CBSE Class 12th Admit Card 2025 : సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డ్ 10, 12వ తరగతుల అడ్మిట్ కార్డులను ఫిబ్రవరి 3న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఇవి అందుబాటులో ఉన్నాయి. వీటిని విద్యార్థులు డౌన్‌లోడ్ చేసుకుని ప్రిన్సిపాల్ సంతకం విద్యార్థులకు అందజేస్తాయి. 12వ తరగతి విద్యార్థులంతా తమ అడ్మిట్ కార్లును కచ్చితంగా పొందాలి. ఈ అడ్మిట్ కార్డులను విద్యార్థులు అన్ని పరీక్ష రోజులో వెంట తీసుకెళ్లాలి. అడ్మిట్ కార్డు లేకుండా ఏ విద్యార్థి కూడా పరీక్ష రాయలేదు. కేంద్రాల్లోకి అనుమతించరు. తాజా సమాచారం ప్రకారం ఫిబ్రరి 5న అడ్మిట్ కార్డులు విడుల చేసే అవకాశం ఉంది. ఇప్పటికే పరీక్షల తేదీలు ఖరారు అయిన నేపథ్యంలో అడ్మిట్ కార్డులు రెండు మూడు రోజుల్లో వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉండనున్నాయి.
పరీక్షలు ఇలా..
సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 14 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు జరుగనున్నాయి. పెన్ అండ్ పెన్సిల్ ఫార్మాట్‌లో నిర్వహిస్తారు. ప్రైవేటు విద్యార్థులు అయితే అధికారిక వెబ్‌సైట్ నుంచి లాగిన్ అయి అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక అన్ని పరీక్ష రోజుల్లో ఈ అడ్మిట్ కార్డును వెంట తీసుకెళ్లాలి. అడ్మిట్ కార్డుపై పేరు, రూల్ నంబర్, పరీక్ష తేదీలు మొదలైన సమాచారం ఉంటుంది. 2023–24 విద్యా సంవత్సరంలో ఫిబ్రవరి 5న అడ్మిట్ కార్డులను సీబీఎస్‌ఈ విడుదల చేసింది.
అడ్మిట్ కార్డులు ఇలా డౌన్‌లోడ్ చేసుకోవాలి…
మొదట అధికారిక వెబ్‌సైట్ https://www.cbse.gov.in/ ఓపెన్ చేయండి. తర్వాత పరీక్ష సంగం పోర్టల్‌కి వెళ్లాలి. పాఠశాలలో పరీక్ష సంగం పోర్టల్ ఇందులో ప్రీ–ఎగ్జామ్ యాక్టివిటీస్‌పై క్లిక్ చేయాలి. అడ్మిట్ కార్డ్, బోర్డ్ ఎగ్జామ్ 2025 సెంటర్ మెటీరియల్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. లాగిన్ వివరాలు ఎంటర్ చేయాలి. తర్వాత అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ చూసుకోవాలి.