Homeఎడ్యుకేషన్పది అర్హతతో 100 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. పరీక్ష లేకుండా..?

పది అర్హతతో 100 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. పరీక్ష లేకుండా..?

ర‌క్ష‌ణ శాఖ ప‌రిధిలోని ఏఎస్‌సీ సెంట‌ర్ సౌత్ (బెంగ‌ళూరు)-2 నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 100 గ్రూప్-సీ ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఏఎస్‌సీ సెంట‌ర్ సౌత్ విడుదల చేసిన ఉద్యోగ ఖాళీలలో సివిల్ మోటార్ డ్రైవ‌ర్‌, క్లీన‌ర్ కుక్, ఇతర ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. అర్హ‌త, ఆసక్తి క‌లిగిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే వకాశం ఉంటుంది. రాత‌ప‌రీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.

ఎవరైతే ఈ ఉద్యోగాలకు ఎంపికవుతారో వాళ్లు బెంగ‌ళూరులో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి జులై 12 చివరి తేదీగా ఉంది. https://www.indianarmy.nic.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవాల్సి ఉంది. మొత్తం 100 ఉద్యోగ ఖాళీలలో సివిల్ మోటార్ డ్రైవ‌ర్ 42 ఉద్యోగ ఖాళీలు, క్లీనర్ 40 ఉద్యోగ ఖాళీలు, కుక్ 15 ఉద్యోగ ఖాళీలు, సివిలియ‌న్ క్యాట‌రింగ్ ఇన్‌స్ట్ర‌క్ట‌ర్ 3 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి.

ప‌దో త‌ర‌గ‌తి ఉత్తీర్ణతతో పాటు డ్రైవ‌ర్ పోస్టుకు ఎల్ఎంవీ, హెచ్ఎంవీ లైసెన్స్‌, క్యాట‌రింగ్ ఇన్‌స్ట్ర‌క్ట‌ర్ పోస్టుకు క్యాట‌రింగ్‌లో డిప్లొమా కచ్చితంగా కలిగి ఉండాలి. ఇతర ఉద్యోగాలకు సంబంధిత రంగంలో అనుభవం ఉన్నవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. మెరిట్ ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా నిర్ణీత న‌మూనాలో ఉన్న ద‌ర‌ఖాస్తుల‌ను పూర్తిగా నింపి అవ‌స‌ర‌మైన స‌ర్టిఫికెట్ల‌ను జ‌త‌చేసి సంబంధిత చిరునామాకు పంపించాలి.

ఈ ఉద్యోగాలపై ఆసక్తి ఉన్నవాళ్లు బెంగళూరులోని సివీలియన్ డైరెక్ట్ రిక్రూట్ మెంట్ బోర్డుకు దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

Team India Bowling

Team India : ఈ స్క్రాప్ బౌలింగ్ తో వరల్డ్ కప్ కాదు కదా.. గ్రూప్ స్టేజీ దాటడం...

Team India : ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కేవలం బ్యాటర్ల కోసం మాత్రమే మైదానాలను రూపొందిస్తారు. అవన్నీ కూడా ప్లాట్ గా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిమెంట్ రోడ్ లాంటి మైదానాలు...

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...
OG 2 Animation Video

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...
KCR And Revanth Reddy

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...
Siddharth Emotional

Siddharth Emotional: స్టేజి పై వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన హీరో సిద్దార్థ్..వీడియో వైరల్..అసలు ఏమైందంటే!

Siddharth Emotional: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో హీరో సిద్దార్థ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం...
Oktelugu Epaper