Homeఎడ్యుకేషన్CBSE Exams: ఏడాదికి రెండుసార్లు సీబీఎస్‌ఈ పరీక్షలు.. విద్యావ్యవస్థపై కేంద్రం ప్లాన్ ఇదే!

CBSE Exams: ఏడాదికి రెండుసార్లు సీబీఎస్‌ఈ పరీక్షలు.. విద్యావ్యవస్థపై కేంద్రం ప్లాన్ ఇదే!

CBSE Exams: సీబీఎస్‌ఈ టెన్త్, ఇంటర్‌ పరీక్షలు ఇకపై ఏడాదికి రెండుసార్లు నిర్వహించే కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ కసరత్తు చేస్తోంది. 2025–26 విద్యా సంవత్సరం నుంచి ఈ కొత్త విధానం అమలుచేసేలా వ్యూహ రచన చేస్తోంది. ఈమేరకు సీబీఎస్‌ఈకి ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.

సెమిస్టర్‌ ఆలోచన లేనట్లే..
అయితే ఈ పరీక్షల్లో సెమిస్టర్‌ విధానం ప్రవేశపెట్టే ఆలోచన లేదని సమాచారం. ఏడాదిలో రెండుసార్లు బోర్డు పరీక్షలను నిర్వహించే అంశంపై పాఠశాలల ప్రిన్సిపాళ్లతో మే నెలలో సమావేశం నిర్వహించనున్నట్లు సీబీఎస్‌ఈ అధికారులు తెలిపారు. అండర్‌ గ్రాడ్యుయేషన్‌ అడ్మిషన్ల షెడ్యూల్‌పై ఎలాంటి ప్రభావం లేకుండా రెండోసారి బోర్డు పరీక్షలు నిర్వహించేలా అకడమిక్‌ క్యాలెండర్‌ను సిద్ధం చేసే విధి విధానాలపై చర్చించి ప్రణాళిక రూపొందిచే అవకావం ఉంది. ఈ పనిలో సీబీఎస్‌ఈ అధికారులు ఇప్పటికే నిమగ్నమయ్యారు.

నూతన విద్యా విధనానికి అనుగుణం..
కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ నూతన విద్యా విధానానికి అనుగుణంగా సీబీఎస్‌ఈ పరీక్షల్లో మార్పులు చేయాలని నేషనల్‌ కరికులమ్‌ ప్రేమ్‌ వర్క్‌ ముసాయిదా కమిటీ సూచించింది. ఇస్రో మాజీ మాజీ చైర్మన్‌ కస్తూరిరంగన్‌ సారథ్యంలో కమిటీ 11, 12వ తరగతి విద్యార్థులకు సెమిస్టర్‌ విధానాన్ని ప్రతిపాదించింది. దీనిని గతేడాది ఆగస్టులో కేంద్ర విద్యామంత్రిత్వశాఖ విడుదల చేసింది.

తప్పనిసరి కాదు..
ఇదిలా ఉంటే.. ఏడాదిలో రెండుసార్లు బోర్డు పరీక్షలకు హాజరు కావడం తప్పనిసరి కాదు. ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశ పరీక్ష జేఈఈ మాదిరిగానే విద్యార్థులకు ఏడాదికి రెండుసార్లు పరీక్షలు రాసే అవకావం ఉంటుంది. ఏదో ఒకటి ఎంచుకునే అవకాశం విద్యార్థులకు ఉంటుంది. పరీక్షల్లో సాధించిన ఉత్తమ స్కోరును ఎంచుకోవచ్చు.

గతంలో సంస్కరణలు ఇలా..
సీబీఎస్‌ఈ బోర్డు విద్యావిధానంలో సంస్కరణలు చేస్తూనే ఉంది. 2000లో పదో తరగతికి సీసీఈ (కంటిన్యూస్, కాంప్రెహెన్సివ్‌ ఎవాల్యూషన్‌) విధానాన్ని ప్రవేశపెట్టారు. 2017లో దీన్ని ఎత్తేసి, మళ్లీ పాత విధానాన్నే అమలుచేశారు. ఇక కోవిడ్‌ సమయంలో 10, 12 తరగతుల వార్షిక పరీక్షలను ఏడాదికి రెండు విడతలుగా నిర్వహించింది. తర్వాత పాద పద్ధతినే కొనసాగించింది. మళ్లీ వచ్చే ఏడాది నుంచి ఏడాదికి రెండు పరీక్షలు నిర్వహించే ప్రణాళిక రూపొందిస్తోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper