Homeఎంటర్టైన్మెంట్Ayesha Khan: తెలుగు రాష్ట్రాలను ఊపేస్తున్న ముద్దుగుమ్మ... ఎవరీ అయేషా ఖాన్!

Ayesha Khan: తెలుగు రాష్ట్రాలను ఊపేస్తున్న ముద్దుగుమ్మ… ఎవరీ అయేషా ఖాన్!

Ayesha Khan: ఓ ముద్దుగుమ్మ తెలుగు యువతను ఊపేస్తోంది. ఎవరీ హాట్ బ్యూటీ అంటూ సోషల్ మీడియాలో ఒకటే రచ్చ. ఇటీవల విడుదలైన ఓం భీమ్ బుష్ చిత్రంలో తళుక్కున మెరిసింది అయేషా ఖాన్. ట్రైలర్ లో కూడా అయేషా ఖాన్ ని చూపించారు. ఒక్క చూపుకే జనాలను కట్టి పడేసింది అమ్మడు. ఎవరీ అయేషా ఖాన్ అని పరిశీలిస్తే… ముంబై కి చెందిన అయేషా ఖాన్ బుల్లితెర నటిగా కెరీర్ ప్రారంభించింది. కసాటి జిందగీ కే అనే సీరియల్ లో జూనియర్ ఆర్టిస్ట్ గా చేసింది.

అనంతరం బల్వీర్ రిటర్న్ అనే సోషియో ఫాంటసీ సీరియల్ లో ఓ పాత్ర చేసింది. ఈ సీరియల్ సోనీ సబ్ లో ప్రసారం అయ్యింది. అనూహ్యంగా బిగ్ బాస్ షోలో ఛాన్స్ దక్కించుకుంది. బిగ్ బాస్ హిందీ సీజన్ 17లో అయేషా ఖాన్ పాల్గొంది. అమ్మడు తన అందచందాలతో ఆకట్టుకుంది. 11వ వారం అయేషా ఖాన్ కొన్ని కారణాలతో హౌస్ నుండి బయటకు వచ్చింది. మరలా రీ ఎంట్రీ ఇచ్చింది. అయేషా ఖాన్ 97వ రోజు ఎలిమినేట్ అయ్యింది. ఫైనల్ కి వెళ్లే ఛాన్స్ కోల్పోయింది.

ఆమెకు టాలీవుడ్ లో సిల్వర్ స్క్రీన్ ఆఫర్ దక్కింది. విశ్వక్ సేన్ హీరోగా నటించిన ముఖచిత్రం మూవీలో ఓ పాత్ర చేసింది. ముఖచిత్రం 2022లో విడుదలైంది. ఇటీవల విడుదలైన ఓం భీమ్ బుష్ చిత్రంలో రత్తాలు అనే ఓ గ్లామరస్ రోల్ చేసింది. పల్లెటూరి జనాల క్రష్ గా అలరించింది. రత్తాలు పాత్ర అయేషా ఖాన్ కి ఫేమ్ తెచ్చింది. ఒక్క లుక్ తో ఆమె కుర్రాళ్లను పడేసింది.

నెక్స్ట్ అయేషా ఖాన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తుంది. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ హీరోగా నటించాడు. అనంతరం వెంకీ అట్లూరి-దుల్కర్ సల్మాన్ కాంబోలో తెరకెక్కుతున్న లక్కీ భాస్కర్ చిత్రంలో కూడా ఒక ఐటెం సాంగ్ చేయనుంది. మొత్తంగా అయేషా ఖాన్ తెలుగులో సత్తా చాటే సూచనలు కనిపిస్తున్నాయి. యూత్ లో ఆమెకున్న పాపులారిటీ రీత్యా ఆఫర్స్ వెల్లువెత్తే అవకాశం కలదు.

 

View this post on Instagram

 

A post shared by Ayesha Khan (@ayeshaakhan_official)

RELATED ARTICLES

Most Popular