Drinking Hot Water: ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. మన దేహం ఆరోగ్యంగా ఉంటే మనకు శ్రీరామరక్షే. లేకపోతే కష్టమే. ఆధునిక కాలంలో వింతైన పోకడలు, పాశ్చాత్య సంస్కృతులు వెరసి మనకు అనారోగ్య సమస్యలు. పొద్దున లేచింది మొదలు పడుకునే వరకు ఒకటే తిండి. దీంతో మన కడుపు కీకారణ్యంగా మారుతోంది. అజీర్తి సమస్యలు వస్తున్నాయి. దీనికి తోడు వ్యాధులు కూడా చుట్టుముడుతున్నాయి. ఏ పనిలోనైనా క్రమశిక్షణ లేకుంటే ఏమవుతుంది. అదుపు తప్పుతుంది. ఇక్కడ అదే జరుగుతోంది. మన శరీరం అనేక సమస్యలతో సతమతమవుతోంది. దానికి విశ్రాంతి అనేది ఇవ్వకుండా ఇరవై నాలుగు గంటలు తింటూ రోగాల బారిన పడుతున్నారు. వందేళ్లు హాయిగా ఉండాల్సిన దేహాన్ని యాభై ఏళ్లకే నిర్వీర్యం చేస్తున్నారు. ఫలితంగా పలాయనం చిత్తగిస్తున్నారు.

మన శరీరంలో ఏర్పడే అనారోగ్య సమస్యలకు మనమే మూల కారణం. ఏ జంతువు కూడా హాస్పిటల్ కు వెళ్లదు. దేనికి కూడా బీపీ, షుగర్, గుండె జబ్బులు వంటివి రావు. కానీ మనిషికే వస్తాయి. అంటే మన ప్రవర్తనలోనే లోపం ఉంది. ఇష్టమొచ్చినట్లుగా తింటూ పొట్టను ఇబ్బంది పెడుతున్నాం. తద్వారా మనం కూడా సమస్యలు కొనితెచ్చుకుంటున్నాం. మన శరీరంలో పెరుగుతున్న కొవ్వు వల్ల గుండె జబ్బులు పొంచి ఉంటున్నాయి. పట్టుమని పాతికేళ్లు కూడా లేకుండానే జబ్బుల బారిన పడుతున్నాం. ఫలితంగా భవిష్యత్ ను అంధకారం చేసుకుంటున్నాం. వైద్యానికే ఖర్చు చేస్తూ జీవితంలో వ్యాధులతోనే సహజీవనం చేస్తున్నాం.
Also Read: Kalyan Ram Bimbisara Trailer: నందమూరి వైవిధ్యమైన హీరోకి ఈ సారి భారీ హిట్ పడేలా ఉందే
ఈ దుస్థితికి కారణాలేంటని ఆలోచిస్తున్నామా? లేదు. ఏది దొరికితే అది తింటూ కడుపును ఖాళీగా ఉంచడం లేదు. శరీరంలో పెరిగిపోయే కొవ్వును అదుపు చేయడానికి ఓ చక్కని పరిష్కార మార్గం ఉంది. దానికి ప్రతి రోజు మనం వేడి నీరు తాగడమే. ఉదయం లేచిన దగ్గర నుంచి దాహం వేసినప్పుడల్లా వేడి నీరు తాగితే అది మన కడుపును శుభ్రం చేస్తుంది. కడుపులో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది. దీంతో మనకు గుండె జబ్బుల ముప్పు ఉండదు. దీన్ని అందరు పాటిస్తే మంచిదే.

ఉదయమే ఓ గ్లాస్ నీటిని వేడి చేసుకుని అందులో ఓ రెండు స్పూన్ల తేనె వేసుకుని తాగితే ఆరోగ్యానికి మంచిది. ఇలా చేస్తూ ఉంటే మన శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతోంది. తద్వారా గుండె జబ్బుల ప్రభావం తగ్గుతుంది. ఆయుర్వేదంలో కూడా వేడి నీరు తాగితే మంచిదనే చెబుతారు. అందుకే గుండె జబ్బుల నివారణకు వేడి నీటిని తాగుతూ మన దేహాన్ని రోగాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని గుర్తిస్తే చాలు.
Also Read:Indian Judiciary: 350 కుటుంబాల చేతుల్లోనే భారత న్యాయవ్యవస్థ.. న్యాయం