Adire Abhi- Anasuya Bharadwaj: జబర్దస్త్ యాంకర్ అనసూయ అందరికి సుపరిచితమే. తన అందంతో అందరిని మంత్రముగ్దులను చేస్తుంది. మాటలతో మైమరపింపజేస్తోంది. యాంకర్లలో ప్రముఖంగా ఆమె పేరే వినిపిస్తోంది. న్యూస్ రీడర్ గా కెరీర్ ప్రారంభించిన ఆమె అనుకోకుండా యాంకర్ గా అవకాశం దక్కించుకుంది. తరువాత సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. తనకు ఎదురే లేదని నిరూపిస్తోంది. జబర్దస్త్ షో ద్వారానే ఆమెకు గుర్తింపు వచ్చిందనేది నిజం. ఆమె కూడా ఇది ఒప్పుకుంటుంది. జబర్దస్త్ ద్వారానే కళాకారులకు తగిన ప్రాధాన్యం దక్కిందని తెలుస్తోంది. వారు ఎక్కడికి వెళ్లినా గుర్తుపడుతూ వారికి విలువ ఇస్తున్నారు
అనసూయ యాంకర్ తో పాటు సినిమాల్లో నటిగా కూడా రాణిస్తోంది. రంగస్థలంలో రంగమ్మత్తగా నటించి ఆ పాత్రకు న్యాయం చేసింది. అందరిని ఆకట్టుకుంది. తన నటనకు ఎదురులేదని తెలియజేసింది. ఇక పుష్ప సినిమాలో కూడా దాక్షాయణిగా చేసి అందరిని ఆశ్చర్యపరచింది. ఇక పుష్ప-2లో కూడా ఆమె పవర్ ఫుల్ పాత్ర చేయబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆమెకు అవకాశాలు వెల్లువలా వస్తున్నాయి. వరుస సినిమాలతో బిజీ అయిపోయింది. సినిమా రంగాన్ని కూడా ఓ ఊపు ఊపేస్తోంది. తన నటనతో అందరిని ఫిదా చేస్తోంది. మంచి మార్కులే కొట్టేస్తోంది. వరుస ఆఫర్లతో మంచి నటిగా కూడా పేరు తెచ్చుకుంటోంది.
Also Read: Jabardasth Varsha: జబర్దస్త్ వర్ష అందాల ఆరబోత: ఇది అందం అంటే
అనసూయ కెరీర్ పై జబర్దస్త్ కమెడియన్ అదిరే అభి షాకింగ్ కామెంట్లు చేశాడు. తాను అనసూయ కెరీర్ ను దగ్గరుండి చూశానని చెప్పాడు. తాము అనసూయను అను అని పిలుస్తామన్నాడు. ఆమె కెరీర్ మలుపు తిరగడానికి ఎవరో కారణం కాదని, ఆమె టాలెంటే ఆమెకు శ్రీరామరక్ష అని ప్రశంసించాడు. ఆమెకు వస్తున్న అవకాశాలు ఎవరో పెట్టిన భిక్ష కాదని ఆమె స్వయంకృషికి నిదర్శనమే అని కితాబిచ్చాడు. దీంతో అభి మాటలను అనసూయ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసింది. దీంతో అవి తెగ వైరల్ అవుతున్నాయి. అనసూయ గ్లామర్ కు ప్రేక్షకులు కూడా ఎక్కువే ఉండటం గమనార్హం.
మరోవైపు అనసూయ జబర్దస్త్ ను వీడిందనే వార్తలు వస్తున్నాయి. పారితోషికం విషయంలో తేడాలు వచ్చి ఆమె జబర్దస్త్ కు గుడ్ బై చెబుతుందనే ఊహాగానాలు వస్తున్నాయి. జబర్దస్త్ యాంకర్ గా మంజూషను తీసుకున్నారనే పుకార్లు హల్ చల్ చేస్తోంది. మొత్తానికి జబర్దస్త్ నుంచి హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ కూడా కొద్ది రోజులుగా కనిపించడం లేదు. వారు కూడా జబర్దస్త్ ను వీడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే జబర్దస్త్ లో కామెడీ జోరు తగ్గిందనే వార్తలకు తోడుగా వీరు దూరం కావడం కూడా ఆందోళన కలిగిస్తోంది. జబర్దస్త్ కు గుండెకాయలా ఉన్న వీరిని యాజమాన్యం వదులుకోవడం చేసిన పెద్ద పొరపాటుగా ప్రేక్షకులు చెబుతున్నారు.
Also Read:Editor Goutham Raju Passed Away: టాలీవుడ్లో మరో విషాదం.. ప్రముఖ సినీ దిగ్గజం కన్నుమూత
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
Read More