అని. అదంతా పక్కన పెడితే ఈయన అన్నయ్య నిన్న గౌతమ్ కృష్ణ ని తిడుతూ, సోషల్ మీడియా లో అప్లోడ్ చేసిన ఒక వీడియో తెగ వైరల్ గా మారింది.
‘అరేయ్ గౌతమ్ కృష్ణ..అశ్వథామ 2.0 అంటే ఆగం ఆగం అయిపోతున్నావ్. అంత భయపడేవాడివి బిగ్ బాస్ హౌస్ లోకి ఎందుకు వచ్చినావ్. డైపర్లు వేసుకొని తిరుగు’ అంటూ చెప్పుకొచ్చాడు. ఒక కంటెస్టెంట్ కి సంబంధించిన కుటుంబ సభ్యులు, హౌస్ లో ఉన్న మరో కంటెస్టెంట్ పై ఇలాంటి తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి, రోజురోజుకి నభీల్ దిగజారిపోతున్నాడు. స్టార్ మా టీం, నాగార్జున ఇతనికి జరిగే డ్యామేజ్ ని కంట్రోల్ చేసేందుకే ఉన్నారు కానీ, అతన్ని నిలదీసే ధైర్యం చేయడం లేదు, కనీసం ఈ వారం అయినా నాగార్జున నభీల్ పై గొంతు లేపుతాడో లేదో చూడాలి.
Nabeel’s brother comments on #Gautham #BiggBossTelugu8
pic.twitter.com/vvu1xWoENV— World Discovery By SP (@WorldDiscoverSP) October 16, 2024
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read MoreWeb Title: Bigg boss telugu 8 nabeels brother comments on gautham
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com