Homeఎంటర్టైన్మెంట్Allu Arjun: త్రివిక్రమ్ మీద సీరియస్ గా ఉన్న అల్లు అర్జున్...

Allu Arjun: త్రివిక్రమ్ మీద సీరియస్ గా ఉన్న అల్లు అర్జున్…

Allu Arjun: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి దర్శకుడు సైతం ప్రస్తుతం విభిన్న తరహాలో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఒకప్పుడు ఆయన నుంచి వచ్చే సినిమాలు కామెడీ యాక్షన్ జానర్ లో ఉండేవి. ఆ సినిమాలన్నీ అతనికి గొప్ప గుర్తింపును తీసుకొచ్చి పెట్టాయి. ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం వెంకటేష్ తో చేస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ సినిమా విషయంలో ఆయన చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. […]

Allu Arjun: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి దర్శకుడు సైతం ప్రస్తుతం విభిన్న తరహాలో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఒకప్పుడు ఆయన నుంచి వచ్చే సినిమాలు కామెడీ యాక్షన్ జానర్ లో ఉండేవి. ఆ సినిమాలన్నీ అతనికి గొప్ప గుర్తింపును తీసుకొచ్చి పెట్టాయి. ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం వెంకటేష్ తో చేస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ సినిమా విషయంలో ఆయన చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించి ఎలాగైనా తన మార్క్ ను చూపించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక ఇదిలా ఉంటే త్రివిక్రమ్ – జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో ‘గాడ్ ఆఫ్ వార్’ అనే సినిమా రాబోతున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈ సినిమాని రీసెంట్ గా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. దాంతో ఈ సినిమా మీద ప్రేక్షకులకు విశేషమైన అంచనాలైతే ఏర్పడ్డాయి. ఇక ఇంతకుముందు ఇదే సబ్జెక్టుని త్రివిక్రమ్ అల్లు అర్జున్ తో చేయాలని అనుకున్నాడు.

కానీ అల్లు అర్జున్ బిజీగా ఉండడం వల్ల ఈ సినిమాను ఎన్టీఆర్ తో చేస్తున్నట్టుగా ప్రకటించాడు. ఇక దీంతో అల్లు అర్జున్ చాలావరకు త్రివిక్రమ్ మీద సీరియస్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. కారణం ఏంటి అంటే తనకోసం రాసుకున్న కాన్సెప్ట్ ను వేరే హీరోతో ఎలా చేస్తారు. నేను కమిటైన సినిమాలు పూర్తయిన తర్వాత మీకు డేట్స్ ఇస్తానని చెప్పాను కదా అంటూ త్రివిక్రమ్ మీద కొంత వరకు ఫైర్ అయినట్టుగా తెలుస్తుంది.

ఇక ఏది ఏమైనా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న హీరోలందరు వాళ్ల స్టార్ట్ డమ్ ను విస్తరించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. కాబట్టి ఏ ఒక్క మంచి సినిమాను మిస్ చేసుకున్నా కూడా వాళ్ళ ఇమేజ్ పడిపోయే ప్రమాదం ఉంది. అందుకే త్రివిక్రమ్ తో సినిమా చేస్తే మినిమం గ్యారంటీగా ఆడుతుందనే ఉద్దేశ్యం ప్రతి ఒక్కరికి ఉంది.

కాబట్టి అల్లు అర్జున్ ఈ సినిమాని మిస్ చేసుకోవడం ఇష్టం లేక త్రివిక్రమ్ మీద సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. ఇక వీళ్ళ కాంబోలో మరో సినిమా వచ్చే అవకాశం ఉందా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటివరకైతే అల్లు అర్జున్ తో మూడు సినిమాలను చేసి మూడు బ్లాక్ బస్టర్ సక్సెస్ లను అందించిన ఘనత కూడా త్రివిక్రమ్ కే దక్కింది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper