AP New Districts: జిల్లాల పునర్విభజన ప్రక్రియ పూర్తయ్యింది. కొత్త జిల్లాల పాలన ప్రారంభమైంది. అయితే ఇప్పుడు జగన్ సర్కారు కొత్త చిక్కు వచ్చి పడింది. నంబరు సెంటిమెంట్ వెంటాడుతోంది. పాలకులకు భయపెడుతోంది. కొత్తగా 13 జిల్లాల ఏర్పాటుతో… రాష్ట్రంలో మొత్తం 26 జిల్లాలు అయ్యాయి. అయితే 26లో 2, 6 కలిపితే ఎనిమిది అవుతుందని.. సంఖ్యాశాస్త్రం ప్రకారం ఇది సర్కారుకు శుభసూచకం కాదని ఆగమశాస్త్ర పండితులు పేర్కొంటున్నారు. 9 వచ్చేలా జిల్లాలను పెంచుకోవాలని.. లేకుంటే నష్టం తప్పదని హెచ్చరిస్తున్నారు. దీంతో ప్రభుత్వం మరో కొత్త జిల్లా ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మన్యం ప్రాంతంలో మరో కొత్త జిల్లా రాబోతోందని రాష్ట్ర మంత్రి పేర్ని నాని సూత్రప్రాయంగా తెలపడం దీనికి మరింత బలం చేకూర్చుతోంది. గిరిజనుల కోసమే మరో జిల్లాను ఏర్పాటు చేయబోతున్నట్లు బయటకు చెబుతున్నా.. లోగుట్టు మాత్రం నంబర్ సెంటిమెంటేనని తెలుస్తుండడం చర్చనీయాంశమైంది. సెంటిమెంట్ మాటను బయట పెట్టకుండా గిరిజనుల కోసమేనంటూ ప్రభుత్వం కలరింగ్ ఇస్తోంది.

సంక్షోభాలు తప్పవు
2014 విభజన అనంతరం అవశేష ఆంధ్రప్రదేశ్ లో 13 జిల్లాలు కొనసాగుతున్నాయి. సంఖ్యా శాస్త్రం ప్రకారం ప్రభుత్వంతో పాటు రాష్ట్రానికి మంచిది కాదని అప్పట్టో ఆగమ శాస్త్ర పండితులు హెచ్చరించారు. కానీ నాటి సీఎం చంద్రబాబు విషయాన్ని పెడచెవిన పెట్టారు. దాని ఫలితంగా ఆయన పార్టీ దారుణ ఓటమి చవిచూసింది. రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నడిరోడ్డుపైన నిలబడింది. విపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ లోక్ సభ స్థానాన్ని జిల్లాగా ప్రకటిస్తానని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన మూడేళ్ల తరువాత కొత్త జిల్లాలను ప్రకటించారు.
Also Read: Secret Of KCR Delhi Tour: కేసీఆర్ ఢిల్లీ టూర్ సీక్రెట్ ఇదే.. ఆ నిరసనకు వెళ్లడం డౌటే..?
తొలుత 25 జిల్లాల ఏర్పాటుకే ఉత్తర్వులిచ్చారు. కానీ తరువాత 26కి పెంచారు. 26 జిల్లాలను ఏర్పాటు చేసి పాలనను ప్రారంభించారు. వాస్తవానికి మార్చి 30న ప్రకటించిన ప్రాథమిక నోటిఫికేషన్లో 26 జిల్లాలతో పాటు అదనంగా మరో జిల్లాను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన అయితే వచ్చింది. రంపచోడవరం కేంద్రంగా 13 మండలాలను కలిపి ప్రత్యేక జిల్లాను ఏర్పాటు చేయాలన్న అంశంపై పరిశీలన, కసరత్తు కూడా జరిగాయి.
అయితే ప్రభుత్వం రాయచోటిని అన్నమయ్య జిల్లాకు ప్రధాన కేంద్రంగా కొనసాగించి తీరాలన్న పట్టుదలతో కొత్త ప్రతిపాదనలకు తాత్కాలికంగా పక్కన పెట్టింది. కొత్త జిల్లాల ఏర్పాటుతో తమకు కలిసివస్తొందని.. చరిత్రలో నిలిచిపోతామన్న ఆనందంలో మునిగి తేలుతున్న అధికార పక్ష నాయకులకు ఆగమ పండితుల హెచ్చరికలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే మంత్రివర్గ విస్తరణ రూపంలో కొందరు మంత్రుల ప్రకటనలు హెచ్చరికలుగా మారాయి. 26 నంబరు శుభసూచికం కాదని.. ఆ తేదీన ఎన్నో విపత్తులు సైతం వచ్చాయని గుర్తు చేస్తున్నారు. సంక్సోభ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వ పెద్దలు మరో జిల్లాను యుద్ధ ప్రాతిపదికన ప్రకటించాలని నిర్ణయించారు.
కొత్త జిల్లా ఇలా ఉండొచ్చు
ఇప్పటికే కొత్త జిల్లాల ఏర్పాటు ఒక కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్టు కారణంగా ముంపునకు గురయ్యే ఏడు తెలంగాణ మండలాలు.. కుక్కునూరు, వేలేరుపాడు, వీఆర్‌పురం, చింతూరు, కూనవరం, భద్రాచలం, బూర్గంపాడు లను మోదీ ప్రభుత్వం 2014లో ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేసింది.

వీటిలో కుక్కునూరు, వేలేరుపాడు, బూర్గంపాడు మండలాలను పశ్చిమ గోదావరిలో.. మిగతావాటిని తూర్పుగోదావరిలో కలిపింది. ఆ తర్వాత రాష్ట్రప్రభుత్వం ఎటపాక, కుక్కునూరులను ప్రత్యేక రెవెన్యూ డివిజన్లుగా ఏర్పాటు చేసింది. కొత్త జిల్లాల సందర్భంగా ఈ రెండు డివిజన్లను రద్దుచేశారు. కుక్కునూరు, వేలేరుపాడులను ఏలూరు జిల్లాలో కలిపారు. మిగతా మండలాలను అల్లూరి జిల్లాలోని రంపచోడవరం డివిజన్‌లో కలిపారు.
ఇప్పుడు ఏలూరు జిల్లాలో ఉన్న కుక్కునూరు, వేలేరుపాడు.. అల్లూరి జిల్లాలో ఉన్న రంపచోడవరం, దేవీపట్నం, వై.రామవరం, అడ్డతీగల, గంగవరం, మారేడుమిల్లి, రాజవొమ్మంగి, ఎటపాక, చింతూరు, కూనవరం, వీఆర్‌పురంలతోపాటు పోలవరం మండలాన్ని కలిపి కొత్త జిల్లా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన పరిశీలనలో ఉంది. కొత్తగా ఏర్పాటుచేసే జిల్లాకు రంపచోడవరం లేదా పోలవరం జిల్లాగా పేరుపెట్టే ఆలోచన ఉన్నట్లు తెలిసింది. తొలి ప్రతిపాదన సమయంలో రంపచోడవరమే హెడ్‌క్వార్టర్‌గా ఉండేలా ప్రతిపాదించారు. మరి దానికే కట్టుబడి ఉంటారా లేదా అనేది చూడాలి.
Also Read:Break For RRR Records: ప్చ్.. దాని వల్ల ‘ఆర్ఆర్ఆర్’ రికార్డులకు బ్రేక్