Mrunal Thakur film fantasy: పాన్ ఇండియా లెవెల్ లో మంచి గుర్తింపు ని తెచ్చుకున్న హీరోయిన్స్ లో ఒకరు ‘మృణాల్ ఠాకూర్'(Mrunal Thakur). ఈమెకు యూత్ ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ మామూలుది కాదు. ప్రతీ హీరో అభిమాని , మృణాల్ తో తమ హీరో ఒక్క సినిమా చేస్తే బాగుంటుంది అని కోరుకుంటూ ఉంటారు. ఆ రేంజ్ క్రేజ్ ఉన్న హీరోయిన్ ఆమె. మన టాలీవుడ్ లోకి ‘సీతా రామం’ అనే చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చింది . ఆ తర్వాత ‘హాయ్ నాన్న’ కూడా పెద్ద హిట్ అయ్యింది. ఇక రీసెంట్ గా ఈమె నుండి విడుదలైన ‘డెకాయిట్’ చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఇలా నిర్మాతల పాలిట లక్కీ చార్మ్ గా మారింది మృణాల్ ఠాకూర్. అయితే రీసెంట్ గా ఈమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకుంది.
ఆమె మాట్లాడుతూ ‘నేను ఇప్పటి వరకు హీరోయిన్ గా చేసిన సినిమాల్లో , అత్యధిక శాతం సినిమాల్లో హీరోలు చనిపోయారు. ‘సీతా రామం’ చిత్రం క్లైమాక్స్ లో దుల్కర్ చనిపోతాడు , అదే విధంగా హిందీ జెర్సీ లో నేనే హీరోయిన్ గా నటించాను. అందులో కూడా హీరో షాహిద్ కపూర్ క్లైమాక్స్ లో చనిపోతాడు. ఇక రీసెంట్ గా విడుదలైన ‘డెకాయిట్’ చిత్రం లో కూడా హీరో ఇలాగే చనిపోతాడు. దీంతో నెటిజెన్స్ నన్ను నీ సినిమాల్లో హీరోలు చనిపోవడం ఫాంటసీ గా పెట్టుకున్నావా?, అలాంటి స్టోరీలనే ఒప్పుకుంటున్నావా అని అడుగుతున్నారు’ అంటూ చెప్పుకొచ్చింది. దీంతో సోషల్ మీడియా లో ఇప్పుడు దీనిపై ఫన్నీ మీమ్స్ మొదలయ్యాయి. ఇక మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం హిందీ లో రెండు సినిమాలు చేస్తోంది. టాలీవుడ్ లో ప్రస్తుతం మూడు సినిమాల్లో ఆమె నటించేందుకు సంతకాలు చేసింది. వాటి వివరాలు పూర్తిగా తెలియాల్సి ఉంది.