Bro Movie Teaser: మరో నెల రోజుల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ‘బ్రో ది అవతార్’ సినిమా విడుదల అవ్వబోతుంది. అయితే ఇప్పటి వరకు ఈ సినిమాకి సంబంధించి ప్రమోషనల్ కంటెంట్ విడుదల కాలేదు. టీజర్ కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఎదురో చూస్తున్నారు. ఈ వారం లో కచ్చితంగా టీజర్ ఉంటుంది అనే బజ్ వస్తుంది వస్తుంది, టీజర్ మాత్రం విడుదల కావడం లేదు.
దీనిపై ఫ్యాన్స్ సోషల్ మీడియా లో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థపై చాలా తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు, అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎదురుచూపులకు చివరికి తెరపడనుంది. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని వచ్చే వారం విడుదల చేయబోతున్నారట. దీనికి సంబంధించిన అప్డేట్ ని ఈరోజు లేదా రేపటి లోపు ట్విట్టర్ ద్వారా తెలియచెయ్యబోతున్నట్టు సమాచారం. ఈ టీజర్ కి సంబంధించిన కొన్ని హైలైట్స్ సోషల్ మీడియా లో లీక్ అయ్యి తెగ వైరల్ గా మారింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ సినిమా టీజర్ నిడివి సుమారుగా నిమిషం వరకు ఉంటుందట, అల్ట్రా క్లాస్ మరియు స్టైలిష్ స్వాగ్ తో పవన్ కళ్యాణ్ ఈ టీజర్ లో కనిపించబోతున్నట్టు సమాచారం. ఇందులో పవన్ కళ్యాణ్ దేవుడిగా కనిపించబోతున్న సంగతి తెలిసిందే. గతం లో ఆయన ‘గోపాల గోపాల’ చిత్రం లో కూడా దేవుడిగా కనిపిస్తాడు. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటుగా ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా నటిస్తున్నాడు. జర్మనీ లో ఒక సాంగ్ షూట్ మినహా, చిత్రం మొత్తం పూర్తి అయ్యిందని, ఇందులో అందరూ వింటేజ్ పవన్ కళ్యాణ్ ని చూస్తారు అంటూ చెప్తున్నారు.
పవన్ కళ్యాణ్ మార్క్ కామెడీ టైమింగ్ టీజర్ లో కూడా కనిపిస్తుందట, అంతే కాదు పవన్ కళ్యాణ్ షార్ప్ మరియు షార్ట్ లెంగ్త్ డైలాగ్స్ బాగా సూట్ అవుతాయి అనే విషయం తెలిసిందే, ఈ టీజర్ లో కూడా అలాంటి డైలాగ్స్ ఉంటాయట. మరి విడుదలకు ముందే అంచనాలను రేపిన ఈ టీజర్, అభిమానులను అనుకున్న స్థాయిలో అలరిస్తుందో లేదో చూడాలి.