Balakrishna Daughter Tejaswini: టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరో ఎవరంటే బాలకృష్ణ అని చెబుతారు. దశాబ్దాలుగా సినీ ప్రేక్షకులను అలరిస్తున్న బాలకృష్ణ ఇప్పటికీ యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్నాడు. ఇటీవల ఆయన నటించిన ‘భగవంత్ కేసరి’ బ్లాక్ బస్టర్ కావడంతో ఫుల్ ఖుషీలో ఉన్నారు. అంతకుముందు రిలీజ్ అయిన రెండు సినిమాలు కూడా సక్సెస్ అయ్యాయి. అయితే బాలకృష్ణ సక్సెస్ తో కామ్ గా కూర్చోవడం లేదు బాబీతో కలిసి మరో మూవీకి సిద్ధం అవుతున్నాడు. ఈ తరుణంలో బాలకృష్ణకు చెందిన పర్సనల్ విషయాలు కొన్ని హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా ఆయన చిన్న తేజస్విని కూడా సినీ రంగంలోకి అడుటుపెడుతున్నట్లు సమాచారం. అయితే ఇండస్ట్రీలో ఆమె ఎలా రాణించాలని అనుకుంటున్నారంటే?
మాస్ ప్రేక్షకులను మెప్పించే బాలయ్య తాజాగా వచ్చిన ‘భగవంత్ కేసరి’లో ఆయన పోలీస్ పాత్రలో కనిపించి మెప్పించాడు. ఈ సినిమాతో బాలయ్య హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ బాలకృష్ణ ఈ సినిమాకు రూ.130 కోట్ల షేర్ చేయడానికి సహకరించాడు. అయితే బాలకృష్ణ ఎక్కువగా తన పర్సనల్ విషయాలను మీడియాతో పంచుకోరు. కానీ ఆటోమేటిక్ గా వారి గురించి మీడియాలో కొన్ని విషయాలు ఆసక్తిని రేపుతాయి.
తాజాగా బాలకృష్ణ రెండో కూతురు తేజస్విని గురించి ఇంట్రెస్టింగ్ చర్చ సాగుతోంది. బాలకృష్ణ, వసుంధర దంపతులకు ముగ్గురు సంతానం. వీరిలో ఒకరు బ్రహ్మాణి. ఈమె మాజీ సీఎం చంద్రబాబునాయుడు కోడలు. లోకేష్ కు సతీమణి. కుమారుడు మోక్షజ్ఒ. ఈయన త్వరలో ఇండస్ట్రీకి రాబోతున్నట్లు తెలుస్తోంది. బాలకృష్ణ రెండో కూతురు తేజస్విని ఈమె ప్రముఖ విద్యాసంస్థల అధినేత ఇంట్లోకి కోడలుగా వెళ్లింది.
అయితే తేజస్విని సొంతంగా వ్యాపార రంగంలో రాణించాలనుకుంటోంది. ఇందు కోసం ఆమె సినీ ఇండస్ట్రీని ఎంచుకున్నారు. బాలకృష్ణ ఓ వైపు హీరోగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం బాలకృష్ణ సినిమాల కాల్ షీట్స్, తదితర విషయాలను ఆమె దగ్గరుండి మరీ చూసుకుంటుందట. త్వరలోనే ఆమె నిర్మాతగా మారే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అయితే మొదటి సినిమా బాలకృష్ణ తోనే తీయాలని అనుకుంటోంది. మరోవైపు తమ్ముడు మోక్షజ్ణ సినిమాకు నిర్మాతగా మారుతారా? అనేది హాట్ టాపిక్ గా మారింది. ఏదీ ఏమైనా తేజస్విని నిర్మాణ రంగంలో రాణిస్తారా? లేదా? అనేది సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.