Homeఎడ్యుకేషన్SCCL Jobs 2021: నిరుద్యోగులకు అలర్ట్.. సింగరేణిలో 177 క్లరికల్ ఉద్యోగ ఖాళీలు?

SCCL Jobs 2021: నిరుద్యోగులకు అలర్ట్.. సింగరేణిలో 177 క్లరికల్ ఉద్యోగ ఖాళీలు?

SCCL Jobs 2021: SCCL Notification 2021 Will Be Released SoonSCCL Jobs 2021: ప్రముఖ సంస్థలలో ఒకటైన సింగరేణి సంస్థ నిరుద్యోగులకు తీపికబురు చెప్పింది. 177 క్లరికల్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. త్వరలోనే ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. సింగరేణి సంస్థ డైరెక్టర్ బలరాం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. రాతపరీక్ష ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది.

సింగరేణిలో ఉద్యోగ ఖాళీల భర్తీ పారదర్శకంగా జరగనుందని బలరాం తెలిపారు. నిరుద్యోగులు ఎవరి మాటలను నమ్మి మోసపోవద్దని అక్రమాలు, ఆరోపణలకు తావు లేకుండా ఈ పరీక్షల నిర్వహణ జరగనుందని బలరాం చెప్పుకొచ్చారు. ఈ నెల 25వ తేదీన జరిగే సమావేశంలో సంస్థ సాధించిన లాభాలకు సంబంధించిన వివరాలను చెబుతామని బలరాం వెల్లడించారు. దసరా సమయానికి లాభాల్లో కార్మికుల వాటా గురించి సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని బలరాం చెప్పుకొచ్చారు.

ఎవరైతే సింగరేణి నుంచి బొగ్గును కొనుగోలు చేశారో వాళ్లు వారం రోజుల్లోగా బకాయిలను చెల్లించాలని బలరాం సూచనలు చేశారు. బకాయిలను చెల్లించని పక్షంలో 7.5 శాతం వడ్డీ విధిస్తామని బలరాం వెల్లడించారు. బకాయిలపై వడ్డీ విధిస్తే సంస్థకు ఏకంగా 100 కోట్ల రూపాయల లాభం రానుందని సమాచారం. ఈ ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్ రిలీజైన తర్వాత దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది.

దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సింగరేణి సంస్థ త్వరలో పరీక్ష తేదీని కూడా వెల్లడించే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper