Bigg Boss Agnipariksha 2: సోషల్ మీడియా లో ఇప్పుడు ఎక్కడ చూసినా ‘అగ్ని పరీక్ష 2’ గురించే చర్చ. ఆసక్తి కలిగిస్తున్న విషయం ఏమిటంటే, టాప్ న్యూస్ చానెల్స్ కూడా కొన్ని ఈ షో గురించి రివ్యూస్ ఇస్తున్నాయి. అంటే దీనిని బట్టీ ఈ షో ఏ రేంజ్ లో జనాల్లోకి వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. అయితే ‘అగ్ని పరీక్ష 2’ పై అనేక అనుమానాలు జనాల్లో ఉన్నాయి. ముఖ్యంగా ఇది ఒక స్క్రిప్ట్ తో నడుస్తున్న షో అని , రియాలిటీ షో అసలు కాదని , వాళ్ళు కోరుకున్న కంటెస్టెంట్స్ ని మాత్రమే బిగ్ బాస్ హౌస్ లోకి పంపిస్తున్నారని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. రీసెంట్ గా ఈ షో గురించి తెలిసిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు అందరినీ షాక్ కి గురి చేస్తోంది.
అదేమిటంటే నేటి ఎపిసోడ్ లో ‘బిగ్ బాస్ 9’ టైటిల్ విన్నర్ కళ్యాణ్ పడాల ఎంట్రీ ఇస్తాడు, ఆయన అమన్ కి ఎక్కువగా సపోర్టివ్ గా ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. వీళ్ళ మధ్య ఏముందని సోషల్ మీడియా లో నెటిజెన్స్ వెతకడం మొదలు పెడితే, గతం లో కళ్యాణ్ పడాల కి పని చేసిన పీఆర్ టీం , ఇప్పుడు అమన్ కి కూడా పనిచేస్తోంది. అంతే కాకుండా , బయట వీళ్లిద్దరు మంచి స్నేహితులు అట. అమన్ పుట్టినరోజు వేడుకలకు కళ్యాణ్ పడాల కూడా గతం లో వెళ్లాడని సోషల్ మీడియా లో కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. కళ్యాణ్ పడాల సపోర్టు తో పాటు , జడ్జీలు కూడా అమన్ కి అవసరానికి మించిన అవకాశాలు ఇస్తున్నారని నెటిజెన్స్ అంటున్నారు. చూస్తుంటే అమన్ మ్యానేజ్మెంట్ కోటా అనిపిస్తోంది అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఈ షోపై వస్తున్నా మరో ఆరోపణ ఏంటంటే , ఇప్పుడు ఉన్నటువంటి ముగ్గురు జడ్జీలలో , ఒక జడ్జీకి సంబంధించిన హెయిర్ స్టైలిస్ట్ కి షో లో పాల్గొనే అవకాశం కల్పించారట. ఆ హెయిర్ స్టైలిస్ట్ పెద్దగా ఏమి టాస్కులు ఆడకపోయినా గేమ్ లో ముందుకు నెడుతున్నారట. ఎట్టి పరిస్థితిలోనూ ఆ కంటెస్టెంట్ ని బిగ్ బాస్ హౌస్ లోకి పంపే ప్రయత్నాలు చేస్తున్నట్టు సోషల్ మీడియా లో ప్రధానంగా వినిపిస్తున్న టాక్. ఇదే కనుక నిజమైతే , భవిష్యత్తులో సామాన్యులు ‘అగ్ని పరీక్ష’ పై నమ్మకాలూ వదిలేసుకునే అవకాశాలు ఉంటాయి. మరి ఇప్పుడు ఉన్నటువంటి టాప్ 15 కంటెస్టెంట్స్ లో , ఆ హెయిర్ స్టైలిస్ట్ ఎవరు అయ్యుంటారని మీరు అనుకుంటున్నారు?, మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపం లో తెలియజేయండి.