Homeఆంధ్రప్రదేశ్‌RK Roja viral video: ఓపెన్ అయిపోయిన రోజా.. వీడియో వైరల్!

RK Roja viral video: ఓపెన్ అయిపోయిన రోజా.. వీడియో వైరల్!

RK Roja viral video: ఏపీలో( Andhra Pradesh) రాజకీయాలు హాట్ హాట్ గా మారుతున్నాయి. ప్రధానంగా టిటిడి లడ్డూ తయారీకి సంబంధించి నెయ్యి కల్తీ పై ఆరోపణలు, ప్రత్యరోపణలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే అంబటి రాంబాబు ఎపిసోడ్ హీట్ పుట్టించింది. ఇంకోవైపు జోగి రమేష్ ఇంటిపై దాడి కూడా ఉద్రిక్తతలకు దారితీసింది. ఎవరికివారుగా కల్తీ నెయ్యికి సంబంధించి ఆరోపణలు చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లను సందర్శించారు. అయితే మాజీ […]

RK Roja viral video: ఏపీలో( Andhra Pradesh) రాజకీయాలు హాట్ హాట్ గా మారుతున్నాయి. ప్రధానంగా టిటిడి లడ్డూ తయారీకి సంబంధించి నెయ్యి కల్తీ పై ఆరోపణలు, ప్రత్యరోపణలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే అంబటి రాంబాబు ఎపిసోడ్ హీట్ పుట్టించింది. ఇంకోవైపు జోగి రమేష్ ఇంటిపై దాడి కూడా ఉద్రిక్తతలకు దారితీసింది. ఎవరికివారుగా కల్తీ నెయ్యికి సంబంధించి ఆరోపణలు చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లను సందర్శించారు. అయితే మాజీ మంత్రి రోజా, జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించిన నేపథ్యంలో సోషల్ మీడియాలో ఒక వీడియో బయటకు వచ్చింది. విపరీతంగా వైరల్ అవుతోంది.

అంతర్గత వ్యాఖ్యలు..
నిన్ననే జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ) జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించారు. అంతకుముందే రోజా జోగి రమేష్ ను పరామర్శించారు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య జరిగిన అంతర్గత సమావేశం వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో రోజా మాట్లాడుతూ.. తప్పు చేసాం.. దేవుడితో పెట్టుకున్నాం.. యేసయ్య నుంచి తిరుపతి వెంకటేశ్వర వరకు ఏం చేస్తారో అన్న భయం అందరిలోనూ ఉంది. బయటకు మాత్రం బింకంగా మాట్లాడుతున్నాం.. నిజంగా తప్పు చేస్తే ఊరుకుంటారా? ఈ విషయం జనాలకు బాగా అర్థమవుతోంది.. అని రోజా అన్నట్లు వినిపిస్తోంది. దీనికి స్పందించిన జోగి రమేష్ ఈ అంశాన్ని నేషనల్ మీడియా బాగా కవర్ చేస్తోంది. ఇది ఇప్పటికే నేషనల్ న్యూస్ అయిపోయింది. పార్లమెంటులో కూడా దీనిపై మాట్లాడుతున్నారు అంటూ పరిస్థితి తీవ్రతను ప్రస్తావించినట్లు ఉన్నారు.

విపరీతంగా షేరింగ్..
అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో( social media) బయటకు రావడంతో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. విపరీతంగా వైరల్ అవుతుంది. అదే స్థాయిలో షేర్ చేస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో ఈ కల్తీ వ్యవహారం ఆందోళన రేపుతోందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ వీడియో పూర్తిగా ఎడిట్ చేసిందని.. ఆడియో మార్చేశారని వైసీపీ శ్రేణులు ఖండిస్తున్నాయి. వైసీపీ మద్దతుదారులు ఒరిజినల్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. మొత్తానికి అయితే ఈ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో పెను దుమారానికి కారణం అవుతోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper