Homeఎంటర్టైన్మెంట్Funky Movie First Week Box Office: 'ఫంకీ' మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు..కనీసం...

Funky Movie First Week Box Office: ‘ఫంకీ’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు..కనీసం ప్రొమోషన్స్ ఖర్చులు కూడా రీకవర్ అవ్వలేదు!

Funky Movie First Week Box Office: విశ్వక్ సేన్(Vishwak Sen) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఫంకీ'(Funky Movie) భారీ అంచనాల నడుమ విడుదలై డిజాస్టర్ ఫ్లాప్ గా నిలిచి, విశ్వక్ సేన్ మార్కెట్ ని పూర్తిగా దెబ్బ తీసింది. లైలా చిత్రం తో ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ ని మూటగట్టుకున్న విశ్వక్ సేన్ ని చూసి, హిట్/ ఫ్లాప్ ఏ హీరో కి అయినా సహజం, విశ్వక్ సేన్ లో మంచి టాలెంట్ […]

Funky Movie First Week Box Office: విశ్వక్ సేన్(Vishwak Sen) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఫంకీ'(Funky Movie) భారీ అంచనాల నడుమ విడుదలై డిజాస్టర్ ఫ్లాప్ గా నిలిచి, విశ్వక్ సేన్ మార్కెట్ ని పూర్తిగా దెబ్బ తీసింది. లైలా చిత్రం తో ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ ని మూటగట్టుకున్న విశ్వక్ సేన్ ని చూసి, హిట్/ ఫ్లాప్ ఏ హీరో కి అయినా సహజం, విశ్వక్ సేన్ లో మంచి టాలెంట్ ఉంది. కచ్చితంగా భారీ కం బ్యాక్ ఇస్తాడని అంతా అనుకున్నారు. జాతి రత్నాలు డైరెక్టర్ అనుదీప్ KV తో విశ్వక్ చేతులు కలపడం తో కుర్రాడు ట్రాక్ లో పడ్డాడు, ఇక ఇరగకుమ్మేస్తాడని అంతా అనుకున్నారు. అలా మంచి అంచనాల మధ్య విడుదలైన ‘ఫంకీ’ చిత్రం, విశ్వక్ సేన్ కెరీర్ లో మరో భారీ డిజాస్టర్ గా నిల్చింది. అయితే వారం రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రాంతాల వారీగా ఎంత వసూళ్లను రాబట్టింది అనేది చూద్దాం.

ముఖ్యంగా 7వ రోజున ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గా 23 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఓవరాల్ గా మొదటి వారం వచ్చిన వసూళ్లను ఒకసారో పరిశీలిస్తే, నైజాం ప్రాంతం నుండి 2.21 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ఆంధ్రా + సీడెడ్ నుండి 1.92 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి మొదటి వారం 4.13 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు, 7.75 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇక మిగిలిన ప్రాంతాల విషయానికి వస్తే కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ ప్రాంతాలకు కలిపి 1.69 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా మొదటి వారం ఈ చిత్రానికి 5.82 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు, 11.40 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా 22 కోట్ల రూపాయలకు జరిగింది. అంటే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే ఇంకా ఈ చిత్రం 16 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టాలి. అది దాదాపుగా అసాధ్యం అని అంటున్నారు విశ్లేషకులు. మహా అయితే ఈ వీకెండ్ మొత్తం కలిపి మరో రెండు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబోట్టోచ్చు, ఓవరాల్ గా 8 కోట్ల రూపాయిల షేర్ ని ఫుల్ రన్ లో రాబట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper