MODI Pakistan: ఒకప్పుడు అఖండ భారతదేశం. అన్ని దేశాలు కలిసి భారత రాజ్యం కొనసాగేది. ఆ తరువాత ఎవరికి వారు వేరైనా కొన్ని సాంప్రదాయాలు, పద్ధతులు మాత్రం ఒక్కటిగానే కనిపిస్తాయి. ఇండియాలోని కొన్ని పద్ధతులు పక్కనున్న పాకిస్తాన్ తో పాటు ఇతర దేశాల్లో కనిపిస్తాయి. ఇక రాజకీయ నాయకుల ప్రవర్తన కూడా ఒకరిని పోలి మరొకరు ఉంటారని అర్థమవుతోంది. ఏడేళ్లుగా అధికారంలో పీఎం పీఠంపై కూర్చున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాలనలో తిరుగులేకుండా కొనసాగిస్తున్నారు. మొదటి ఐదేళ్లు ఏమాత్రం డౌట్ లేకుండా సక్సెస్ గా నడిపించారని భావించారు. దీంతో ఈయనే మరోసారి ప్రధాని కావాలని రెండో సారి గెలిపించుకుని ప్రధాని సీట్లో కూర్చోబెట్టారు. అయితే రెండోసారి అధికారంలోకి వచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాలనతో అవకతవకలు ఏర్పడ్డాయి. పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ వలె మోదీ ప్రవర్తిస్తున్నాడా..? అన్న చర్చ హాట్ హాట్ గా సాగుతుంది.

ఈ మధ్య భారత ప్రధాని నరేంద్ర మోదీ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు పాకిస్తాన్ ప్రధాని వలె ఉంటున్నాయని అంటున్నారు. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తీసుకున్న నిర్ణయాలతో ఆ దేశం ఇప్పటికే సర్వనాశనం అయింది. పేదరికం పెరిగింది.ద్రవ్యోల్బణం పెరిగింది. పాకిస్తాన్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.135 ఉంది. గ్యాస్ సిలెండర్ ధర రూ. 2300 దాటింది. దీంతో నిత్యవసర ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. ఇక్కడి ప్రజలు రోజూవారీ తిండి కోసమే పనిచేయాల్సిన అవసరం ఏర్పడింది. ఇక ఉద్యోగాలు, అభిృద్ధి దేవుడెరుగు. ఈనేపథ్యంలో ప్రజల్లో సహనం కరిగిపోయింది. ప్రభుత్వంపై తిరగబడడం మొదలుపెట్టారు. ఏ దేశ ప్రజలైనా ఒక స్థాయి వరకు సహనాన్ని భరిస్తారు. ఆ తరువాత ఎంతటి వారైనా తిరగబడక తప్పదు. ఇప్పుడు పాకిస్తాన్ లో అదే జరుగుతోంది. ప్రజలు తిరగబడుతున్నారు. మాకీ ప్రధాని వద్దని ఆందోళన చేస్తున్నారు. ఎలాగైనా సరే ప్రధాని గద్ద దిగాలని డిమాండ్ చేస్తున్నారు.
అయితే భారత దేశ పరిస్థితులు కూడా ఇంచుమించుగా అదే దిశగా వెళ్తున్నాయని కొందరు అంటున్నారు. ముఖ్యంగా అడ్డూ, అదుపు లేకుండా పెరుగుతున్న పెట్రో ధరలతో సామాన్యుల బెంబేలెత్తుతున్నారు. పెట్రో ధరల కారణంగా నిత్యావసర ధరలు పెరుగుతున్నాయి. పెట్రో ధరల అంతర్జాతీయ సమస్య అని చెబుతున్న మోదీ ప్రజల కోసం ఎలాంటి నిర్ణయం తీసుకోరా…? అని ప్రశ్నిస్తున్నారు. ఇక బీజేపీ నాయకులు అప్పుడప్పడు చేసే కొన్ని కామెంట్లు చికాకు పుట్టిస్తున్నాయి. కొందరు పెట్రో ధరలు తగ్గించడం కుదరదు.. ఖర్చులు తగ్గించుకోవాలని ఉచిత సలహాలు ఇస్తున్నారు.
ఇప్పటికే రైతు చట్టాల విషయంలో మోదీపై వ్యతిరేకత మొదలైంది. ఇక పెట్రోల్ ధరల కారణంగా సామాన్యుడు సైతం మోదీపై విరుచుకుపడుతున్నారు. దీంతో పాకిస్తాన్ ప్రధానికి ఎదురవుతున్న డిమాండ్లు మోదీకి కూడా ఎదురుకానున్నాయా..? అన్నచర్చ సాగుతోంది. పెట్రోల్ ధరలపై ప్రజలపై వస్తున్న వ్యతిరేకత బీజేపీకి తెలియింది కాదు. కానీ ఆ విషయంలో మాత్రం ఎలాంటి కామెంట్ చేయకుండా రేట్లు పెంచుకుంటూ పోతుండడంపై సామాన్య జీవనంపై తీవ్ర ప్రభావం పడుతుంది. దీంతో జై మోదీ అన్నవాళ్లు ఇప్పడు వద్దు మోదీ అనే వాళ్లు తయారవుతున్నారని అంటున్నారు.
పాకిస్తాన్ లో ఆందోళనకు కారణం అక్కడి పరిస్థితులు తీవ్రం కావడం. అయితే రాను రాను భారత్లోనూ అదే సీన్ కనిపించే అవకాశం లేకపోలేదని అంటున్నారు. మరి మోదీ ఇప్పటికైనా అప్రమత్తతో వ్యవహరించి మరోసారి అధికారంలోకి వస్తారా..? లేక ఎప్పటిలాగే మౌనంగా ఉండి వ్యతిరేకత పొందుతారా..? అన్న విశ్లేషణ సాగుతోంది. రాను రాను ఏం జరుగుతుందో చూడాలి..