Homeఎంటర్టైన్మెంట్Bigg Boss 10 Telugu contestants list: 'బిగ్ బాస్ 10' ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్...

Bigg Boss 10 Telugu contestants list: ‘బిగ్ బాస్ 10’ ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదే.. ఈసారి ప్లానింగ్ మామూలుగా లేదుగా..

Bigg Boss 10 Telugu contestants list: ప్రతీ ఏడాది స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే ‘బిగ్ బాస్’ రియాలిటీ షో కోసం ప్రేక్షకులు ఎంత ఆతృతగా ఎదురు చూస్తుంటారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ముఖ్యంగా గత సీజన్ అయితే సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిల్చింది. దీంతో ఇప్పుడు ‘బిగ్ బాస్ 10′(Bigg Boss 10 Telugu) పై ప్రేక్షకుల్లో అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా మేకర్స్ కూడా ఎక్కడా తగ్గకుండా ప్లాన్ చేస్తున్నారు. ఈ సీజన్ కి హోస్ట్ మారుతాడు అనే రూమర్ మొదట్లో ఉండేది కానీ , అక్కినేని నాగార్జున నే ఈ సీజన్ కి కూడా హోస్ట్ గా వ్యవహరిస్తాడని తెలుస్తోంది. ఇకపోతే ఈ సీజన్ లోకి కంటెస్టెంట్స్ గా అడుగుపెట్టే సెలబ్రిటీలపై ప్రేక్షకుల్లో అమితాసక్తి నెలకొంది. రీసెంట్ గానే మేకర్స్ కొంతమంది టాప్ కంటెస్టెంట్స్ ని సంప్రదించారు, వాళ్లెవరో ఒక లుక్ వేద్దాం పదండి.

అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం చూస్తే , జబర్దస్త్ ద్వారా పాపులర్ కమెడియన్ గా పేరు తెచ్చుకున్న నూకరాజు ఈ సీజన్ లో ఒక కంటెస్టెంట్ గా పాల్గొనబోతున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అథర్ ‘ షో లో కనిపిస్తున్నాడు. అదే విధంగా ఇదే షో నుండి సంధ్య అనే కంటెస్టెంట్ కూడా బిగ్ బాస్ 10 లోకి అడుగుపెట్టబోతుందట. అదే విధంగా సిద్దు – సోనియా లలో ఒకరు ఈ షో లోకి ఎంట్రీ ఇస్తారని తెలుస్తోంది. ఇక ‘బిగ్ బాస్ 7’ లో టాప్ 5 కంటెస్టెంట్ గా నిల్చిన ప్రియాంక జైన్ భర్త శివ్ ‘బిగ్ బాస్ 10’ లోకి రాబోతున్నాడట. అదే విధంగా త్రినయని సీరియల్ ద్వారా కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన ఆషిక పదుకొనే కూడా ఈ సీజన్ లో పాల్గొనబోతున్నట్టు తెలుస్తోంది.

రీసెంట్ గా మొదలైన ‘కూకూ విత్ జాతి రత్నాలు 2’ లో కూడా ఈమె ఒక కంటెస్టెంట్ గా వ్యవహరిస్తోంది. ఇక ఇన్ స్టాగ్రామ్ లో ఈషా వ్లాగ్స్ ద్వారా బాగా పాపులర్ అయిన ఈషా (స్నో అక్క) కూడా ఈ షో లో ఒక కంటెస్టెంట్ గా పాల్గొనబోతున్నట్టు సమాచారం. అదే విధంగా ప్రముఖ యూట్యూబర్ నిఖిల్ , సింగర్ సాకేత్ వంటి వారు కూడా ఈ షో లో భాగం కాబోతున్నారు. వీళ్లందరినీ పక్కన పెడితే బిగ్ బాస్ యాజమాన్యం అమర్ దీప్ సతీమణి తేజస్విని , అదే విధంగా కావ్యశ్రీ వంటి వారిని తీసుకొని రావడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. వీళ్లకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అదే విధంగా పాత సీజన్స్ నుండి ఇద్దరు కంటెస్టెంట్స్ ని తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారట.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular