Homeఎంటర్టైన్మెంట్Peddi Movie: 'పెద్ది' లో హీరో సాయి కుమార్ సన్నివేశాలు డిలీట్ చేయడానికి కారణం అదేనా..!

Peddi Movie: ‘పెద్ది’ లో హీరో సాయి కుమార్ సన్నివేశాలు డిలీట్ చేయడానికి కారణం అదేనా..!

Peddi Movie: ‘ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై , మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని , బాక్స్ ఆఫీస్ వద్ద తిరుగులేని బ్లాక్ బస్టర్ ని సొంతం చేసుకుంటూ ముందుకు దూసుకుపోతున్న సంగతి అందరికీ తెలిసిందే. సినిమా విడుదలై రెండు వారాలు అయ్యింది , అయినప్పటికీ కూడా ఈ వీకెండ్ లో కూడా ఈ చిత్రానికి ఫ్యామిలీ […]

Peddi Movie: ‘ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై , మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని , బాక్స్ ఆఫీస్ వద్ద తిరుగులేని బ్లాక్ బస్టర్ ని సొంతం చేసుకుంటూ ముందుకు దూసుకుపోతున్న సంగతి అందరికీ తెలిసిందే. సినిమా విడుదలై రెండు వారాలు అయ్యింది , అయినప్పటికీ కూడా ఈ వీకెండ్ లో కూడా ఈ చిత్రానికి ఫ్యామిలీ ఆడియన్స్ బ్రహ్మరథం పట్టే అవకాశాలు ఉన్నాయి. ఎందులకంటే ఈ చిత్రం లో బుధవారం నుండి సరికొత్త సన్నివేశాలను జత చేశారు, వాటికి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ముందే ఈ సన్నివేశాలను జత చేసుంటే , సినిమాకు ఇంకా గొప్ప పాజిటివ్ టాక్ వచ్చేది జాన్వీ కపూర్ పాత్రపై ఇన్ని విమర్శలు వచ్చేవి కాదంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇకపోతే ఈ సినిమాలో ఇంకా చాలా సన్నివేశాలను తొలగించారు. అందులో ప్రముఖ సీనియర్ హీరో సాయి కుమార్ కి సంబంధించిన సన్నివేశాలు కూడా ఉన్నాయి. ఏప్రిల్ 30 నుండి ఈ సినిమా వాయిదా పడినప్పుడు , మేకర్స్ ఐటెం సాంగ్ తో పాటు , కొన్ని సన్నివేశాలను రీ షూట్ చేయడం , అదే విధంగా కొన్ని కొత్త సన్నివేశాలను తెరకెక్కించడం వంటివి చేశారు. ఆ సన్నివేశాల్లో సీనియర్ హీరో సాయి కుమార్ కూడా ఉన్నాడు. ఆయన షూటింగ్ లో పాల్గొన్న వీడియోస్ కూడా ఉన్నాయి. ఒక అభిమాని తో సరదాగా ముచ్చటించిన వీడియో కూడా ఉంది. అయితే ఆయన సన్నివేశాలను చిత్రీకరించినప్పటికీ సినిమా నుండి తొలగించడానికి కారణం , మూవీ రన్ టైం అని అంటున్నారు. సినిమా నిడివి దృష్ట్యా , ఈ సన్నివేశం ఉన్నా లేకపోయినా పర్వాలేదని, పెద్ద ప్రభావం చూపదని , అందుకే చిత్రం నుండి తొలగించారని అంటున్నారు.

రీసెంట్ గా జత చేసిన కొత్త సన్నివేశాల్లో , సాయి కుమార్ సన్నివేశాలను కూడా జత చేయొచ్చు కదా అని సోషల్ మీడియా లో రామ్ చరణ్ నుండి ఎదురు అవుతున్న ప్రశ్న. ఇకపోతే ఈ చిత్రం 200 కోట్ల షేర్ మార్కుకి చాలా దగ్గరగా ఉంది. ఈ వీకెండ్ తో ఆ మార్కుని కచ్చితంగా అందుకుంటుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఓవరాల్ గా క్లోజింగ్ లో అన్ని వెర్షన్స్ కి కలిపి 345 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వస్తుందని , రామ్ చరణ్ కి కీలకమైన సమయం లో మంచి హిట్ గా నిలిచిందని , కానీ ఇది ఆయన స్థాయికి తగ్గ బ్లాక్ బస్టర్ కాదని అంటున్నారు. ఎందుకంటే ఓవర్సీస్, కర్ణాటక , తమిళనాడు మార్కెట్స్ లో పెద్ద డిజాస్టర్ గా నిల్చింది ఈ చిత్రం. అదే విధంగా నెల్లూరు, రాయలసీమ ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ అవ్వడం కష్టం.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper