spot_img
Homeఎంటర్టైన్మెంట్Big Boss Telugu 8 : విష్ణు ప్రియా, నభీల్ లలో అన్యాయం ఎవరికి జరిగింది..?...

Big Boss Telugu 8 : విష్ణు ప్రియా, నభీల్ లలో అన్యాయం ఎవరికి జరిగింది..? సంచాలక్ గా ప్రేరణ ఫెయిల్ అయ్యిందా!

Big Boss Telugu 8 : ఈరోజు బిగ్ బాస్ హౌస్ లో టాస్కులు చాలా రసవత్తరంగా సాగాయి. అదే సమయంలో వివాదాస్పదం గా కూడా మారాయి. ముఖ్యంగా సంచాలక్ గా వ్యవహరించిన వారికి చుక్కలు కనిపించాయని చెప్పొచ్చు. ముందుగా ప్రేరణ గురించి మనం మాట్లాడుకోవాలి. ఈమెని నేడు చివరగా బిగ్ బాస్ పెట్టిన సాక్స్ టాస్క్ కి సంచాలక్ గా పెట్టుకున్నారు. ఈ టాస్కుని మూడు వైపుల నుండి చూడాలి. అలా చూసేందుకు ఒక సంచాలక్ కి వీలు పడదు. ఇద్దరు అసిస్టెంట్స్ ని ప్రేరణ పెట్టుకొని చివర్లో వాళ్లిద్దరూ చెప్పే దానిని బట్టి నిర్ణయం తీసుకొని ఉండుంటే బాగుండేది. అసలు టాస్కు ఏమిటంటే మూడు క్లాన్స్ కి సంబంధించిన కంటెస్టెంట్స్ ఇద్దరిద్దరుగా టాస్కులో పాల్గొంటారు. ఈ టాస్కులో సాక్సులు వేసుకోవాలి. చేతులు ఉపయోగించకుండా అవతలి వ్యక్తి సాక్సులను పీకేయాలి.

ఒక బాక్స్ లోనే వీళ్లంతా ఆడాలి, బాక్స్ దాటితే టాస్కు నుండి అవుట్. ఇది గేమ్ యొక్క ముఖ్యమైన రూల్స్. సంచాలక్ కూడా రూల్స్ పెట్టొచ్చు, కానీ ప్రేరణ టాస్కు మధ్యలో రూల్స్ పెట్టింది. అప్పటికే ఇద్దరు అవుట్ అయిపోయి ఉన్నారు. టాస్కులో పాల్గొనే కంటెస్టెంట్స్ అందరూ చేతులు వెనక్కి పెట్టుకొని ఆడాలి, ఈ టాస్కులో విష్ణు ప్రియా పొరపాటున తగిలిన అభయ్ తలకు రిఫ్లెక్షన్ గా లైన్ దాటి క్రింద పడిపోతుంది. అభయ్ తొయ్యడం వల్లనే నేను క్రిందకు పడిపోయాను అని అంటుంది విష్ణు. కాదు అని అభయ్ వాదిస్తాడు, కానీ నిజానికి అభయ్ తల తగిలే ఆమె క్రిందకు పడిపోయింది. ఇది ప్రేరణ చూసింది కాబట్టి విష్ణు ప్రియా కి ముందుగా అవుట్ ఇవ్వలేదు. కాణి ఆ తర్వాత కాసేపటికి విష్ణు ప్రియా గేమ్ ఆడుతూ క్రిందకి పడిపోతుంది. అప్పుడు ప్రేరణ అవుట్ ఇచ్చేస్తుంది, కానీ అందుకు విష్ణు ప్రియా ఒప్పుకోదు, అభయ్ లాక్ చెయ్యడం వల్లనే నేను అతనిని నెట్టేయాల్సి వచ్చింది అని వాదిస్తుంది, అందుకు ప్రేరణ ఒప్పుకోదు, బయటకి వెళ్ళమని గట్టిగా చెప్తుంది. ఇక చివరికి నబీల్, నిఖిల్ మరియు అభయ్ మిగులుతారు. ఇప్పుడు ప్రేరణ మరో కొత్త రూల్ పెడుతుంది. సాక్స్ ని కంటెస్టెంట్స్ అందరిని చివరికి లాగుకోమని చెప్తుంది, ఎవరైతే సాక్సుని కనపడకుండా దాచుకుంటారో వాళ్ళు అవుట్ అని చెప్తుంది.

