Nagavamsi – Raviteja : ‘దేవర’ వంటి భారీ బ్లాక్ బస్టర్ తో మంచి ఊపు మీదున్న ఎన్టీఆర్(Junior NTR), బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తూ చేసిన చిత్రం ‘వార్ 2′(War 2 Movie). హృతిక్ రోషన్(Hrithik Roshan) హీరోగా నటించిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ విలన్ గా నటించాడు. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఈ నెల 14న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదలైన ఈ చిత్రం, మొదటి ఆట నుండే ఘోరమైన డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది. ఫలితంగా ఎన్టీఆర్ కెరీర్ లోనే ఎన్నడూ చూదంతా ఘోరమైన పరాభవం ని థియేటర్స్ లో చూడాల్సి వచ్చింది ఈ చిత్రం. మొదటి రోజు రావాల్సిన వసూళ్లు, ఫుల్ రన్ లో కూడా రాలేదు. ఎన్టీఆర్ స్టార్ స్టేటస్ పరువు మొత్తం గంగలో కలిపేసింది ఈ చిత్రం. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత నాగవంశీ(Nagavamsi) చేసిన కొన్ని కామెంట్స్ అప్పట్లో ఎంతటి దుమారం రేపాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
ఆయన మాట్లాడూతూ ‘ఎన్టీఆర్ అన్నని బాలీవుడ్ లోకి తీసుకెళ్లడం కాదు, హృతిక్ రోషన్ గారినే టాలీవుడ్ కి తీసుకొచ్చినట్టు ఉంది కదా?.. దేవర చిత్రానికి ఎంత ఓపెనింగ్ ఇచ్చామో, దానికి పది రెట్లు ఓపెనింగ్ ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో ఇవ్వాలి. బాలీవుడ్ కంటే టాలీవుడ్ లోనే ఎక్కువ వసూళ్లు రావాలి’ అంటూ అభిమానులను, ప్రేక్షకులను డిమాండ్ చేసాడు. ఎవరైనా మా సినిమాని ఆదరించండి అని రిక్వెస్ట్ చెయ్యాలి కానీ, డిమాండ్ చేయడం ఏంటి?, ఆడియన్స్ మీ కంటికి బానిసలు లాగా కనిపిస్తున్నారా?, రెండు మూడు హిట్స్ పడేసరికి ఇంత బలుపు అవసరమా అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ నిర్మాత నాగవంశీ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే దీనిపై మాస్ మహారాజ రవితేజ(Mass Maharaja Raviteja) కూడా ఫన్నీ సెటైర్స్ విసిరాడు. నాగవంశీ లేటెస్ట్ గా రవితేజ ని పెట్టి ‘మాస్ జాతర'(Mass Jathara Movie) అనే చిత్రాన్ని నిర్మించాడు.
ఈ సినిమా ఈనెల 31వ తేదీన గ్రాండ్ గా విడుదల కాబోతున్న సందర్భంగా మూవీ టీం మొత్తం ప్రొమోషన్స్ లో ఫుల్ బిజీ గా గడుపుతుంది. అందులో భాగంగా రవితేజ, నాగవంశీ కలిసి ఒక ఇంటర్వ్యూ చేశారు. మ్యాడ్ స్క్వేర్ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ ఈ ఇంటర్వ్యూ కి హోస్ట్ గా వ్యవహరించాడు. ఆ సంఘటన ని నాగవంశీ గుర్తు చేసుకుంటూ ‘ఆరోజు నేను కాస్త అతి చేశాను’ అని అంటాడు. దానికి రవితేజ ‘చాలా అతి చేసావ్’ అని అంటాడు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘ఆరోజు మనోడు ఆడియన్స్ ని రిక్వెస్ట్ చేసినట్టు లేదు..వార్నింగ్ లాగా ఉంది. నా కొడకల్లారా మా సినిమాకి రాకపోతే చెప్తా మీ పని అనే టోన్ లో చెప్పాడు మనోడు’ అని అంటాడు రవితేజ. అప్పుడు నాగవంశీ సమాధానం చెప్తూ ‘తప్పులు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఆరోజు ఇండియా లోనే టాప్ మోస్ట్ ప్రొడ్యూసర్ ని గుడ్డిగా నమ్మి అలాంటి సవాళ్లు చేసాను..మిస్ ఫైర్ అయ్యింది, ఏమి చేస్తాము..అందరూ వేసుకున్నారు’ అని అంటాడు నాగవంశీ.
#RaviTeja makes fun of Naga Vamsi’s statement at the #War2 pre-release eventpic.twitter.com/juGf2jkO41
— Daily Culture (@DailyCultureYT) October 21, 2025