spot_img
Homeఎంటర్టైన్మెంట్ఉప్పొంగిన అభిమాన సంద్రంలో తడిసిన స్టైలిష్ స్టార్

ఉప్పొంగిన అభిమాన సంద్రంలో తడిసిన స్టైలిష్ స్టార్

Allu Arjun
తమ అభిమాన కథానాయకుడిని జీవితంలో ఒకసారైనా ప్రత్యక్షంగా చూడాలని సాధారణంగా అభిమానులందరూ కోరుకుంటారు. ఆ హీరో తమ ఊరికొస్తున్నారని తెలిస్తే ఇక అభిమానం కట్టలు తెంచుకోకుండా ఆపడం ఎవరి వల్లా కాదు. తాజాగా అలాంటి ఉప్పొంగిన సముద్రం లాంటి అభిమానంలో మునిగి తేలారు యువ కథానాయకుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఈ సీన్ తో ఉభయగోదావరి జిల్లాలలో మెగా హీరోలకి అశేష ప్రజాధారణ ఉందన్న సంగతి మరోసారి బహిర్గతమైంది. షూటింగ్ నిమిత్తం తూర్పు గోదావరి జిల్లాలోని రంపచోడవరం వెళ్లిన అల్లు అర్జున్ కి ఫ్యాన్స్ భారీ సంఖ్యలో రోడ్స్ మీదకి చేరి ఘన స్వాగతం పలికి ప్రేమని చాటుకున్నారు.

Also Read: మోస్ట్ హాట్ జోడీ నుండి బోల్డ్ సినిమా !

అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్ లో ‘పుష్ప’ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. గంధపు చక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ చిత్ర షూటింగ్ లో ఎక్కువ శాతం అటవీ ప్రాంతాల్లో చేయాల్సి ఉండగా గత కొన్నిరోజుల నుంచి మారేడుమిల్లి, రంపచోడవరం ప్రాంతాలకి చెందిన మన్యంలో పుష్ప చిత్రీకరణ జరుగుతుంది. మంగళవారం రాత్రి బన్నీని చూడటానికి వచ్చిన అభిమానులతో రంపచోడవరం జంక్షన్ నిండిపోయింది. చీకట్లను సైతం లెక్కచేయకుండా తనని చూసేందుకు వచ్చిన అభిమానులను చూసి ఆనందించిన బన్నీ వారందరికీ అభివాదం చేశారు.

Also Read: డిజిటల్ & శాటిలైట్ రైట్స్ లో మహేష్ సరికొత్త రికార్డ్ !

ఇందుకు సంబంధించిన ఫోటోను అల్లు అర్జున్ ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేస్తూ ‘థ్యాంక్యూ రంపచోడవరం’ అని పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో,ఫొటోస్ సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఇక ఈ షెడ్యూల్ మంగళవారం పూర్తయినట్టు సమాచారం. తరువాతి షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ కేరళ వెళ్తున్నారట. ఈ సినిమాలో బన్నీ సరసన రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తున్నారు. మిరోస్లావ్ క్యూబా బ్రోజెక్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టు 13న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Venkatesh Kalyan Ram Movie

Venkatesh Kalyan Ram Movie: అనిల్ రావిపూడి కి తెలియకుండా వెంకటేష్ – కళ్యాణ్ రామ్ ఎంజాయ్ చేస్తున్నారుగా…

Venkatesh Kalyan Ram Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో గొప్ప విజయాలను సాధిస్తున్న దర్శకులు చాలా తక్కువ మంది ఉన్నారు. ముఖ్యంగా కమర్షియల్ సినిమాలను చేస్తూ...
Bigg Boss Telugu

Bigg Boss 10 Telugu: ‘బిగ్ బాస్ 10’ ఆఫర్ పై జబర్దస్త్ బ్యూటీ హాట్ కామెంట్స్.. ఈ...

Bigg Boss 10 Telugu: సెప్టెంబర్ 6 న ఇండియా వైడ్ గా అన్ని భాషలకు సంబంధించిన బిగ్ బాస్ సీజన్స్ గ్రాండ్ గా లాంచ్ కాబోతున్నాయి. ముఖ్యంగా మన తెలుగు ఆడియన్స్...
Nagarjuna

Nagarjuna: నాగార్జున కొడుకుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడా…

Nagarjuna: తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని కీర్తి ప్రతిష్టలను తీసుకొచ్చిన వాళ్ళలో అక్కినేని నాగేశ్వరరావు ఒకరు. ఎన్నో అద్భుతమైన పాత్రలను పోషించి ప్రేక్షకులను మైమరపింపజేసిన ఆయన ఇతర ఇండస్ట్రీలో నుంచి ఎదురయ్యే...
Abhishek Sharma

Abhishek Sharma: టీమిండియా వర్సెస్ జింబాబ్వే: అరుదైన ఘనతకు చేరువలో అభిషేక్ శర్మ..

Abhishek Sharma: పొట్టి క్రికెట్ ఫార్మాట్లో టీమ్ ఇండియాకు తిరుగులేని ఆయుధం లాంటి ఆటగాడు అభిషేక్ శర్మ. అతడికి ఫామ్ తో సంబంధం ఉండదు. బౌలర్ ఎవరనేది లెక్క ఉండదు. మైదానం...
Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi: ఆ 15 ఏళ్ల బుడ్డోడు బ్యాటర్ కాదు డైనమైట్.. టీమిండియా బౌలింగ్ దిగ్గజం షాకింగ్ కామెంట్స్

Vaibhav Suryavanshi: హర్భజన్ సింగ్.. టీమ్ ఇండియాలో లెజెండరీ స్పిన్ బౌలర్. ఆస్ట్రేలియా నుంచి మొదలు పెడితే న్యూజిలాండ్ వరకు ప్రతి జట్టు మీద అతడికి అద్భుతమైన రికార్డులు ఉన్నాయి. అతడు గూగ్లీ...
Oktelugu Epaper