నబీల్ కావాలని దాచుకోదు కానీ, నడుస్తున్నప్పుడు పొరపాటున ఆ సాక్స్ వెనక్కి వెళ్తుంది. వెనక్కి వెళ్ళింది కాబట్టి నబీల్ అవుట్ అని ప్రేరణ అంటుంది. ఇందుకు నబీల్ ఒప్పుకోడు, ఇద్దరి మధ్య వాగ్వివాదం చాలా సేపటి వరకు జరుగుతుంది. చివరికి సంచలక్ నిర్ణయమే తుది నిర్ణయం అని బిగ్ బాస్ ప్రకటించడం తో నబీల్ వెనక్కి వెళ్తాడు. ఈ విషయం లో ప్రేరణ సంచాలక్ గా ఫెయిల్ అయ్యింది అని చెప్పొచ్చు. నబీల్ కి ఒక అవకాశం ఇచ్చింది. ఇక చివర్లో నిఖిల్ మరియు అభయ్ మిగులుతారు, బజర్ మోగే సమయానికి ఇద్దరికీ సాక్సులు ఉండడం తో గేమ్ ని టై చేస్తారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Shreyas Iyer Captaincy

Shreyas Iyer Captaincy: మొదటి పరీక్షలోనే ఫెయిల్.. అయ్యర్ కు ఎన్ని ఎలివేషన్లు ఇచ్చినా దండగే

Shreyas Iyer Captaincy: కాపురం చేసే కళ నిశ్చయ తాంబూలాల సమయంలోనే తెలుస్తుందని పెద్దలు అంటుంటారు. ఈ సామెతను ఒకవేళ క్రికెట్ క్రీడకు అన్వయిస్తే ఒక కెప్టెన్ సామర్థ్యం తన తొలి...
Diamond Rain

Diamond Rain: వజ్రాల వాన కురుస్తోంది.. ఏరుకోవడానికి మీరు సిద్ధమా

Diamond Rain: ఈ భూమి మీద అత్యంత ఖరీదైన లోహాలు కొన్ని ప్రాంతాలలో మాత్రమే ఉన్నాయి. అవి కూడా పరిమితంగా ఉన్నాయి. కాకపోతే మనుషులకు అరుదైన లోహాల మీద విపరీతమైన ఆసక్తి....
Today 23 July 2026 Horoscope

Today 23 July 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారు జాగ్రత్త.. జీవితంలో ఊహించని మార్పులు..

Today 23 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం ద్వాదశ రాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు శుక్ల యోగం ఏర్పడడం వల్ల కొన్ని రాశుల వారికి అనుకోకుండా...
INS Mahendragiri

INS Malvan : సైన్యం చేతికి మరో యుద్ధ నౌక… శత్రు సబ్‌మెరైన్లకు ఇక చుక్కలే!

INS Malvan భారత సైన్యం చేతికి మరో యుద్ధ నౌక చేరింది. ఇటీవలే విశాపట్నంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఒక నౌకను నేవీకి అప్పగించారు. తాజాగా భారత నేవీ తన సబ్‌మెరైన్‌ వ్యతిరేక...

Telangana ACB : కిలోల కొద్ది బంగారం.. అంతకుమించి నోట్ల కట్టలు.. ఈ అధికారి అవినీతిలో అనకొండ

Telangana ACB : రెండు కిలోల బంగారం.. 52 లక్షల నగదు.. మూడు కార్లు.. 30 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు.. 20 అత్యంత ఖరీదైన విదేశీ మద్యం సీసాలు.. అంతేకాదు ఆయన...
Oktelugu Epaper