Maruti Brezza Facelift: ఆటోమొబైల్ మార్కెట్లో మారుతి సుజుకీ కార్ల అంటే ఎగబడి కొంటారు. మిడిల్ క్లాస్ నుంచి ఉన్నత వర్గాల వారికి అందరికీ అనుగుణంగా ఈ కార్లు ఉంటాయి. అయితే ఈ కంపెనీకి చెందని ఓ కారును ఫేస్ లిప్ట్ గా తీసుకొచ్చింది. ఇప్పటి వరకు ఎస్ యూవీ లో అత్యంత ఆదరణ పొందిన ‘బ్రెజ్జా’ను కొన్ని మార్పులు చేసి రిలీజ్ చేసింది. అయితే దీనిని బుక్ చేసుకొన్న తొలి కస్టమర్ కు కారును అందిస్తున్నట్లు ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకీ ఈ కారు ఎలా ఉందంటే?
భారత్ లో కార్లు కొనేవారు డిజైన్ విషయంలో ప్రత్యేక ఆసక్తి చూపుతుంటారు. దీంతో మారుతి సుజుకీ తన బ్రెజ్జా మోడల్ ను ఫేస్ లిప్ట్ గా తీసుకొచ్చింది. దీనిని సబ్ 4 మీటర్ కాంపాక్ట్ ఎస్ యూవీగా మొత్తం నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంచింది. వీటిలో ఒకటి ఎల్ ఎక్స్ ఐ, వీఎక్స్ ఐ, జడ్ ఎక్స్ ఐ, జడ్ ఎక్స్ ఐ ప్లస్ ఉన్నాయి. ఈ కార్లు డిజైన్ తో పాటు సేప్టీ విషయంలోనూ ఆకట్టుకోనున్నాయి.
బ్రెజ్జా ఎక్స్‌టీరియర్ డిజైన్‌లో కొన్ని కీలకమైన మార్పులు చేశారు. ముందు భాగంలో కొత్త డిజైన్ గ్రిల్, స్పోర్టీ గార్నిష్, రివైజ్డ్ బంపర్లు, సిల్వర్ స్కిడ్ ప్లేట్లను అందించారు. సైడ్ ప్రొఫైల్‌లో కొత్త 16 అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, రీ డిజైన్ చేసిన క్లాడింగ్ కారుకు మరింత రగ్గడ్, మోడ్రన్ లుక్‌ను అందిస్తున్నాయి. ఇంటీరియర్ లోనూ హంగులతో కొత్త ఫీచర్లను జోడించారు. ఇందులో 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉండనుంది. వైర్‌లెస్ ఛార్జింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఉంచారు.
సేప్టీ విషయంలో 2026 బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ భారత్ ఎన్‌సిఎపి లో 5 స్టార్ రేటింగ్ సాధించింది. అన్ని వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు స్టాండర్డ్‌గా వస్తున్నాయి. దీనితో పాటు లెవెల్ 1 అడాస్, 360 డిగ్రీ కెమెరా, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి అధునాతన సేఫ్టీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అలాగే 1.0 లీటర్ బూస్టర్‌జెట్ టర్బో పెట్రోల్ ఇంజన్. ఇది 109 బీహెచ్ పీ పవర్, 170 ఎన్ ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనిని 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో అందించారు. అలాగే సీఎన్ జీ వేరియంట్‌లో ఈసారి బూట్ స్పేస్ తగ్గకుండా అండర్‌బాడీ డ్యూయల్ ట్యాంక్ టెక్నాలజీ ని ఉపయోగించారు.
ఈ కారు డెలివరీలు దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. ఇటీవల లాంచ్ అయిన ఈ మోడల్‌కు సంబంధించి తొలి కస్టమర్ డెలివరీ వీడియోలు కూడా సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. కొత్త ఫీచర్లు, అప్‌డేటెడ్ డిజైన్, సరికొత్త ఇంజన్ ఆప్షన్‌తో వచ్చిన ఈ ఎస్ యూవీ ప్రారంభ ధరను రూ. 7.40 లక్షలు గా కంపెనీ నిర్ణయించింది.