spot_img
Homeఎంటర్టైన్మెంట్Ananya Nagalla: వివాదాస్పద వేణు స్వామితో పవన్ కళ్యాణ్ హీరోయిన్... అందుకే అంటూ సోషల్ మీడియాలో...

Ananya Nagalla: వివాదాస్పద వేణు స్వామితో పవన్ కళ్యాణ్ హీరోయిన్… అందుకే అంటూ సోషల్ మీడియాలో రచ్చ షురూ!

Ananya Nagalla: ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ఈ మధ్య కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. సినిమా హీరోలు, రాజకీయ నాయకుల జాతకాలు చెప్తూ సెలెబ్రెటీ జ్యోతిష్యుడు అయ్యాడు. పైగా గతంలో వేణు స్వామి చెప్పిన కొన్ని విషయాలు నిజం అవడంతో చాలా మంది అతన్ని నమ్ముతున్నారు. సినీ తారల్లో పలువురు ఆయనతో ప్రత్యేక పూజలు చేయించుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇండస్ట్రీలో వేణు స్వామికి మంచి డిమాండ్ ఉంది.

వేణు స్వామి తన ఇంటికి వచ్చిన సెలబ్రెటీలు, సినీ తారలతో బగళాముఖీ దేవి, రాజ శ్యామలా దేవి, తార, చిన్నమస్త వంటి పూజలు చేయిస్తాడు. ఈ పూజల్లో మద్యం, మాంసం వాడతానని ఆయన ఓపెన్ గానే చెప్పిన వీడియోలు ఉన్నాయి. ఇప్పటికే పలువురు టాలీవుడ్ హీరోయిన్స్ అతనితో పూజలు చేయించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ లిస్ట్ లో మరో బ్యూటీ చేరింది. వకీల్ సాబ్ ఫేమ్ అనన్య నాగళ్ళ రీసెంట్ గా వేణు స్వామిని కలిసింది. తన కొత్త సినిమా తంత్ర విడుదలకు సిద్ధంగా ఉంది.

ఈ సినిమా మార్చి 15న రిలీజ్ కానుంది. ప్రస్తుతం మూవీ యూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో అనన్య నాగళ్ళ వేణు స్వామిని కలవడం చర్చనీయాంశంగా మారింది. సినిమా సక్సెస్ అవడం కోసం ఈ బ్యూటీ వేణు స్వామి తో పూజలు చేయించారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కాగా తంత్ర మూవీ హారర్ జోనర్ లో వస్తుంది. ఇందులో క్షుద్ర పూజలు, మంత్రాలు, తంత్రాలు లాంటివి ఉన్నాయట.

రష్మిక మందన్న, నిధి అగర్వాల్, డింపుల్ హయాతి, అషు రెడ్డి, ఇనాయ సుల్తానా వంటి హీరోయిన్లు వేణు స్వామి దగ్గర పూజలు చేయించారు. తాజాగా సక్సెస్ దక్కాలని అనన్య నాగళ్ళ వేణు స్వామిని ఆశ్రయించడం హాట్ టాపిక్ గా మారింది. ఆమె వేణు స్వామి తో కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. కేవలం కలిసి ఆశీర్వాదం తీసుకుందా లేక ప్రత్యేక పూజలు కూడా చేయించిందా అనేది తెలియాల్సి ఉంది.

Related News

Most Popular

CM Vijay viral assembly video

Tamil Nadu CM Vijay : సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. దెబ్బకు మారిపోయిన రాజకీయ సమీకరణాలు..

Tamil Nadu CM Vijay : గత రెండు మూడు రోజులుగా ఢిల్లీ పార్లమెంట్ వద్ద జరుగుతున్న ఉద్రిక్త పరిణామాలను గమనిస్తూనే ఉన్నాం. నీట్ పరీక్షకు సంబంధించిన ప్రశ్న పత్రాలు లీక్ అవ్వడం...
Sujeeth Director

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ ని చూసి వణికిపోతున్న పవన్ ఫ్యాన్స్.. ఇలా అయితే కష్టమే..

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అనుబంధం మామూలుది కాదు. ఒక సాధారణ పవన్ కళ్యాణ్ వీరాభిమాని గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సుజిత్ ,...
Jr NTR

Jr NTR: నిరాశలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఆ సినిమా రద్దు అయ్యినట్టేనా!

Jr NTR: ప్రస్తుతం మన టాలీవుడ్ లో రెబల్ స్టార్ ప్రభాస్ తర్వాత , క్రేజీ కాంబినేషన్స్ ని సెట్ చేసుకున్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే , అది జూనియర్...
Chiranjeevi

Chiranjeevi: చిరంజీవి విషయంలో లైట్ తీసుకున్న స్టార్ డైరెక్టర్స్…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రతి దర్శకుడు ఇండస్ట్రీకి రావడానికి ముందే చిరంజీవి సినిమాలను చూసి వచ్చినవారే కాదా విశేషం.. ఇండస్ట్రీ లో సక్సెస్...
Vijay Deverakonda Vs Naveen Polishetty

Vijay Deverakonda Vs Naveen Polishetty: విజయ్ దేవరకొండ vs నవీన్ పోలిశెట్టి… పోటీ మామూలుగా లేదుగా…

Vijay Deverakonda Vs Naveen Polishetty: సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోల మధ్య ఎంత మంచి ఫ్రెండ్షిప్ ఉన్నప్పటికి సినిమాల విషయంలో వాళ్ళ మధ్య తీవ్రమైన పోటీ అయితే ఉంటుంది. పర్సనల్ విషయాల్లో...
Oktelugu Epaper