Bigg Boss Agnipariksha 2: రీసెంట్ గానే మొదలైన ‘అగ్నిపరీక్ష 2’ కి ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో కళ్లారా ప్రతీ రోజు సోషల్ మీడియా లో చూస్తూనే ఉన్నాం. ఇక రీసెంట్ ఎపిసోడ్స్ లో టాస్కులు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడే ఈ రేంజ్ టాస్కులు ఉంటే , ఇక బిగ్ బాస్ హౌస్ లో ఈసారి ఎలాంటి టాస్కులను నిర్వహించబోతున్నారో అనే అంచనాలు ప్రేక్షకుల్లో ఏర్పడేలా చేసింది ఈ ‘అగ్ని పరీక్ష 2’ షో. ఇదంతా పక్కన పెడితే నేటి ఎపిసోడ్ లో ‘అగ్ని పరీక్ష 1’ ద్వారా ‘బిగ్ బాస్ 9’ లోకి ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్స్ ఒక్కొక్కరిగా వచ్చి , ‘అగ్నిపరీక్ష 2’ కంటెస్టెంట్స్ కి కొన్ని టాస్కులు నిర్వహించి , వాళ్ళ చేతుల్లో పవర్ కార్డ్స్ పెట్టి వెళ్లారు. ముందుగా ప్రియా శెట్టి వచ్చి రాజా కుమారి దయానా , చరణ్ మరియు అపూర్వలకు ఒక టాస్క్ నిర్వహిస్తుంది.
ఈ టాస్క్ లో రాజకుమారి దయానా గెలుస్తుంది. ఇక తర్వాత మర్యాద మనీష్ వచ్చి దీపక్ , హేమంత్ , గాయత్రీ లకు ఒక టాస్కు ని నిర్వహిస్తాడు. ఈ టాస్క్ లో దీపక్ గెలుస్తాడు. ఇక చివర్లో బిగ్ బాస్ 9 టైటిల్ విన్నర్ కళ్యాణ్ పడాల వచ్చి రోహిత్ , మితిలేష్ రెడ్డి , అమన్ లకు ఒక టాస్క్ నిర్వహిస్తాడు. రెండు లెవల్లో సాగిన ఈ టాస్క్ లో , మొదటి లెవెల్ లో మితిలేష్ అవుట్ అవుతాడు. ఆ తర్వాత రోహిత్ , అమన్ లకు మధ్య హోరాహోరీగా జరిగిన ఒక టాస్క్ లో అమన్ గెలుస్తాడు. ఇది కాస్త కాంట్రవర్సీ అయ్యింది , అదేంటో మీరు ఈరోజు టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్ లో చూస్తేనే బాగుంటుంది. అయితే మర్యాద మనీష్ వచ్చినప్పుడు ఒక ఆసక్తికరమైన సంఘటన జరుగుతుంది.
మర్యాద మనీష్ రాగానే , రెండు మాటలు మాట్లాడిన శ్రీముఖి , ఇక వెళ్లి కూర్చొని గేమ్ చూడమని చెప్తుంది. అప్పుడు మనీష్, అప్పుడేనా?, కాసేపు వాళ్ళతో మాట్లాడనివ్వొచ్చు కదా అని అంటాడు. అప్పుడు నవదీప్, నాకు అర్జెంటు గా ఒక పని ఉండడం వల్ల , నేను బయటకు వెళ్తున్నాను , నువ్వు ఎలాగో వచ్చావు కాబట్టి , నా బదులుగా నువ్వే ఈ షో నడుపు అని అంటాడు. అప్పుడు ఆయన ‘అగ్నిపరీక్ష 2’ నుండి వెళ్లిపోగా , మర్యాద మనీష్ ఆయన స్థానం లో కూర్చుంటాడేమో అని అంతా అనుకున్నారు, కానీ ఆయన్ని గెస్ట్ సీట్ లోనే కూర్చోబెట్టారు , ఒక్క టాస్క్ పూర్తి అవ్వగానే పంపేశారు. అయితే నవదీప్ కేవలం ఈరోజుటి ఎపిసోడ్ లో మాత్రమే కనిపించడు , రేపటి నుండి ప్రసారమయ్యే ఎపిసోడ్స్ లో ఆయన్ని మనం చూడొచ్చు.