
రక్షణ శాఖ పరిధిలోని ఏఎస్‌సీ సెంటర్ సౌత్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 100 గ్రూప్ సీ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. విడుదల చేసిన నోటిఫికేషన్ లో సివిల్ మోటార్ డ్రైవర్, క్లీనర్ కుక్ ఉద్యోగ ఖాళీలతో పాటు ఇతర ఉద్యోగాలు కూడా ఉన్నాయి. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.
ఎవరైతే ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికవుతారో వారు బెంగళూరులో పని చేయాల్సి ఉంటుంది. జులై 12వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉంది. https://www.indianarmy.nic.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. మొత్తం 100 ఉద్యోగ ఖాళీలలో సివిల్ మోటార్ డ్రైవర్ ఉద్యోగ ఖాళీలు 42, క్లీనర్ ఉద్యోగ ఖాళీలు 40, కుక్ ఉద్యోగ ఖాళీలు 15, సివిలియన్ క్యాటరింగ్ ఇన్‌స్ట్రక్టర్ ఉద్యోగ ఖాళీలు 3 ఉన్నాయి.
పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు డ్రైవర్ పోస్టుకు ఎల్ఎంవీ, హెచ్ఎంవీ లైసెన్స్, క్యాటరింగ్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టుకు క్యాటరింగ్‌లో డిప్లొమా ఉన్నవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. మిగిలిన ఉద్యోగాలకు సంబంధిత రంగంలో అనుభవం కచ్చితంగా ఉండాలి. మెరిట్ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఆఫ్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులను కంపెనీ బెంగళూరు అడ్రస్ కు పంపాల్సి ఉంటుంది.
https://www.indianarmy.nic.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. నిరుద్యోగులకు ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు.