Homeఎంటర్టైన్మెంట్Allu Arjun Sandhya Theater incident: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ కి...

Allu Arjun Sandhya Theater incident: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ కి బిగ్ రిలీఫ్..పోలీసులకు గట్టి షాక్ ఇచ్చిన హై కోర్టు!

Allu Arjun Sandhya Theater incident: గత ఏడాది నేషనల్ వైడ్ గా ఒక ఊపు ఊపేసిన సంఘటన, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun) అరెస్ట్ అవ్వడమే. 2024వ సంవత్సరం డిసెంబర్ 4న విడుదలైన ‘పుష్ప 2’ మూవీ ప్రీమియర్ షో చూసేందుకు హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ కి అల్లు అర్జున్ వెళ్లగా, అక్కడ తొక్కిసలాట జరగడం, రేవంత్ అనే మహిళా చనిపోవడం, ఆమె తనయుడు శ్రీతేజ్ అపస్మారక స్థితిలోకి వెళ్లడం, […]

Allu Arjun Sandhya Theater incident: గత ఏడాది నేషనల్ వైడ్ గా ఒక ఊపు ఊపేసిన సంఘటన, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun) అరెస్ట్ అవ్వడమే. 2024వ సంవత్సరం డిసెంబర్ 4న విడుదలైన ‘పుష్ప 2’ మూవీ ప్రీమియర్ షో చూసేందుకు హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ కి అల్లు అర్జున్ వెళ్లగా, అక్కడ తొక్కిసలాట జరగడం, రేవంత్ అనే మహిళా చనిపోవడం, ఆమె తనయుడు శ్రీతేజ్ అపస్మారక స్థితిలోకి వెళ్లడం, ఇప్పటికీ అతను పూర్తి స్థాయిలో కోలుకోకపోవడం వంటి ఘటనలు అల్లు అర్జున్ ఇమేజ్ ని బాగా దెబ్బ తీశాయి. అయితే గత ఏడాది ఈ కేసు కి సంబంధించి పోలీసులు నాంపల్లి హై కోర్టుకి ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. అల్లు అర్జున్ తో సహా, 23 మంది పేర్లను ఈ ఛార్జ్ షీట్ లో పొందుపరిచారు. అయితే నేడు ఈ ఛార్జ్ షీట్ ని విచారించిన నాంపల్లి హై కోర్టు, ఇందులో అనేక లోపాలు ఉన్నాయి చెప్పి, పోలీసులకు వెనక్కి పంపింది.

ఈ కేసు కి కీలకమైన హార్డ్ డిస్కులు, సీడీలు, పెన్ డ్రైవ్స్ వంటివి ఛార్జ్ షీట్ లో పొందుపర్చలేదు. దీంతో సరైన ఆధారాలు లేకపోవడంతో ఈ ఛార్జ్ షీట్ ని రిటర్న్ చేసింది హై కోర్టు. ఇలా ఈ కేసులో ఛార్జ్ షీట్ ని వెనక్కి పంపడం రెండవసారి. మొదటిసారి కూడా ఎలాంటి ఆధారాలు లేకుండా ఛార్జ్ షీట్ ఫైల్ చేసినందుకు కోర్ట్ పోలీసులను మందలించి వెనక్కి పంపింది. ఇప్పుడు కూడా అదే రిపీట్ అవ్వడం తో అల్లు అర్జున్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల వద్ద ఎలాంటి ఆధారాలు లేవు కాబట్టే, ఛార్జ్ షీట్ ని రెండు సార్లు కోర్టు కొట్టి పారేసింది, రేవంత్ ప్రభుత్వం తమ పోలీసుల నిర్లక్ష్య ధోరణి తో జరిగిన తొక్కిసలాట ని కవర్ చేయడానికి, ఇలా అల్లు అర్జున్ ని కావాలని ఇరికించింది అంటూ అభిమానులు చెప్పుకొస్తున్నారు.

ఇది ఇలా ఉండగా ఈ ఘటన తీవ్రమైన గాయాలు పాలైన శ్రీతేజ్ ఇప్పటికీ పూర్తి స్థాయిలో కోలుకోలేదు. అతని ట్రీట్మెంట్ కి నెలకు లక్షల్లో ఖర్చు అవుతుందట. రీసెంట్ గానే అతని తండ్రి మీడియా ముందుకొచ్చి తమకు ఎలాంటి సహాయం అందలేదంటూ కామెంట్స్ చేశారు. ఆయన వ్యాఖ్యలకు వెంటనే స్పందించిన అల్లు అర్జున్ టీం, శ్రీతేజ్ కి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సహాయం చేయడానికి మేము ముందు ఉంటాము, ఆయన తండ్రి ఈమధ్య కాలం లో మమ్మల్ని సంప్రదించలేదు అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతానికి శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నప్పటికీ, అతను ఎవ్వరినీ గుర్తు పట్టలేని స్థితిలోనే ఉన్నాడు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper