Kalyan Ram Bimbisara Trailer: నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా ‘బింబిసార’ సినిమా ట్రైలర్ రికార్డులను సృష్టోస్తోంది. 24 గంటల్లో ట్రైలర్ 10 మిలియన్ వ్యూస్ ను దక్కించుకుంది. పైగా 299.7 కే లైక్ లతో యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. స్టార్ హీరోల సినిమాలకు ఉన్న ఆదరణ ఈ సినిమా ట్రైలర్ కు ఉండటం విశేషం. ఇప్పుడు ఎక్కడా చూసినా బింబిసార ట్రైలర్ గురించే చర్చ జరుగుతుంది. ఇండస్ట్రీ కూడా ఒక్కసారిగా కళ్యాణ్ రామ్ వైపు తిరిగింది.

‘త్రిగడ్తల రాజ్యపు నెత్తుటి సంతకం – బింబిసారుడి ఏక ఛాత్రాధిపత్యం’ అంటూ కళ్యాణ్ రామ్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేసేలా ఉన్నాడు. ‘రాక్షసులు ఎరుగని రావణ రూపం, శత్రువులు గెలవలేని కురుక్షేత్ర యుద్ధం’ అంటూ.. అసలు బింబిసారుడు అంటేనే మరణశాసనం అనేలా సాగింది ఈ ట్రైలర్. ‘బింబిసార’ లుక్ లో కళ్యాణ్ రామ్ తన నట విశ్వరూపాన్ని చూపించాడు.
Also Read: Jabardasth Varsha: జబర్దస్త్ వర్ష అందాల ఆరబోత: ఇది అందం అంటే
ట్రైలర్ లో కూడా హీరోని బాగా ఎలివేట్ చేశారు. ముఖ్యంగా ట్రైలర్ లోని విజువల్స్, యాక్షన్ మరియు ఎలివేషన్ షాట్స్ చాలా బాగున్నాయి. ‘మనం ఎక్కడికి వెళ్తున్నాం నాన్న’ అన్న వాయిస్ రాగానే.. ‘మహా చక్రవర్తి బింబిసార ఏలిన రాజ్యానికి’ అన్న డైలాగ్ మీద ట్రైలర్ విజువల్స్ స్టార్ట్ అయ్యాయి. ”ఓ సమూహం తాలుకూ ధైర్యాన్ని ఓ ఖడ్గం శాశిస్తే.. కొన్ని వందల రాజ్యాలు ఆ ఖడ్గానికి తలవొంచి బానిసలైతే.. అదే ‘బింబిసారుడి విజయం.

ఆ విజయాన్ని ఆస్వాదించడానికి ఆ బింబిసారుడి మళ్లీ పుడితే.. అనే కోణంలో తెరకెక్కిన ఈ సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. పొగరుతో ఓ రాజ్యం మీసం మెలేసినట్టు.. కళ్యాణ్ రామ్ ఈ సినిమాతో తన మీసం మెలేశాడు. మొత్తానికి ఈ ట్రైలర్ అయితే కళ్యాణ్ రామ్ నెత్తుటి సంతకం అన్నట్టు సాగింది.
ముఖ్యంగా కల్యాణ్ రామ్ కత్తి పట్టుకుని చేసిన విన్యాసాలు.. ఆయన కెరీర్ లోనే బెస్ట్ విజువల్స్. నందమూరి అభిమానులకు ఈ విన్యాసాలు ఫుల్ కిక్ ను ఇస్తున్నాయి. ఇన్నాళ్లు విజయమో, వైఫల్యమో – ఏదీ పట్టించుకోకుండా ప్రయోగాల చేసిన కల్యాణ్ రామ్ కి ఈ సారి ఘనవిజయం దక్కేలా ఉంది. బాక్సాఫీస్ వద్ద బింబిసార ఏక ఛాత్రాధిపత్యం ఖాయంలా ఉంది.
[…] […]
[…] […]