Minister Ponnam Prabhakar
Minister Ponnam Prabhakar: పొన్నం ప్రభాకర్.. పరిచయం అక్కరలేని పేరు. తెలగాణ బిల్లు పార్లమెంటుల్లో ప్రవేశపెడుతున్న సమయంలో అప్పటి విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చేసిన పెప్పర్‌స్ప్ర దాడికి గురైన నేత పొన్నం.ఈ ఘటనతో పొన్నం ప్రభాకర్ జాతీయ నాయకుడు అయ్యాడు. సూ‍్టడెంట్ యూనియన్ లీడర్‌గా పనిచేసి.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి చొరవతో ఎంపీ అయ్యారు. పొన్నం ప్రభాకర్. వెలమలకు కంచుకోట అయిన కరీంనగర్ బీసీ(గౌడ సామాజికవర్గం) నుంచి ఎంపీగా గెలిచి రికార్డు సృష్టించారు. ఆయన ఎంపీగా ఉన్న సమయంలోనే తెలంగాణ బిల్లు ఆమోదం పొందడం విశేషం. 2009 నుంచి 2014 వరకు కరీంనగర్ ఎంపీగా ఉన్న పొన్నం తర్వాత జరిగిన రెండు(2014, 2018) ఎన్నికల్లోనూ అనూహ్యంగా ఓడిపోయారు. ఇటు అసెంబ్లీ ఎన్నికల్లో అటూ పార్లమెంట్ ఎన్నికల్లోనూ పొన్నంకు వ్యతిరేక ఫలితలే వచ్చాయి.
నియోజకవర్గం మార్పుతో..
కరీంనగర్ కలిసి రావడం లేదని గుర్తించిన పొన్నం ప్రభాకర్ అనూహ్యంగా 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు తన నియోజకవర్గం మార్చుకున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని హుస్నాబాద్‌ను ఎంచుకున్నారు. కాంగ్రెస్ అధిష్టానం నుంచి టికెట్ తెచ్చుకున్నారు. నియోజకవర్గ మార్పు ఆయనకు కలిసి వచ్చింది. ఎమ్మెల్యే గెలవడంతోపాటు మంత్రి పదవి కూడా దక్కించుకున్నారు. ఉమ్మడి జిల్లాలో సీనియర్ నేత జీవన్‌రెడ్డి ఓడిపోవడం కూడా పొన్నంకు మంత్రి పదవి రావడానికి కారణం.
పాలనలో తనదైన ముద్ర..
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వందరోజులు కావొస్తోంది. రేవంత్‌రెడ్డి క్యాబినెట్‌లో మంత్రి పదవి దక్కించుకున్న పొన్నం ప్రభాకర్, ప్రభుత్వం కొలువుదీరిన రెండు రోజుల్లోనే కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో రెండు అమలు చేయగా అందులో ఒకటి పొన్నం ప్రభాకర్‌కు చెందిన రవాణాశాఖకు సంబంధించినది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణం కల్పించారు.
అసెంబీల్లో దూకుడు..
ఇక తెలంగాణ అసెంబ్లీలో పొన్నం ప్రభాకర్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ప్రతిపక్ష బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు తనదైన శైలిలో కౌంటర్లు ఇస్తూ దూకుడు ప్రదర్శిస్తున్నారు. మజీ మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌కు దీటుగా సమాధానం ఇస్తూ ఆకట్టుకుటున్నారు. ఇక బీసీ కుల గణనకు తీర్మానం చేయడంలోనూ పొన్నం తనదైన ముద్ర వేసుకున్నారు. తాజాగా బీసీ కార్పొరేషన్ల ఏర్పాటు అంశాన్ని కేబినెట్‌లో చర్చించి ఆమోదింపజేయడంలోనూ పొన్నం ప్రభాకర్ కీలక పాత్ర పోషించారు. 14 బీసీ కార్పొరేషన్లకు కేబినెట్‌లో ఓకే చేయించారు.
ఉమ్మడి జిల్లాపై పట్టు..
ఇక కరీంనగర్‌కు చెందిన పొన్న ప్రభాకర్ ఉమ్మడి జిల్లాపై కూడా పట్టు సాధిస్తున్నారు. అవమానింపబడిన చోటే.. ఇప్పుడు అభినందనలు అందుకుంటున్నారు. కరీంనగర్‌లో వరుసగా ఓటమితో పొన్న స్థానికంగా ఇబ్బంది పడ్డారు. కానీ ఇప్పుడు హుస్నాబాద్‌లో గెలవడమే కాకుండా మంత్రిగా కూడా బాధ్యతలు స్వీరించారు. దీంతో ఇప్పుడ కరీంనగర్‌కు చెందిన అన్నివర్గాల వారు పొన్న అపాయింట్ మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు. మాజీ మంత్రి, గంగుల కమలాకర్, ఆయన అనుచరులు సాగించిన దౌర‍్జన్యాలపై ఉక్కుపాదం మోపిస్తూ సామన్యుల మెప్పు పొందుతున్నా. భూకబ్జాల విషయంలో కరీంనగర్ సీపీ అభిషేక మహంతికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో ఆయన తనదైన శైలిలో బీఆర్‌ఎస్‌లోని కబ్జాదారుల భరతం పడుతున్నారు. ఇప్పటికే పదుల సంఖ్యలో నాయకులు జైలుకు వెళ్లారు. ఈ క్రెడిట్ ఇటు సీపీతోపాటు అప్పు మంత్రి పొన్నం ప్రభాకర్ పొందుతున్నారు.
మొత్తంగా పొన‍్నం ప్రభాకర్ కాంగ్రెస్ పాలనలో తనలైన ముద్ర వేయడమే కాకుండా ఉమ్మడి కరీనంగర్ జిల్లాలోనూ పట్టు సాధిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. పొగడ్తలు, సన్మానాలు అందుకుంటున్నారు. బీసీ సంఘాల ఆధ్వర్యంలో పొన్నం చిత్రపటానికి పాలాభిషేకాలు చేస్తున్నారు.
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Minister ponnam prabhakar is aggressive
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com