spot_img
Homeఆంధ్రప్రదేశ్‌TDP Second List: టిడిపిలో టిక్కెట్ల చిచ్చు

TDP Second List: టిడిపిలో టిక్కెట్ల చిచ్చు

TDP Second List: టిడిపిలో టిక్కెట్ల చిచ్చు రగులుతోంది. టిక్కెట్లు దక్కని సీనియర్లు అసంతృప్తితో రగిలిపోతున్నారు. వారి అనుచరులు ఆందోళనకు దిగుతున్నారు. చివరికి పవన్ పోటీ చేయబోయే పిఠాపురంలో సైతం టిడిపి నేత వర్మ అనుచరులు ఆందోళన బాట పట్టారు. పార్టీ వైఖరిని తీవ్రంగా వ్యతిరేకించారు. దాదాపు అన్ని జిల్లాల్లో అసంతృప్తులు కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా తొలి జాబితాలో టిక్కెట్లు దక్కని ముఖ్య నేతలకు.. రెండో జాబితాలో సైతం చుక్కెదురు అయ్యింది.

ముఖ్యంగా విశాఖ జిల్లాలో అసంతృప్తులు ఎక్కువగా బయటపడ్డాయి. పెందుర్తి,ఎలమంచిలి స్థానాలు పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించడంతో.. అక్కడ టిక్కెట్లు ఆశించిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి, నాగేశ్వరరావు తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. తమ అనుచర వర్గంతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. విశాఖ దక్షిణం సీటు ఆశించిన ఇన్చార్జి గండి బాబ్జి టిడిపికి రాజీనామా చేశారు. భీమిలికి చెందిన మరో నేత పాసర్ల ప్రసాద్ ఇప్పటికే తన రాజీనామాను ప్రకటించారు.ఇక మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రిషికొండలో తన అనుచరులతో సమావేశం అయ్యారు. గంటా శ్రీనివాసరావు భీమిలి టిక్కెట్ ను ఆశించారు. కానీ చంద్రబాబు ఆయనను చీపురుపల్లి వెళ్లాలని సూచించారు. దీంతో భవిష్యత్ కార్యాచరణపై చర్చించడానికి అనుచరులతో భేటీ అయ్యారు.

పశ్చిమగోదావరి జిల్లాలో పార్టీలో ముళ్ళపూడి రేణుక పార్టీకి రాజీనామా చేశారు. త్వరలో ఆమె బిజెపిలో చేరాలని నిర్ణయించారు. కృష్ణాజిల్లాలో సైతం సీనియర్ నేతలు అసంతృప్తితో ఉన్నారు. మైలవరం సీటును వైసీపీ నుంచి వచ్చిన వసంత కృష్ణ ప్రసాద్ కు కేటాయించారు. ఈ సీటు పై టిడిపి నేతలు దేవినేని ఉమా, బొమ్మసాని సుబ్బారావు ఆశలు పెట్టుకున్నారు. అయితే ఉమాకు పెనమలూరు సీటు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటికే అక్కడ బోడే ప్రసాద్ టిక్కెట్ ఆశిస్తున్నారు. ఆయనకు చంద్రబాబు సన్నిహిత వ్యక్తులు బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే తొలి జాబితాలో ఇటువంటివి కనిపించలేదు. కానీ రెండో జాబితా ప్రకటించేసరికి రాష్ట్రవ్యాప్తంగా టిడిపిలోని సీనియర్లు ఆందోళన బాట పట్టడం పార్టీ వర్గాల్లో ఒక రకమైన కలవరం కనిపిస్తోంది. అయితే టిడిపి హై కమాండ్ మాత్రం అసంతృప్త నేతలను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Rahul Gandhi : అశాంతి, అరాచకం, అస్థిరత్వం దిశగా ఆందోళన.. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పష్టత లేని...

Rahul Gandhi : ప్రతిపక్ష రాజకీయాల్లో విమర్శలు సహజం. అధికార పక్షాన్ని ప్రశ్నించడం, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడం ప్రతిపక్ష బాధ్యత కూడా. అయితే ఆ విమర్శలు వాస్తవాలు, స్పష్టమైన ఆధారాలు, ప్రత్యామ్నాయ సూచనలతో...
Balakrishna Family Entertainer

Nandamuri Balakrishna : ప్రత్యేక విమానంలో బాలయ్య ని హైదరాబాద్ కి తరలిస్తున్న డాక్టర్లు.. వీడియో వైరల్..

Nandamuri Balakrishna : నందమూరి బాలకృష్ణ రీసెంట్ గానే NBK111 షూటింగ్ లో గాయాలపాలైన సంగతి అందరికీ తెలిసిందే. ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కిస్తున్న సమయం లో అదుపు తప్పి...
CM Vijay viral assembly video

Tamil Nadu CM Vijay : సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. దెబ్బకు మారిపోయిన రాజకీయ సమీకరణాలు..

Tamil Nadu CM Vijay : గత రెండు మూడు రోజులుగా ఢిల్లీ పార్లమెంట్ వద్ద జరుగుతున్న ఉద్రిక్త పరిణామాలను గమనిస్తూనే ఉన్నాం. నీట్ పరీక్షకు సంబంధించిన ప్రశ్న పత్రాలు లీక్ అవ్వడం...
Sujeeth Director

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ ని చూసి వణికిపోతున్న పవన్ ఫ్యాన్స్.. ఇలా అయితే కష్టమే..

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అనుబంధం మామూలుది కాదు. ఒక సాధారణ పవన్ కళ్యాణ్ వీరాభిమాని గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సుజిత్ ,...
Jr NTR

Jr NTR: నిరాశలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఆ సినిమా రద్దు అయ్యినట్టేనా!

Jr NTR: ప్రస్తుతం మన టాలీవుడ్ లో రెబల్ స్టార్ ప్రభాస్ తర్వాత , క్రేజీ కాంబినేషన్స్ ని సెట్ చేసుకున్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే , అది జూనియర్...
Oktelugu Epaper