BiggBossTelugu9 Naga prashanth : ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ఎదురు చూసిన బిగ్ బాస్ సీజన్ 9 నేడు గ్రాండ్ గా మొదలైంది. ఈ సీజన్ లో కంటెస్టెంట్స్ అందరు అదిరిపోయాడు. సామాన్యుల ఎంపిక కూడా అదిరిపోయింది. కచ్చితంగా బిగ్ బాస్ హౌస్ లో వీళ్లంతా బోలెడంత కంటెంట్ ని ఇచ్చేలాగానే అనిపిస్తున్నారు. అంతా బాగానే ఉంది కానీ డిమాన్ పవన్ ఎంపిక పై మాత్రం ఆడియన్స్ లో కాస్త అసంతృప్తి ఉంది. ఎందుకంటే అగ్నిపరీక్ష షో లో ఎలాంటి మార్కుని క్రియేట్ చేసుకోలేకపోయిన కంటెస్టెంట్స్ లో ఒకరు ఈయన. ఇతను ఆడియన్స్ ఓటింగ్ ద్వారా వెళ్ళాడు అనడమే అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. అయితే అగ్నిపరీక్ష జడ్జీల సెలక్షన్ ద్వారా కచ్చితంగా నాగ ప్రశాంత్ హౌస్ లోకి వెళ్తాడని అనుకున్నారు. ఏ కంటెస్టెంట్ కి లేని విధంగా ఇతనికి రెండు స్టార్స్ కూడా వచ్చాయి.
అలాంటి కంటెస్టెంట్ ని జడ్జీలు ఎంపిక చేయకపోవడం గమనార్హం. ఇదంతా పక్కన పెడితే నాగ ప్రశాంత్ కి అగ్నిపరీక్ష చివరి నాలుగు ఎపిసోడ్స్ లో మంచి హైప్ వచ్చింది. ఆడియన్స్ ఓటింగ్ కూడా బలంగా పడింది. పవన్ కంటే ఓటింగ్ రేస్ లో ఇతనే ముందు ఉన్నాడని టాక్. అయినప్పటికీ కూడా పవన్ ని లోపలకు పంపి, నాగ ప్రశాంత్ ని పంపకపోవడం నిజంగా అన్యాయమే. అయితే సెప్టెంబర్ 28 న రీ లాంచ్ ఎపిసోడ్ ఉంది కాబట్టి, కచ్చితంగా నాగ ప్రశాంత్ ని వైల్డ్ కార్డు కంటెస్టెంట్ గా ఎంపిక చేసే అవకాశం ఉంటుందని అంటున్నారు. మరి ఇందులో ఎంత వరకు నిజముందో చూడాలి.