spot_img
Homeఎడ్యుకేషన్పది పాసైన యువతులకు శుభవార్త.. మిలటరీ పోలీస్ ఉద్యోగాలు..?

పది పాసైన యువతులకు శుభవార్త.. మిలటరీ పోలీస్ ఉద్యోగాలు..?

ఇండియన్ ఆర్మీ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఈ మధ్య కాలంలో వరుస నోటిఫికేషన్లను విడుదల చేస్తున్న ఇండియన్ ఆర్మీ తాజాగా యువతుల కోసం ప్రత్యేక నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. 100 ఆర్మీ జనరల్‌ డ్యూటీ ఉద్యోగ ఖాళీల కోసం నోటిఫికేషన్ రిలీజ్ కాగా పది పాసైన యువతులకు ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. పదో తరగతి ఉత్తీర్ణులైన 21 ఏళ్ల లోపు యువతులు ఈ ఉద్యోగాలకు అర్హులు.

యువతుల కొరకు ప్రత్యేకంగా ఈ నోటిఫికేషన్ రిలీజ్ కావడం గమనార్హం. ఆన్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి గల మహిళా అభ్యర్థులు అధికారిక వెబ్‌ సైట్‌ http://www.joinindianarmy.nic.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 6వ తేదీ నుంచి జులై 20వ తేదీ మధ్య పది పాసైన యువతులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

అంబాలా, లక్నో, బబల్‌పూర్‌, బెల్గాం, పూణే మరియు షిల్లాంగ్‌ వద్ద ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన రిక్రూట్మెంట్ ర్యాలీ జరగనుందని సమాచారం. ఎవరైతే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటారో వారికి ఈ మెయిల్ ద్వారా ఉద్యోగాలకు సంబంధించిన అడ్మిట్ కార్డులు అందుతాయి. కామన్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామినేషన్‌, ఫిజికల్‌ టెస్ట్‌ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.

నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. మహిళా నిరుద్యోగులకు ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

India student protests : నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక ల నమూనా భారత్ లో ఎందుకు సక్సెస్ కాదు?

India student protests : దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు క్రమంగా ఉధృతమవుతున్నాయి. ప్రారంభంలో వందల సంఖ్యలో సాగిన నిరసనలు ఇప్పుడు వేలాదిమందిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ వ్యవహారం, పరీక్షల పారదర్శకతపై...
Jana Nayagan Advance Bookings

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఓపెనింగ్ రికార్డు ని బ్రేక్ చేయకుండానే రిటైర్ అయిపోయిన సీఎం విజయ్..

Pawan Kalyan : ఈమధ్య కాలం లో సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ , విజయ్ ల మధ్య పోలికలు పెడుతూ , అభిమానుల మధ్య జరుగుతున్న ఫ్యాన్ వార్స్ ని మన...
Venkatesh Kalyan Ram Movie

Anil Ravipudi Movie : వెంకటేష్ , అనిల్ రావిపూడి కొత్త సినిమా మేకింగ్ వీడియో వచ్చేసింది.. ఈ...

Anil Ravipudi Movie : వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వం లో రీసెంట్ గానే ఒక సినిమా మొదలైన సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ , కృతి శెట్టి...
CBI Probe into Kaleshwaram Project

Revanth Reddy : మేడిగడ్డలో కాలేసిన రేవంత్‌రెడ్డి.. మొన్న లిఫ్టింగ్‌ కుదరదని.. నేడు కేంద్రానికి లేఖ!

Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి.. ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌పై ఎప్పుడు తనదే పైచేయి అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ప్రతిపక్షం రేవంత్‌ ఏ మిషయంలోనూ తమకు పోటీ కాదని విమర్శలు...
R Madhavan

R Madhavan: హీరో మాధవన్ అదృశ్యం.. విద్యార్థుల గాలింపు.. అసలు ఏమి జరిగిందంటే..

R Madhavan: ఢిల్లీ లోని పార్లమెంట్ ఆవరణలో గత కొద్దీ రోజుల నుండి కాక్రోచ్ పార్టీ ఆద్వర్యం లో జరుగుతున్న విద్యార్థుల నిరసన కార్యక్రమాలు ఏ రేంజ్ లో జరుగుతున్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం...
Oktelugu Epaper