తమిళ సినిమా ఇండస్ట్రీకి, అక్కడి రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉంది. సినీ తారలే అక్కడి రాజకీయాలను శాసిస్తున్నారు. ప్రతి లూప్ హోల్స్ లోనూ వెతికి మరీ రచ్చ చేసుకోవడం తమిళులకు అలవాటు. ముఖ్యంగా ప్రముఖ నటుడు, రచయిత అయిన రాధారవి ఈ వివాదాల్లో ముందుంటారు. ఇప్పటికే ఆయన భాగోతాన్ని ప్రముఖ గాయని చిన్మయి బయటపెట్టింది. తాజాగా రాధారవి మరోసారి నోరుజారాడు. బీజేపీ తరుఫున ప్రచారం చేస్తున్న రాధారవి సంచలన వ్యాఖ్యలు చేశారు.డీఎంకే అధినేత స్టాలిన్ కుమారుడు, ప్రముక హీరో ఉదయనిధి స్టాలిన్, నయనతారతో సహజీవనం చేస్తున్నారని ఆరోపించారు. అంతేకాక మీ పార్టీతో నయనతారకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు.
గతంలోనూ రాధారవి నయన తారపై వ్యాఖ్యలు చేశారు. దానిపై అందరూ రాధారవిని తిట్టిపోశారు. ‘నేను నయన తారపై అనుచిత వ్యాఖ్యలు చేశానని నన్ను పార్టీ నుంచి బహిష్కరించాలని కొందరు వ్యాఖ్యానించారు.. నన్ను పార్టీ నుంచి బయటకు పంపించడానికి మీరెవరు..?’ అని రాధారవి కౌంటర్ ఇచ్చారు. రాధారవి తాజాగా కమలహాసన్ పై కూడా విరుచుకుపడ్డాడరు. ‘భార్యలను కాపాడుకోలేని కమలహాసన్ రాష్ట్రాన్ని ఎలా కాపాడుతాడని’ అన్నారు.
ఈసారి తమిళనాడులో డీఎంకే అధికారంలోకి వస్తుందని అందరూ భావిస్తున్నారు. ముఖ్యంగా ఆ పార్టీ అధినేత స్టాలిన్ కుమారుడు, సినీ నటుడు ఉదయనిధి స్టాలిన్ కూడా ప్రచారంలో పాలు పంచుకున్నాడు. ఈ క్రమంలోనే ఆయన టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తున్నారు.
తమిళనాడులో రాజకీయం వేడెక్కింది. రాజకీయ పార్టీలకు సినీ గ్లామర్ కూడ తోడయ్యింది. ఈ సాంప్రదాయం ఇక్కడా ఎన్నటి నుంచో వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రచారంలో సినీ నటులు ప్రచారంలోకి దిగి రచ్చ రచ్చ చేస్తున్నారు.. బీజేపీలో చేరిన ఖుష్బూ ఇప్పటికే ప్రచారాన్ని మొదలు పెట్టారు. అలాగే నమిత కూడా మద్దతునిస్తున్నారు. సినీ నటుడు రాధారవి తాజాగా ప్రముఖ నటి నయనతారపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Radharavi sensational comments on nayantara
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com