Anjali: హీరోయిన్ అంజలికి చీరలు అంటే తెగ మోజంట. చీర కట్టడం ఒక కళ అని చెప్తోంది. అంజలి ఇటీవల ఎక్కువగా చీరకట్టుడులోనే ఫోటోషూట్లు చేస్తోంది. ఇండియన్ డ్రెస్సింగ్ లలో చీర ది బెస్ట్ అని చెప్తోంది ఈ తెలుగు భామ. సడెన్ గా అంజలి చీర కట్టుడు గురించి లెక్చర్లు ఇస్తోందంటే మేటర్ వేరు అనుకుంటున్నారా ? అలాంటిదేమి లేదు.
ఆమె పెళ్లి ఆలోచనలో లేదు లెండి. ఆమె ప్రస్తుతం ఒంటరి జీవితాన్నే బాగా ఎంజాయ్ చేస్తోందట. అందుకే.. ఇప్పట్లో పెళ్లి చేసుకోదు అట. ఏది ఏమైనా ‘అంజలి’ అంటే పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. అచ్చ తెలుగు హీరోయిన్ గా అంజలికి మంచి గుర్తింపు వచ్చింది. కచ్చితంగా స్టార్ హీరోయిన్ అవుతుంది అనుకున్నారు. మొదట్లో ఆమె కెరీర్ కి కూడా ఆ ఊపు కనిపించింది.
Also Read: Remuneration Of RRR Producer : గుసగుస: ఇంతకీ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు నిర్మాతకు మిగిలిదెంతంటే?
కానీ ప్రస్తుతం, చిన్న సినిమాల హీరోయిన్ గా కూడా అంజలికి స్టార్ స్టేటస్ లేకుండా పోయింది. వెంకటేష్, బాలకృష్ణ లాంటి సీనియర్ హీరోల సరసన నటించినా.. అంజలికి ఎక్కడా బ్రేక్ రాలేదు. ఇప్పుడు ఆ సీనియర్ హీరోలు కూడా ఆమెకు ఛాన్స్ లు ఇవ్వడం లేదు. దాంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘వకీల్ సాబ్’ చిత్రంలో ఒక సైడ్ క్యారెక్టర్ లో కనిపించింది.
ఆ సినిమా తర్వాత తనకు వరుస అవకాశాలు వస్తాయని నమ్మిన అంజలికి చివరకు నిరాశే మిగిలింది .ఆశించిన స్థాయిలో ఆమెకు ఛాన్స్ లు రాలేదు. ఇక ఎదురు చూసి చూసి విసిగిపోయిన అంజలి, సైడ్ క్యారెక్టర్స్ కి కూడా తాను సిద్ధం అంటూ మేకర్స్ క్లారిటీ ఇచ్చింది. మొత్తానికి రామ్ చరణ్ సినిమాలో ఛాన్స్ అందుకుంది.
మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్ తేజ్’తో విజువల్ ఇంద్రజాలికుడు శంకర్ ప్లాన్ చేసిన సినిమాలో ఒక కీలక పాత్రలో అంజలి నటించనుంది. కాకపోతే హీరోయిన్ గా కాదు. విలన్ భార్యగా అంజలి నటిస్తోంది. ఐతే హీరోయిన్ కి సమాంతరంగా అంజలి పాత్ర ఉందట. మొదట ఆ పాత్రలో త్రిషను తీసుకోవాలనుకున్నారు.
కానీ త్రిష ఎక్కువ రెమ్యునరేషన్ అడగడంతో ఇప్పుడు ఈ పాత్రలో అంజలిని తీసుకున్నారు.
Also Read:Ranbir- Alia Wedding: ఆలియా పెళ్లి ముహూర్తం ఖరారు.. ముఖ్య అతిధులు వీళ్లే !
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
Read More