Homeఎంటర్టైన్మెంట్Sonali Bendre: సోనాలి బింద్రే కొడుకు ని ఎప్పుడైనా చూశారా..? హృతిక్ రోషన్ నే మించిపోయాడుగా..

Sonali Bendre: సోనాలి బింద్రే కొడుకు ని ఎప్పుడైనా చూశారా..? హృతిక్ రోషన్ నే మించిపోయాడుగా..

Sonali Bendre: తెలుగు , తమిళం , హిందీ అనే తేడా లేకుండా , ప్రతీ భాషలోనూ సినిమాలు చేస్తూ , లేడీ సూపర్ స్టార్ స్థాయికి ఎదిగిన నటి సోనాలి బింద్రే. ఈమె మన టాలీవుడ్ ఆడియన్స్ కి ‘మురారి’ చిత్రం ద్వారా పరిచయమైంది. ఈ సినిమా ఆరోజుల్లో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మహేష్ బాబు కెరీర్ లో కల్ట్ క్లాసిక్ చిత్రం గా నిలిచిపోయింది. ఈ సినిమా […]

Sonali Bendre: తెలుగు , తమిళం , హిందీ అనే తేడా లేకుండా , ప్రతీ భాషలోనూ సినిమాలు చేస్తూ , లేడీ సూపర్ స్టార్ స్థాయికి ఎదిగిన నటి సోనాలి బింద్రే. ఈమె మన టాలీవుడ్ ఆడియన్స్ కి ‘మురారి’ చిత్రం ద్వారా పరిచయమైంది. ఈ సినిమా ఆరోజుల్లో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మహేష్ బాబు కెరీర్ లో కల్ట్ క్లాసిక్ చిత్రం గా నిలిచిపోయింది. ఈ సినిమా తర్వాత సోనాలి బింద్రే కి టాలీవుడ్ లో క్రేజ్ ఎవ్వరూ ఊహించని రేంజ్ లో పెరిగిపోయింది. ఈ చిత్రానికి ముందే సోనాలి బింద్రే బాలీవుడ్ లో పెద్ద టాప్ హీరోయిన్. అక్కడ షారుఖ్ ఖాన్ , సల్మాన్ ఖాన్ , హృతిక్ రోషన్ వంటి బడా స్టార్స్ సరసన హీరోయిన్ గా నటించి మంచి పేరు సంపాదించింది.

అయితే ఆమెకు బాలీవుడ్ లో ఎన్ని సూపర్ హిట్స్ చేసిన రానటువంటి క్రేజ్ , టాలీవుడ్ లో కేవలం నాలుగైదు సినిమాలకే వచ్చింది. మురారి తర్వాత ఆమె చేసిన ఇంద్ర, శంకర్ దాదా MBBS , మన్మధుడు, ఖడ్గం వంటి చిత్రాలు కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఆమె చేసిన తెలుగు చిత్రాల్లో కేవలం ‘పల్నాటి బ్రహ్మనాయుడు’ మాత్రమే ఫ్లాప్ గా నిల్చింది. కెరీర్ పీక్ రేంజ్ లో ఉన్నప్పుడే గోల్డీ బెహిల్ అనే బాలీవుడ్ డైరెక్టర్ ని ప్రేమించి పెళ్లాడిన సోనాలి బింద్రే, ఆ తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. 2013 వ సంవత్సరం లో ‘ఒన్స్ అపాన్ ఏ టైం ఇన్ ముంబై’ అనే చిత్రం ద్వారా రీ ఎంట్రీ ఇచ్చింది, కానీ ఆ తర్వాత పదేళ్ల పాటు బ్రేక్ ఇచ్చి ‘లవ్ యు హమేషా’ అనే చిత్రం లో కనిపించింది.

ఇక ఆ తర్వాత ఇప్పటి వరకు మరో సినిమాలో కనిపించలేదు సోనాలి. కొన్నాళ్ల పాటు బ్రెయిన్ క్యాన్సర్ తో ఇబ్బంది పడుతూ వచ్చిన సోనాల్ బింద్రే , విజయవంతం గా క్యాన్సర్ ని కూడా జయించింది. ఇకపోతే ఈమెకు రణవీర్ అనే కుమారుడు ఉన్నాడు. ఇతని లేటెస్ట్ ఫోటోలు చూసిన నెటిజెన్స్ షాక్ కి గురి అవుతున్నారు. ఇంత అందంగా ఉన్నాడేంటి ?, బాలీవుడ్ లో హృతిక్ రోషన్ నే మించిపోయాడు కదా అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కచ్చితంగా ఇతను రాబోయే రోజుల్లో హీరో గా వస్తాడు , బాలీవుడ్ లో పెద్ద రేంజ్ కి వెళ్లాడని అంటున్నారు. సోషల్ మీడియా లో బాగా వైరల్ అయినటువంటి అతని లేటెస్ట్ ఫోటోలు కొన్ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.

 

View this post on Instagram

 

A post shared by E24 Bollywood (@e24official)

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper