Homeఎంటర్టైన్మెంట్బిగ్ బాస్ లీక్: విన్నర్, రన్నర్ ఎవరో కూడా తెలిసిపోయింది!

బిగ్ బాస్ లీక్: విన్నర్, రన్నర్ ఎవరో కూడా తెలిసిపోయింది!

బిగ్ బాస్ సీజన్ 4 గ్రాండ్ ఫినాలే నేడు అట్టహాసంగా జరగనుంది. ఫైనల్ కి చేరిని ఐదుగురు కంటెస్టెంట్స్ లో ఒకరు విన్నర్ కానున్నారు. అరియనా, అభిజిత్, సోహైల్, అఖిల్ లతో పాటు హారిక ఫైనల్ కి చేరిన సంగతి తెలిసిందే. దాదాపు రెండు వారాలుగా బిగ్ బాస్ విన్నర్ ఎవరనే విషయంపై అనేక మీడియా సంస్థలు పోల్స్ నిర్వహిస్తున్నాయి. ముఖ్యంగా అభిజీత్, అరియనా, సోహైల్ టైటిల్ రేసులో ఉన్నట్లు అర్థం అవుతుంది. అయితే ఫైనల్ కి […]

Bigg Boss Leak
బిగ్ బాస్ సీజన్ 4 గ్రాండ్ ఫినాలే నేడు అట్టహాసంగా జరగనుంది. ఫైనల్ కి చేరిని ఐదుగురు కంటెస్టెంట్స్ లో ఒకరు విన్నర్ కానున్నారు. అరియనా, అభిజిత్, సోహైల్, అఖిల్ లతో పాటు హారిక ఫైనల్ కి చేరిన సంగతి తెలిసిందే. దాదాపు రెండు వారాలుగా బిగ్ బాస్ విన్నర్ ఎవరనే విషయంపై అనేక మీడియా సంస్థలు పోల్స్ నిర్వహిస్తున్నాయి. ముఖ్యంగా అభిజీత్, అరియనా, సోహైల్ టైటిల్ రేసులో ఉన్నట్లు అర్థం అవుతుంది. అయితే ఫైనల్ కి ముందే కీలక సమాచారం లీకైనట్లు తెలుస్తుంది. శనివారమే బిగ్ బాస్ ఫినాలే షూట్ కొంత భాగంగా పూర్తి చేశారట. దీనితో ఫైనల్ కి చేరిన ఇంటి సభ్యుల గెలుపు స్థానాలు బయటికి వచ్చాయట.

Also Read: చిన్న సినిమాకు పెద్ద గౌరవం

టైటిల్ ఫేవరెట్స్ లో ఒకరిగా ఉన్న అరియనా రేసు నుండి తప్పుకున్నట్లు తెలుస్తుంది. ఓటింగ్ లో వెనుకబడ్డ అరియనా నాలుగవ స్థానానికి పరిమితం అయ్యారట. అలాగే హౌస్ లో ఉన్న మరో లేడీ కంటెస్టెంట్ హారిక సైతం టైటిల్ అందుకొనే అవకాశం కోల్పోయారని సమాచారం. అందరికి కంటే తక్కువ ఓట్లు పొందిన హారిక ఐదవ స్థానముతో సరిపెట్టుకున్నారట. టైటిల్ కోసం పోటీ పడ్డ ఇద్దరు లేడీ కంటెస్టెంట్స్ ఎలిమినేటైనట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో మరోమారు మేల్ కంటెస్టెంట్ టైటిల్ అందుకోనున్నారు.

Also Read: ఎవరి లెక్కలు వారివి..

హారిక, అరియనాల నిష్క్రమణతో అఖిల్, అభిజీత్ మరియు సోహైల్ టైటిల్ రేసులో ఉన్నారని సమాచారం. ఐతే వీరి కూడా స్థానాలు దాదాపు ఖరారైనట్లు వినికిడి. అందరూ ఊహిస్తున్నట్లు అభిజీత్ టైటిల్ విన్నర్ అయ్యారట. అభిజీత్ తరువాత అత్యధిక ఓట్లతో సోహైల్ రన్నర్ గా నిలిచాడట. ప్రేక్షకుల ఫేవరేట్ కంటెస్టెంట్స్ లో ఒకరిగా ఉన్న అఖిల్ కేవలం 3వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చిందని అంటున్నారు. ఈ వార్తలలో నిజం ఎంతో మరో కొన్ని గంటలలో తెలిసిపోనుంది. కాగా గ్రాండ్ ఫినాలే వేదికపై సాయి పల్లవి, నాగ చైతన్యలతో పాటు అందమైన హీరోయిన్స్ మెహ్రీన్, లక్ష్మీ రాయ్ మరియు దర్శకుడు అనిల్ రావిపూడి సందడి చేయనున్నారట.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper