Sampoornesh Babu: శీర్షిక కాస్త ఇబ్బందిగా ఉన్నప్పటికీ తప్పడం లేదు. నిజానికి సినిమా అనేది ఒక వర్గానికి.. ఒక వర్ణానికి సంబంధించింది కాదు. సినిమాలో ఉండే 24 విభాగాలలో ఒక్కొక్కరు ఒక పని చేస్తారు. వీరికి నేపథ్యాలతో సంబంధం లేదు. కులాలతో సంబంధం లేదు. ప్రాంతాలతో సంబంధం లేదు. జస్ట్ ఆ సినిమాకి పనికి వచ్చే విభాగాలలో నైపుణ్యం ఉంటే సరిపోతుంది.
సినీ పెద్దలలో చిరంజీవి లాంటి వాళ్లు పరిశ్రమకు యువ రక్తం కావాలని కోరుకుంటారు. ఎందుకంటే చిరంజీవి కూడా ఒకప్పుడు యువకుడే. ఆయన కూడా యంగ్ బ్లడ్ గా ఉన్నప్పుడే సినిమా పరిశ్రమలోకి వచ్చారు. సినిమా పరిశ్రమలో తనకంటూ ఒక ముద్ర వేసుకున్నారు. సినిమా పరిశ్రమను చిరంజీవికి ముందు చిరంజీవికి తర్వాత అన్నట్టుగా మార్చేశారు. ఇంత స్థాయి ఉన్నప్పటికీ చిరంజీవి ఏమాత్రం హిపోక్రసీ చూపించరు. ఎవరు పిలిచినా సరే కార్యక్రమాలకు వెళ్తుంటారు. సినిమాను ప్రమోషన్ చేస్తారు. అంతటి చిరంజీవి ఆ స్థాయిలో అణకువగా ఉన్నారు. చిరంజీవిని చూసి చాలా మంది పరిశ్రమలోకి వచ్చారు. చిరంజీవి లాగానే డౌన్ టు ఎర్త్ విధానాన్ని అవలంబిస్తున్నారు.
కొంతమంది సో కాల్డ్ జర్నలిస్టులకు ఇది నచ్చడం లేదు. ముఖ్యంగా తగ్గి ఉండే నటువంటి వీళ్లకు ఏమాత్రం ఒప్పడం లేదు.. పైగా ఇప్పుడు యూట్యూబ్ అందుబాటులోకి వచ్చింది కాబట్టి ప్రతి ఓడు కూడా జర్నలిస్ట్ అని బిల్డప్ ఇస్తున్నారు. చేతిలో మైక్ ఉండగానే తామేదో సమాజ ఉద్దారకులం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఎదుటివాళ్లను ప్రశ్నించేటప్పుడు తమకు ఉన్న స్థాయి ఏంటో మర్చి పోతున్నారు. పైగా డెమి గాడ్స్ మాదిరిగా బిహేవ్ చేస్తున్నారు. తాజాగా ఒక సో కాల్డ్ జర్నలిస్ట్ వ్యవహరించిన తీరు మీడియాలో ముఖ్యంగా సోషల్ మీడియాలో విపరీతమైన చర్చకు దారితీస్తోంది.
ది ప్యారడైజ్ సినిమాలో ఒక కీలకపాత్రను పోషించారు సంపూర్ణేష్ బాబు. ఎక్కడో సిద్దిపేట జిల్లాలో మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన సంపూర్ణేష్ బాబు తనను తాను నిరూపించుకున్నారు. పైగా ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు పెద్దపెద్ద స్టార్లు కూడా సహాయం చేయలేదు. కానీ సంపూర్ణేష్ బాబు తన దగ్గర ఉన్నదాంట్లో కొంతమేర సమాజ హితానికి ఇచ్చారు. ఇది అతడి ఒరిజినల్ క్యారెక్టర్. పైగా తనను తాను ఎప్పుడూ గొప్పగా చెప్పుకోడు. తనకు నచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళ్తాడు. వచ్చిన ఆఫర్లను కాదనకుండా సినిమాల్లో నటిస్తుంటాడు. శ్రీకాంత్ ఓదెలకు ప్యారడైజ్ సినిమాలో సంపూర్ణేష్ బాబు ఒక పాత్రకు సరిపోతాడు అనిపించింది. దానికి తగ్గట్టుగానే పాత్రను డిజైన్ చేశాడు. ఆ పాత్రలో సంపూర్ణేష్ బాబు జీవించేసాడు. చాలామంది అభిమానులు సంపూర్ణేష్ బాబు తెరమీద కనిపించగానే విజిల్స్ వేస్తున్నారు. ఇది అతడి రేంజ్.
కానీ ఒక సో కాల్డ్ సినిమా జర్నలిస్ట్ కి సంపూర్ణేష్ బాబు నచ్చలేదు. అసలు ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా నువ్వు ఎలా వచ్చావు.. అసలు నువ్వు సినిమా రంగానికి ఎలా సూట్ అవుతావని అనుకున్నావు.. అసలు పారడైజ్ లో అవకాశం వస్తుందని నువ్వు ఊహించవా.. అసలు సినిమాలోకి రావాలి అని దురద నీకు ఎలా వచ్చింది.. ఇదిగో ఇలా సాగిపోయింది ఆ సో కాల్డ్ జర్నలిస్ట్ ప్రశ్నల పరంపర. సంపూర్ణేష్ బాబును ప్రశ్నించే ముందు.. ఆ జర్నలిస్ట్ కూడా కొన్ని ప్రశ్నలు తనను తాను వేసుకొని ఉంటే బాగుండేది. ఎటువంటి జర్నలిజం నేపథం లేకుండా అతడు ఎందుకు ఈ ఫీల్డ్ లోకి వచ్చాడు.. తన ముఖానికి ఈ జర్నలిజం సూట్ అవుతుందని అనుకున్నాడా.. తనకు ప్రశ్నలే అడగడం రాదు కదా.. ఒక పాత్రికేయుడిగా ఎలా నిలబడతాడని అనుకున్నాడు.. వాస్తవానికి సంపూర్ణేష్ బాబు కాబట్టి అండీ, గారు అని సమాధానం చెప్పాడు. ఒకవేళ అతడి స్థానంలో మరొకరు ఉంటే కచ్చితంగా ఎడమకాలు చెప్పుతో గట్టిగా కొట్టేవారు. ఎవడ్రా నీకు జర్నలిజం ఉద్యోగం వచ్చింది.. ఎవడ్రా నిన్ను జర్నలిస్ట్ అని పిలుస్తున్నది అని కచ్చితంగా గల్లా లాగి అడిగేవారు.
ఎదుటి మనిషిని కనీసం గౌరవించలేని సంస్కార హీనమైన స్థితిలో జర్నలిస్ట్ ముసుగేసుకుని .. బతకడానికి సిగ్గుండాలి
సంపూర్ణేష్ బాబు .. కష్టపడి ఎదిగిన వ్యక్తి .. ఆదర్శ భావాలున్న మంచి మనిషి .. అలాంటి వ్యక్తిని ఇలాంటి నీచమైన ప్రశ్నలు అడగడం క్షమించరాని విషయం pic.twitter.com/fEyS78b4dw
— ASHOK VEMULAPALLI (@ashuvemulapalli) September 23, 2026