Ameesha Patel : ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించిన హీరోయిన్స్ లో ఒకరు అమీషా పటేల్(Ameesha Patel). బాలీవుడ్ లో దాదాపుగా అందరి స్టార్ హీరోలతో కలిసి సినిమాలు చేసిన ఈమె, తెలుగు లో పవన్ కళ్యాణ్ తో బద్రి,మహేష్ బాబు తో నాని, ఎన్టీఆర్ తో నరసింహుడు వంటి చిత్రాలు చేసింది. వీటిల్లో బద్రి తప్ప, మిగిలిన రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అయినప్పటికీ కూడా ఈమెకు టాలీవుడ్ లో మంచి ఆఫర్స్ వచ్చాయి. కానీ బాలీవుడ్ భారీ రెమ్యూనరేషన్స్ ఇస్తుండడంతో ఈమె అక్కడే స్థిరపడింది. ఈమధ్య కాలం లో ఈమె హీరోయిన్ గా నటించిన ‘గద్దర్ 2’ ఒక్కటే కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. మిగిలిన సినిమాల్లో క్యారక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తూ ఇప్పటికీ ఫుల్ బిజీ గానే గడుపుతుంది. అయితే రీసెంట్ గా ఈమె ఇచ్చిన ఒక బోల్డ్ ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.
మీకు బాగా ఇష్టమైన హీరో, అతని కోసం ఏది చేయడానికైనా సిద్ధం అనిపించే హీరో ఎవరైనా ఉన్నారా అని యాంకర్ అడిగిన ప్రశ్నకు అమీషా పటేల్ సమాధానం చెప్తూ ‘నాకు చిన్నతనం నుండి టామ్ క్రూజ్ అంటే పిచ్చి ఇష్టం. అతను నా క్రష్. చేసుకుంటే ఇలాంటి వాడినే పెళ్లి చేసుకోవాలని అనిపించేది. నా పుస్తకాల్లో కూడా అతని ఫోటోలు ఉండేవి. నా బెడ్ రూమ్ లో ఇప్పటికీ టామ్ క్రూజ్ ఫొటోలతో నిండిపోయి ఉంటుంది. జీవితం లో ఒక్కసారైనా అతన్ని కలవాలని నా కోరిక. అతను పిలిస్తే ఎక్కడికి వెళ్లడానికైనా సిద్ధం, చివరికి ఒక రాత్రి తనతో గడపమని అడిగినా గడుపుతాను. అంత పిచ్చి నాకు’ అంటూ అమీషా పటేల్ చేసిన బోల్డ్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా ని ఊపేస్తున్నాయి.
ఒకప్పుడు ఇలాంటి బోల్డ్ కామెంట్స్ చేయడానికి హీరోయిన్స్ చాలా తడబడేవారు, కానీ ఇప్పుడు డైరెక్ట్ గా మాట్లాడేస్తున్నారు. జెన్ జీ బ్యాచ్ ఎక్కువగా ఇలాంటి మాటలకు ఆకర్షితులు అవుతున్నారు కాబట్టి, ఈ స్థాయి సెలబ్రిటీలు కూడా ముందు వెనుక ఆలోచించకుండా మనసులో ఉన్న మాటల్ని బహిరంగంగా చెప్పేస్తున్నారు. ఇక అమీషా పటేల్ విషయానికి వస్తే ఈమెకు మొదటి నుండి ఇలా ఏదైనా ఓపెన్ గా మాట్లాడడం అలవాటు. గతం లో ఆమెకు ఇవి చాలా ఇబ్బందులను తెచ్చిపెట్టాయి, అయినప్పటికీ కూడా ఆమె మాట తీరు ఇసుమంత కూడా మారకపోవడం గమనించాల్సిన విషయం.