జమ్మూలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నిరుద్యోగులకు తీపికబురు చెప్పింది. వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు ఈ సంస్థ నుంచి తాజాగా మరో జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా నాన్ టీచింగ్ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. మొత్తం 34 ఉద్యోగ ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుండగా నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుందని చెప్పవచ్చు.
ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ ఇంజనీర్, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీలతో పాటు టెక్నికల్ ఆఫీసర్, సైంటెఫిక్ ఆఫీసర్ ఉద్యోగ ఖాళీలు కూడా భర్తీ కానున్నాయి. డిగ్రీ, బీఈ/ బీటెక్, మాస్టర్స్ డిగ్రీ, ఎంఈ/ ఎంటెక్, పీహెచ్డీ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత పనిలో అనుభవం ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీల ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. 31 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆన్ లైన్ విధానం ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాలి. రాతపరీక్ష, ఇంటర్వ్యూ, కంప్యూటర్ టెస్ట్, ప్రొఫిషియన్సీ టెస్ట్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరగనుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు లేదు. మిగిలిన వాళ్లకు 1,000 రూపాయలు దరఖాస్తు ఫీజుగా ఉండనుంది.
https://iitjammu.ac.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. నిరుద్యోగులకు జాబ్ నోటిఫికేషన్ ద్వారా భారీస్థాయిలో ప్రయోజనం చేకూరనుంది. ఉద్యోగులు ఏవైనా సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Read MoreWeb Title: Non teaching jobs in iit jammu with a salary of rs 2 lakh
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com