spot_img
Homeఎంటర్టైన్మెంట్Anushka Shetty: ముద్దుగుమ్మ "అనుష్క" కు బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన... యూవీ క్రియేషన్స్

Anushka Shetty: ముద్దుగుమ్మ “అనుష్క” కు బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన… యూవీ క్రియేషన్స్

Anushka Shetty: అనుష్క శెట్టి… సూపర్ సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో ఆమె నటనతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు  సంపాదించుకుంది. ఆ తర్వాత వచ్చిన విక్రమార్కుడు సినిమా సూపర్ హిట్ అవ్వడంతో అనుష్కకు ఆఫర్లు క్యూకట్టాయి. వరుస చిత్రాలతో టాలీవుడ్ లో టాప్ రేంజ్ కి ఎదిగింది . స్టార్ హీరోల సరసన ఛాన్స్ లు దక్కించుకొని తెలుగు తమిళ్ భాషల్లో వరుసగా సినిమాలు చేసింది స్వీటి. కమర్షియల్ సినిమాలతో పాటులేడీ ఓరియెంటెడ్ మూవీస్ లలో కూడా నటించి మెప్పించింది అనుష్క. అరుంధతి సినిమాతో ఆమె సినిమా కెరీర్ ఒక టర్నింగ్ పాయింట్ తీసుకుందని చెప్పాలి. ఆ మూవీ ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

as a gift of anushka shetty birth day uv creations announces new movie her

అనంతరం వర్ణ, రుద్రమదేవి, సైజ్ జీరో, భాగమతి వంటి సినిమాలతో ఆకట్టుకుంది. కాగా బాహుబలి సినిమాతో ఒక సాలిడ్ ఐ‌టి అందుకున్న ఈ భామ ఆ సినిమా తర్వాత కొంత గ్యాప్ తీసుకుంది. ఇటీవల నిశ్శబ్దం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అది ఆశించిన స్థాయిలో ప్రేక్శకులను అలరించలేకపోయింది. మెగాస్టార్ నటించిన సైరా సినిమాలో ఝాన్సీ లక్ష్మీ భాయ్ గా చిన్న పాత్రలో కనిపించింది అనుష్క. అనుష్క నటన,  అందం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాగా నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న ఈ ముద్దుగుమ్మకు ఆమె అభిమానులంతా సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తూ పోస్ట్ లు పెడుతున్నారు.

https://twitter.com/UV_Creations/status/1457195353057349633?s=20

ఈ మేరకు యూవీ క్రియేషన్స్ అనుష్క తో ఓ సినిమా తీయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. మహేష్ బాబు దర్శకత్వంతో ఈ చిత్రం తెరకెక్కనుంది. అనుష్క కు ఇది 48వ సినిమా కావడం విశేషం. అలానే యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై అనుష్క గతంలో మిర్చి, భాగమతి అనే సినిమాలు చేశారు. ఇక ఈ తాజా అప్డేట్ తో అనుష్క ఫ్యాన్స్ లో నూతన ఉత్సాహం నెలకొంది. ఈ హ్యాట్రిక్ మూవీతో అనుష్క మళ్ళీ ఒక సాలిడ్ హిట్ కొట్టాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

The Odyssey 3 Day Collections

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ 6 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. తెలుగు రాష్ట్రాల...

The Odyssey Box Office : క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం లో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ వసూళ్ల సునామీ జోరు ఏమాత్రం తగ్గలేదు. సినిమా విడుదలై 6...
Lenin 10 Days Collection

Lenin Movie : ‘లెనిన్’ 13 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. కొత్త సినిమాలు వచ్చినా జోరు తగ్గలేదు..

Lenin Movie : అఖిల్ 'లెనిన్' చిత్రం బాక్స్ ఆఫీస్ జోరు ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఈ సినిమా విడుదలై 13 రోజులైనప్పటికీ కూడా, కొన్ని సెంటర్స్ లో నేటికీ కూడా భారీ...
Vijay Deverakonda

Vijay Deverakonda : ఆగిపోయిన విజయ్ దేవరకొండ కొత్త సినిమా.. కోట్ల రూపాయిల నష్టం..

Vijay Deverakonda : యూత్ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరోల్లో ఒకరు విజయ్ దేవరకొండ. చేసిన సినిమాలు తక్కువే, అందులో డిజాస్టర్స్ ఎక్కువ , అయినప్పటికీ ఈ...

India student protests : నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక ల నమూనా భారత్ లో ఎందుకు సక్సెస్ కాదు?

India student protests : దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు క్రమంగా ఉధృతమవుతున్నాయి. ప్రారంభంలో వందల సంఖ్యలో సాగిన నిరసనలు ఇప్పుడు వేలాదిమందిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ వ్యవహారం, పరీక్షల పారదర్శకతపై...
Jana Nayagan Advance Bookings

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఓపెనింగ్ రికార్డు ని బ్రేక్ చేయకుండానే రిటైర్ అయిపోయిన సీఎం విజయ్..

Pawan Kalyan : ఈమధ్య కాలం లో సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ , విజయ్ ల మధ్య పోలికలు పెడుతూ , అభిమానుల మధ్య జరుగుతున్న ఫ్యాన్ వార్స్ ని మన...
Oktelugu Epaper