Actor Jayaram: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీకి పాన్ ఇండియాలో గొప్ప ఆదరణ దక్కుతోంది. బాహుబలి సినిమాతో ఇండియాలో తెలుగు సినిమా ఇండస్ట్రీ నెంబర్ వన్ ఇండస్ట్రీ గా మారింది. అప్పటినుంచి ఇప్పటివరకు మన స్టార్ హీరోలందరు వరుస సక్సెస్ లను సాధిస్తున్నారు. బాలీవుడ్ హీరోలకు సాధ్యం కానీ రీతిలో డిఫరెంట్ సినిమాలను చేస్తూ ప్రేక్షకులందరిని మెప్పిస్తూ ఉండటం విశేషం…ఇక ఇలాంటి క్రమంలోనే పలు భాషల నటులు సైతం తెలుగు సినిమాల్లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మలయాళం నటుడు అయిన జయరామ్ సైతం తెలుగు సినిమాల్లో నటిస్తున్నాడు. తివిక్రమ్ దర్శకత్వం లో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ‘అలా వైకుంఠపురం లో’ సినిమాలో అల్లు అర్జున్ ఫాదర్ క్యారెక్టర్ లో నటించాడు… ఇక ఈ సినిమాలో డైలాగులు చెప్పే సందర్భంలో ప్రాంప్టింగ్ ఇస్తాం అంటే జయరామ్ ఒప్పుకోలేదట.
తనే ఓన్ గా డైలాగులు చెప్పడానికి ప్రయత్నం చేశాడు. కానీ తనకు తెలుగు సరిగ్గా రాకపోవడంతో ఆ డైలాగులు అంత పర్ఫెక్ట్ గా సెట్ అవ్వలేదట. దాంతో చేసేదేమీ లేక తన ఎదురుగా ఉన్న అల్లు అర్జున్ నుదుటి మీద డైలాగ్ పేపర్ అంటించాడట. తన ఛాతి దగ్గర కూడా డైలాగ్ పేపర్ ను అంటించి తన నుదుటి వైపు చూస్తూ కొన్ని డైలాగులు చెప్పారట.
అలాగే తన ఛాతి దగ్గర చూసుకుంటూ మరికొన్ని డైలాగులు చెప్పాడట. ఈయన మలయాళం లోనే ఎఫ్ఎం చానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు…పర భాష నటులు మన తెలుగులో సినిమా చేసినప్పుడు డైలాగులు చెప్పేటప్పుడు వన్ టు త్రీ లు లెక్కబెడుతూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో క్లోజ్ షాట్స్ తీసినప్పుడు లిప్ సింక్ అనేది సరిగ్గా ఉండదు. దానివల్ల ప్రాంటింగ్ తీసుకుంటూ ఉంటారు.
కానీ మరి కొందరు మాత్రం ఇలాంటి జిమ్మిక్కులు చేస్తూ తమ డైలాగులను పర్ఫెక్ట్ గా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మొత్తానికైతే ఒక ఆసక్తికరమైన విషయాన్ని ఆయన బయటపెట్టాడు. అల్లు అర్జున్ నుదుటిమీద ఏముందో తనకు మాత్రమే తెలుసు అంటూ ఫన్నీగా డైలాగులు చెబుతూ నవ్వుకున్నాడు. ఇక జయరాం తెలుగులో భాగమతి, అలా వైకుంఠపురంలో, ధమాకా, గేమ్ చేంజర్, మిరాయ్ లాంటి సినిమాల్లో నటించి నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు…
