
షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) అవివాహిత మహిళ, పురుష అభ్యర్థులకు తీపికబురు అందించింది. పురుషులు, మహిళల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. డిగ్రీ లేదా తత్సమాన అర్హత కలిగిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. జులై 15వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండటం గమనార్హం.
http://joinindianarmy.nic.in/ ద్వారా అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. మొత్తం 55 ఉద్యోగ ఖాళీలు ఉండగా ఎన్‌సీసీ పురుషులకు 50 ఉద్యోగ ఖాళీలు ఉంటే ఎన్‌సీసీ మహిళలకు 5 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ లేదా తత్సమాన అర్హత కలిగిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
19 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. షార్ట్‌లిస్టింగ్, ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఆన్ లైన్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులను కేవలం ఆన్ లైన్ లో మాత్రమే స్వీకరించడం జరుగుతుంది. ఆఫీసర్ ఎంట్రీ అప్లికేషన్/ లాగిన్ పై క్లిక్ చేసి ఆ తర్వాత రిజిస్ట్రేషన్ పై క్లిక్ చేసి ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను నింపాల్సి ఉంటుంది.
నిరుద్యోగులకు ఈ నోటిఫికేషన్ ద్వార ప్రయోజనం చేకూరనుండగా ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఎటువంటి సందేహాలు ఉన్నా http://joinindianarmy.nic.in/ వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకునే అవకాశం అయితే ఉంటుంది.