HomeNewsVRK Diet: VRK డైట్ తీసుకుంటే ఆసుపత్రి పాలేనా.. ఎందుకీ వివాదం.. ఇంతకీ ఏం జరిగింది..

VRK Diet: VRK డైట్ తీసుకుంటే ఆసుపత్రి పాలేనా.. ఎందుకీ వివాదం.. ఇంతకీ ఏం జరిగింది..

VRK Diet: వీరమాచినేని రామకృష్ణ అలియాస్ వి ఆర్ కె డైట్ పై వివాదం నెలకొంది. ఈ వ్యవహారం ఏకంగా పోలీస్ కేసు దాక వెళ్లిపోయింది. వీరమాచినేని రామకృష్ణ డైట్ వివాదం పై రెండు తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త చర్చ మొదలైంది. వీరమాచినేని రామకృష్ణ అలియాస్ వి ఆర్ కె తన డైట్ ద్వారా విశేషమైన ప్రాచుర్యం పొందారు. కరోనా సమయంలో ఈయన వీడియోలు.. ఈయన చెప్పిన డైట్ సంచలనంగా మారింది. ముఖ్యంగా డయాబెటిక్ రోగులు ఈయన డైట్ […]

VRK Diet: వీరమాచినేని రామకృష్ణ అలియాస్ వి ఆర్ కె డైట్ పై వివాదం నెలకొంది. ఈ వ్యవహారం ఏకంగా పోలీస్ కేసు దాక వెళ్లిపోయింది. వీరమాచినేని రామకృష్ణ డైట్ వివాదం పై రెండు తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త చర్చ మొదలైంది. వీరమాచినేని రామకృష్ణ అలియాస్ వి ఆర్ కె తన డైట్ ద్వారా విశేషమైన ప్రాచుర్యం పొందారు. కరోనా సమయంలో ఈయన వీడియోలు.. ఈయన చెప్పిన డైట్ సంచలనంగా మారింది. ముఖ్యంగా డయాబెటిక్ రోగులు ఈయన డైట్ ఫాలో అయ్యేవారు. అయితే ఇప్పుడు ఈయన డైట్ ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది.

సైబరాబాద్ పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం.. 30 సంవత్సరాల వయసు ఉన్న కన్నడ సాయి కృష్ణ అనే ఎల్.ఎల్.బి విద్యార్థి 2018 నుంచి టైప్ 1 డయాబెటిస్ తో బాధపడుతున్నాడు. అతడు డయాబెటిస్ ను కంట్రోల్ చేసుకోవడానికి ఇన్సులిన్ వాడుతున్నాడు. వి ఆర్ కే డైట్ కు సంబంధించిన సోషల్ మీడియా పోస్టులను.. వీడియోలను అతడు చూశాడు. గత ఎడాది హైదరాబాదులో వీఆర్కే హెల్త్ కేర్ సెంటర్ ను అతడు సంప్రదించాడు. అక్కడ అతడికి ఇన్సులిన్ కొనసాగించకుండా విఆర్కే డైట్ పాటించాలని సూచించారు. డైట్ సేవలు.. సప్లిమెంట్ల కోసం దాదాపు 26,000 అతడు చెల్లించాడు. ఆ తర్వాత అతడు ఇన్సులిన్ ఆపివేశాడు. రెండు రోజులకే తీవ్రమైన అస్వస్థతకు గురయ్యాడు. ఆ తర్వాత తీవ్రమైన డీహైడ్రేషన్ తో బాధపడుతూ కిమ్స్ ఆస్పత్రిలో చేరాడు. ఆసుపత్రిలో ఖర్చులు సుమారు 58,219 రూపాయల దాకా అయ్యాయి.

ఎందుకు ఈ వివాదం

వి ఆర్ కే డైట్ విషయంలో అసలు సమస్య .. తక్కువ కార్బోహైడ్రేట్.. ఎక్కువగా ఉన్న డైట్.. ఇదే వివాదంగా మారింది. టైప్ 1 డయాబెటిస్ కు ఇన్సులిన్ ఆపాలని చెప్పారా.. ఇలాంటి వైద్య సూచన ఇవ్వడానికి సంబంధిత వ్యక్తులకు అవసరమైన అర్హతలు ఉన్నాయా.. డైట్ ద్వారా డయాబెటిస్.. క్యాన్సర్.. మూత్రపిండాల సంబంధించిన వ్యాధులు నయం చేయవచ్చనే ప్రచారానికి శాస్త్రి ఆధారాలు ఏమిటి. ఈ నేపథ్యంలో హెల్త్ కేర్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ కూడా ఇటీవల వీఆర్కే డైట్ కు సంబంధించి విస్తృత ఆరోగ్య వాదనలపై కోర్టు దాకా వెళ్ళింది..

ఇక ఈ వ్యవహారం ఆధారంగా రాయదుర్గం పోలీసులు విఆర్కే.. డాక్టర్ కోటేశ్వరరావు పై కేసు నమోదు చేశారు. దర్యాప్తు మొదలు పెట్టారు. ఈ కేసులో మోసం.. ప్రమాదకరమైన.. అనధికారిక వైద్య సలహాకు సంబంధించిన నిబంధనలతో పాటు నేషనల్ మెడికల్ కమిషన్ యాక్ట్.. ఆబ్జెనబుల్ అడ్వర్టైజ్మెంట్స్ యాక్ట్ కింద సెక్షన్లు కూడా నమోదు చేశారు. ఇప్పటివరకు కేసు నమోదు అయింది. ఎల్ఎల్బీ విద్యార్థి ఆసుపత్రిలో చేరినట్టు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.. దర్యాప్తు కూడా మొదలుపెట్టారు. అయితే అతని అనారోగ్యానికి విఆర్కే డైట్/ ఇన్సులిన్ ఆపడం నేరుగా కారణమా.. దీనికి ఎవరు సలహా ఇచ్చారు.. ఆ సలహా ఇచ్చిన వారి అర్హతలు ఏమిటి అన్నది ఒక ముఖ్యమైన విషయం. టైప్ 1 డయాబెటిస్ లో శరీరం ఇన్సులిన్ చాలా తక్కువగా ఉత్పత్తి చేస్తుంది. కొన్ని సందర్భాలలో అసలు ఉత్పత్తి చేయదు. అందుకే ఇన్సులిన్ చికిత్స సాధారణంగా. ఇన్సులిన్ తీవ్రంగా తగ్గిపోవడం లేదా ఆగిపోవడం తీవ్రమైన అనారోగ్య సమస్యకు దారి తీయవచ్చు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper